Ambanis Elite School Fee : అంబానీల స్కూలు అంటే ఆషామాషీ విషయమా? దాని నిర్వహణ కూడా అంతే రేంజులో ఉంటుంది. ముంబయిలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ (డీఏఐఎస్)ను 2003 సంవత్సరంలో పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ స్థాపించారు. ఆమె కుమార్తె ఇషా అంబానీ ఈ స్కూలుకు వైస్ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ స్కూల్‌లో అత్యున్నత విద్యా ప్రమాణాలను తు.చ తప్పకుండా పాటిస్తారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విద్యాబోధన ఉంటుంది. 21వ శతాబ్దపు సవాళ్లను ఎదుర్కొనేలా విద్యార్థులను సన్నద్ధం చేస్తారు. అందుకే ఈ పాఠశాలలో ప్రీ ప్రైమరీ క్లాసుల నుంచే ఫీజులు భారీగా ఉంటాయి. వాటి గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
ఫీజులు ఇవీ
2024 విద్యా సంవత్సరం కోసం ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో, కిండర్ గార్టెన్ విద్యార్థి వార్షిక ఫీజు దాదాపు రూ.1.40 లక్షలు ఉంది.
వార్షిక ఫీజులు :
- ఎల్‌కేజీ నుంచి 7వ తరగతి వరకు - రూ.1.70 లక్షలు
- 8వ తరగతి నుంచి 10వ తరగతి - రూ.5.90 లక్షలు
- ఇంటర్ (11&12 గ్రేడ్) - రూ.9.65 లక్షలు
ఈ ఫీజులలోనే పుస్తకాలు, స్టేషనరీ, యూనిఫామ్, రవాణా వసతి ఖర్చులు కూడా కవర్ అవుతాయి. ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ అందిస్తోంది. ఆర్థికంగా బలహీనంగా ఉన్న విద్యార్థులకు ఆర్థికసాయాన్ని కూడా అందిస్తుంది.
ఏమేం సౌకర్యాలు ఉన్నాయంటే?
ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ ముంబయిలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ ఏరియాలో ఉంది. ఈ పాఠశాలలో జాతీయ, అంతర్జాతీయ ధ్రువీకరణ పొందిన IGCSE, ICSE, IBDP ప్రోగ్రామ్‌ల ద్వారా విద్యార్థులకు విద్యను బోధిస్తారు. పిల్లలను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దేందుకుగానూ వారి సమగ్ర అభివృద్ధిపై దృష్టిసారిస్తారు. పాఠశాలలో సైన్స్ ల్యాబ్‌లు, కంప్యూటర్ తరగతులు, విశాలమైన ఆట స్థలాలు, 40వేల పుస్తకాలతో కూడిన లైబ్రరీ సహా అనేక సౌకర్యాలు ఉన్నాయి. స్కూల్ క్యాంపస్ 1.30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. తరగతి గదుల్లో డిజిటల్ గడియారాలు, లాకర్లు, డిస్‌ప్లే బోర్డులు, బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్, మల్టీమీడియా సహాయం, ఎయిర్ కండిషనింగ్, చక్కటి ఫర్నీచర్ ఉంటాయి.
ప్రముఖులు చదివింది ఇక్కడే
ఈ స్కూలులోనే ఆకాశ్ అంబానీ, ఇషాన్ ధావన్, శ్లోకా మెహతా అంబానీ సహా ఎంతోమంది ప్రముఖులు చదువుకున్నారు. ఖుషీ కపూర్, సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్, సుహానా ఖాన్, ఆర్యన్ ఖాన్, సారా తెందూల్కర్, అర్జున్ తెందూల్కర్, నైసా దేవగన్, అనన్య పాండే వంటి అనేక మంది ఇక్కడే చదివారు. ఈ స్కూల్‌లో జరిగేే స్పెషల్ ఈవెంట్స్‌లో ప్రసంగించేందుకు షారూఖ్ ఖాన్ వంటి విజయవంతమైన వ్యక్తులను ఆహ్వానిస్తుంటారు.
బాలీవుడ్ స్టార్లకు అంబానీ సర్ప్రైజ్- గిఫ్ట్‌గా రూ.2 కోట్ల వాచ్!