ETV Bharat / business

మీకు బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ ఉందా? అయితే ఈ జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి! - Bank savings account

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 11, 2024, 8:22 PM IST

Precautions For Savings Account : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఉంటోంది. ఈ అకౌంట్​ను జాగ్రత్తగా వినియోగించుకుంటే బోలెడు లాభాలు ఉన్నాయి. అందుకే ఈ స్టోరీలో పొదుపు ఖాతా నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.

Savings Accounts
Savings Accounts (ETV Bharat)

Savings Accounts : సాధారణంగా ఆర్థిక ప్రయాణం మొదలయ్యేది సేవింగ్స్ అకౌంట్​తోనే. ప్రతి వ్యక్తికీ ఇదొక ప్రాథమిక ఆర్థిక అవసరంగా పరిగణించాలి. అందుబాటులో అనేక బ్యాంకులున్నప్పటికీ, ఒకటి రెండు బ్యాంకులతోనే మన పొదుపు ఖాతా బంధం కొనసాగుతుంది. ఎంతో ప్రాముఖ్యం ఉన్న ఈ ఖాతా నిర్వహణలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే?

పొదుపు ఖాతాలు ఆర్థిక లక్ష్యాలు సాధించేందుకు, అత్యవసర నిధిని దాచుకునేందుకూ బాగా ఉపయోగపడతాయి. జీతం నుంచి ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే మొత్తం వరకూ అన్నీ ఇందులోకే వస్తుంటాయి. పొదుపు ఖాతాను ఓపెన్ చేయడంతోనే పని అయినట్లు కాదు. దాన్ని నిర్వహించడంలోనూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. లోన్ తీసుకోవాలన్నా మీ పొదుపు ఖాతానే బ్యాంకులు ముందుగా పరిశీలిస్తాయి. ఈ విషయాన్ని అస్సలు మర్చిపోవద్దు.

మరో అకౌంట్ ఓపెన్ చేయండి
జీతం లేదా ప్రాథమిక పొదుపు ఖాతా నుంచే ప్రతి చిన్న ఖర్చూ చేయవద్దు. దీని కోసం ప్రత్యేకంగా ఒక అకౌంట్​ను ఓపెన్ చేసి, నెలకు ఒకసారి దానిలో నిర్ణీత మొత్తం డిపాజిట్ అయ్యేలా చూసుకోండి. డిజిటల్‌ చెల్లింపు యాప్​లను ఉపయోగించేందుకు ఈ ఖాతానే లింక్ చేసుకోవడం ఉత్తమం. దీనివల్ల మీ ఖర్చులు ఎంత అవుతున్నాయనేదీ కచ్చితంగా తెలుసుకునేందుకు వీలు పడుతుంది.

సరైన బ్యాంకును ఎంచుకోండి
పొదుపు ఖాతాను ఓపెన్ చేసేందుకు ముందు సరైన బ్యాంకును ఎంచుకోండి. వివిధ బ్యాంకులు అందిస్తున్న ప్రయోజనాలపై కొంచెం తెలుసుకోండి. వడ్డీ రేట్లు, ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్, ఏటీఎం ఛార్జీలు ఇలా అన్నింటి వివరాలూ సరి చూసుకోవడం ముఖ్యం. ఇప్పుడు కొత్త తరం బ్యాంకులు రూ.రెండు లక్షలకు మంచి నిల్వ ఉన్న సేవింగ్స్ అకౌంట్ పై దాదాపు 7శాతం వరకూ వడ్డీని అందిస్తున్నాయి. ఒకవేళ సేవింగ్స్ ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే దానిపై విధించే పెనాల్టీలనూ చెక్ చేసుకోవాలి.

పెట్టుబడులకు వేరొక అకౌంట్
పెట్టుబడులు పెట్టేందుకు మరో ప్రత్యేక ఖాతాను ఓపెన్ చేయండి. ఇందులో నుంచే మీ మొత్తం పెట్టుబడులకు వెళ్లేలా చేయండి. దీని వల్ల మీరు మదుపు చేస్తున్న మొత్తం ఎంత, దానిపై వస్తున్న డివిడెండ్లు, ఇతర ప్రయోజనాలను సులభంగా నిర్వహించేందుకు వీలుపడుతుంది.

మినిమమ్ బ్యాలెన్స్ తక్కువ ఉండేలా
పెట్టుబడులు, ఖర్చులకు కేటాయించిన ఖాతాలను నిర్వహించేందుకు మినిమమ్ బ్యాలెన్స్ తక్కువగా ఉన్న ప్రముఖ బ్యాంకులను ఎంచుకోండి. దీని వల్ల మీకు రుసుముల బాధ పడుతుంది. బ్యాంకు ఖాతా మెయింటెనెన్స్ యాప్​లోనే ఉండేలా చూసుకోవాలి. అప్పుడు కావాల్సినప్పుడు ఖాతా వివరాలు చూసుకునే వీలుంటుంది.

ఫిక్స్​డ్‌ డిపాజిట్​లా చేయండి
సేవింగ్స్ అకౌంట్​లో అధిక మొత్తం ఉన్నప్పుడు ఫిక్స్​డ్‌ డిపాజిట్​లో జమ అయ్యేలా ప్రత్యేక ఖాతాలు అందుబాటులో ఉంటాయి. మీ పొదుపు ఖాతాను నిర్వహిస్తున్న బ్యాంకులో ఇలాంటి వెసులుబాటు ఉందో లేదో చెక్ చేయండి. దీన్ని ఎంచుకోవడం ద్వారా కాస్త అధిక వడ్డీని పొందొచ్చు.

పొదుపు ఖాతాలు ఎక్కువైనా ఇబ్బందులు తప్పవు. మూడు నుంచి నాలుగు సేవింగ్స్ అకౌంట్స్ మాత్రమే ఉండేలా చూసుకోవాలి. అంతకు మించి ఉన్నప్పుడు అనవసరంగా మినిమమ్ బ్యాలెన్స్ పేరుతో డబ్బును వాటిల్లో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఇతర పెట్టుబడి అవకాశాలను కోల్పోయే అవకాశం ఉంది.

మీ దగ్గర చాలా సేవింగ్స్ అకౌంట్లు ఉన్నాయా? ఈ 7 టిప్స్ మీ కోసమే! - Savings Account Manage Tips

సేవింగ్స్ అకౌంట్​లో ఎంత డిపాజిట్ చేయొచ్చు? లిమిట్ దాటితే ఏమవుతుంది? - Cash Deposit Limit

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.