ETV Bharat / business

వ్యక్తిగత జీవితాన్ని, ఉద్యోగ బాధ్యతలను బ్యాలెన్స్‌ చేయాలా? 8-8-8 రూల్​ను ఫాలో అవ్వండి! - 8 8 8 Rule For Work Life Balance

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 18, 2024, 11:08 AM IST

8-8-8 Rule For Work Life Balance : రోజులో అందరికీ ఉండేది ఇరవై నాలుగు గంటలే. ఆ సమయాన్ని ఎలా వినియోగించుకున్నామన్నదే ముఖ్యం. కానీ చాలా మంది వ్యక్తిగత జీవితాన్ని, ఉద్యోగ బాధ్యతలను బ్యాలెన్స్ చేయలేక ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వారి కోసం ఉపయోగపడేదే 8-8-8 రూల్​.

8-8-8 Rule For Work Life Balance
8-8-8 Rule For Work Life Balance (ETV Bharat)

8-8-8 Rule For Work Life Balance : రోజులు గంటల్లా కరిగిపోతున్నాయ్‌, విలువైన సమయం వృథా అయిపోతోంది - అని చాలా మంది బాధపడుతుంటారు. ఇలాంటి వారు తమ వ్యక్తిగత జీవితాన్ని, ఉద్యోగ బాధ్యతలను బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి టైమ్​ మేనేజ్‌మెంట్‌ చాలా అవసరం. ఈ సాంకేతిక యుగంలో వర్క్‌ కల్చర్‌లో పెను మార్పులు వస్తున్నాయి. అందువల్ల మీకు ఉన్న కొద్దిపాటి సమయంలోనే, మీ వ్యక్తిగత, వృత్తి జీవితాలను సమతుల్యం చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఉపయోగపడేదే 8-8-8 రూల్​. దీనిని సరిగ్గా పాటిస్తే మీ వర్క్​ లైఫ్​ను చక్కగా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండవచ్చు.

ఏమిటీ 8-8-8 రూల్‌?
విలువైన సమయాన్ని ఎంత సమర్థంగా ఉపయోగించుకోవచ్చో తెలిపే టైమ్​ మేనేజ్‌మెంట్‌ పద్ధతి ఇది. వ్యక్తిగత జీవితాన్ని, ఉద్యోగ బాధ్యతలను సమతుల్యం చేసుకొనేందుకు ఇదో మంచి ఆయుధం లాంటిదని చెప్పొచ్చు. ఈ రూల్​ ప్రకారం, ఒక రోజులో ఉండే 24 గంటల్ని ఎనిమిది గంటల చొప్పున విభజించుకోవాలి. ఓ 8 గంటలను ఉద్యోగానికి వినియోగిస్తే, మరో 8 గంటలను మీ అలవాట్లు, కుటుంబ సభ్యులు, మిత్రులతో ఆనందంగా గడపేందుకు ఉపయోగించుకోవాలి; మిగతా ఎనిమిది గంటల్ని నాణ్యమైన నిద్ర కోసం కేటాయించాలి. దీని వల్ల మీ శారీరక, మానసిక ఆరోగ్యాలు బాగుంటాయి. పైగా మీ లక్ష్యాలను సులువుగా చేరుకొనేందుకు ఇదో సాధనంగా ఉపయోగపడుతుంది అని నిపుణులు సూచిస్తున్నారు.

లాభాలేంటి?
ఈ 8-8-8 రూల్‌ అందరికీ ఒకేలా నప్పకపోవచ్చు. ఎవరి అవసరాలను బట్టి వారు, తమకున్న సమయాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించుకొని, చక్కని ప్రణాళిక వేసుకొని క్రమశిక్షణగా ఆచరిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. మీ జీవన శైలిని ఆరోగ్యంగా, సంతృప్తికరంగా మలచుకొనేందుకు ఇదో చక్కని సాధనంగా ఉపయోగపడుతుంది. మీ పనుల్ని భాగాలుగా విడగొట్టడం ద్వారా చేసే పనిపట్ల ఫోకస్ పెరుగుతుంది. ఈ 8-8-8 రూల్‌ని మీ దైనందిన జీవితంలో ఒక అలవాటుగా మార్చుకుంటే, ముఖ్యమైన పనులేవీ వాయిదా పడకుండా ఉంటాయి. పైగా దీర్ఘకాలంలో మంచి సత్ఫలితాలు సాధించవచ్చు అవకాశం పెరుగుతుంది. కుటుంబానికి, మీ అభిరుచులకు తగినంత సమయాన్ని కేటాయించుకోవడానికి వీలవుతుంది. సంగీతం, పుస్తక పఠనం వంటి అలవాట్లతో మీ ఊహాశక్తి పెరగడంతో పాటు, కొత్త ఆలోచనలతో నిత్యనూతనంగా జీవితాన్ని తీర్చిదిద్దుకోవచ్చు. మీ సమయాన్ని బ్రేక్‌ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు విశ్రాంతి లభిస్తుంది. కనుక మీరు ఎప్పుడూ ఫ్రెష్‌గా ఉంటారు. పనిలోనూ సృజనాత్మకతో కూడిన పరిష్కారాలు కనుగొనడం ద్వారా కెరీర్‌లో రాణించవచ్చు. తగినంత నిద్రతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటివి తగ్గి శరీరంలో సహజ ప్రక్రియలు మెరుగవుతాయని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

అంత తేలిక కాదు - కానీ!
ఈ రూల్‌ని జీవితంలో అమలుచేయడం అంత తేలిక కాదు. ప్రతిరోజునీ కచ్చితంగా 8 గంటల చొప్పున విభజించుకుని దినచర్యను అమలు చేయాలంటే, అనేక రకాల అడ్డంకులు ఎదురవుతుంటాయి. వాతావరణంలో మార్పులు, ఏవైనా శబ్దాలు ఒక్కోసారి నాణ్యమైన నిద్రకు భంగం కలిగించవచ్చు. దీనికితోడు సహచరులు, కుటుంబ సభ్యులు, ఆఫీస్‌లో బాస్ నుంచి ఏదో ఒక రూపంలో ఎదురయ్యే ఒత్తిళ్లతో ఈ సమతుల్యత కొనసాగించడం కష్టమవుతుంది. కాకపోతే, సరైన ప్రణాళిక వేసుకొని అంకితభావంతో ఈ రూల్‌ పాటించేందుకు కృషి చేస్తే, జీవితంలో గొప్ప విజయాలు సాధించవచ్చు.

మొదటిసారి కారు కొంటున్నారా? ఈ టాప్‌-13 టిప్స్‌ మీ కోసమే! - Car Buying Tips

రూ.2లక్షల్లో మంచి టూ-వీలర్​ కొనాలా? త్వరలో లాంఛ్ కానున్న టాప్-10 మోడల్స్ ఇవే! - Upcoming Bikes Under 2 Lakh

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.