Best Cars Under 10 Lakh : దీపావళికి మంచి కారు కొనాలని అనుకుంటున్నారా? మీ బడ్జెట్ రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్యలో ఉందా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం మార్కెట్లో లేటెస్ట్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్‌తోపాటు, మంచి మైలేజ్ ఇచ్చే మైక్రో & కాంపాక్ట్ ఎస్‌యూవీ కార్లు అనేకం ఉన్నాయి. వాటిలోని టాప్-5 మోడల్స్ గురించి ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
1. Maruti Suzuki Fronx : ఇండియాలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ కారు - 'మారుతి సుజుకి ఫ్రాంక్స్'. 2023 ఆటో ఎక్స్‌పోలో గ్లోబల్ డెబ్యూట్ చేసిన ఈ కారు, ఏప్రిల్‌లో ఇండియన్ మార్కెట్లోకి లాంఛ్ అయ్యింది. లాంఛ్ అయిన కేవలం 10 నెలల్లోనే లక్ష యూనిట్ల మేర అమ్మకాలను నమోదు చేసి, అత్యంత వేగంగా ఎక్కువ సంఖ్యలో అమ్ముడు పోయిన కారుగా నిలిచింది. ఇప్పటి వరకు సుమారుగా 2 లక్షల యూనిట్ల వరకు ఈ కార్లు అమ్ముడుపోయాయి. అంతేకాదు ఈ కారు జపాన్‌తోపాటు పలు దేశాలకు కూడా ఎగుమతి అవుతోంది.
- ఇంజిన్ - 998 సీసీ - 1197 సీసీ
- పవర్ - 76.43 bhp - 98.69 bhp
- టార్క్ - 98.5 Nm - 147.6 Nm
- సీటింగ్ కెపాసిటీ - 5
- మైలేజ్ - 20.01 - 22.89 కి.మీ/లీటర్
Maruti Suzuki Fronx Price : మార్కెట్లో ఈ మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారు ధర సుమారుగా రూ.7.52 లక్షల నుంచి రూ.13.04 లక్షలు (ఎక్స్-షోరూం) ఉంటుంది.
2. Tata Punch : మారుతి సుజుకి ఫ్రాంక్స్ లాగానే భారత్‌లో అత్యంత ఆదరణ పొందిన కారు టాటా పంచ్. ఈ కారులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో వస్తుంది. ఈ 5-సీటర్ కారులో విశాలమైన ఇంటీరియర్, బూట్‌స్పేస్ ఉంటుంది. కనుక లగేజ్ పెట్టుకోవడానికి, ఐదుగురు వ్యక్తులు సౌకర్యవంతంగా ప్రయాణించడానికి అనువుగా ఉంటుంది.
- ఇంజిన్ - 1199 సీసీ
- పవర్ - 72 bhp - 87 bhp
- టార్క్ - 903 Nm - 115 Nm
- సీటింగ్ కెపాసిటీ - 5
- మైలేజ్ - 18.8 కి.మీ/లీటర్
Tata Punch Price : మార్కెట్లో ఈ టాటా పంచ్ కారు ధర సుమారుగా రూ.6.13 లక్షల నుంచి రూ.10.20 లక్షలు (ఎక్స్-షోరూం) ఉంటుంది.
3. Hyundai Exter CNG : హ్యుందాయ్ ఎక్స్‌టర్ సీఎన్‌జీ వెర్షన్ మంచి మైలేజ్ ఇస్తుంది. ఈ కారు కిలో సీఎన్‌జీకి 27.1 కి.మీ మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. దీనిలో అత్యాధునిక టెక్నాలజీతో, లేటెస్ట్ ఫీచర్లను పొందుపరిచారు.
- ఇంజిన్ - 1197 సీసీ
- పవర్ - 67.72 bhp
- ట్రాన్స్‌మిషన్ - మాన్యువల్
- ఫ్యూయెల్ - సీఎన్‌జీ
- మైలేజ్ - 27.1 కి.మీ/కేజీ
Hyundai Exter CNG Price : మార్కెట్లో ఈ హ్యుందాయ్ ఎక్స్‌టర్ కారు ధర సుమారుగా రూ.8.43 లక్షల నుంచి రూ.9.38 లక్షలు (ఎక్స్-షోరూం) ఉంటుంది.
4. Hyundai Venue : భారతదేశంలోని టాప్-సెల్లింగ్ కార్లలో హ్యుందాయ్ వెన్యూ ఒకటి. ఇది 1.2 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతో వస్తుంది. ఈ ఇంజిన్‌లు మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో పనిచేస్తాయి. ఈ కాంపార్ట్ ఎస్‌యూవీలో హై-ఎండ్ ఫీచర్లు ఉంటాయి.
- ఇంజిన్ - 998 సీసీ - 1493 సీసీ
- పవర్ - 82 bhp - 118 bhp
- టార్క్ - 113.8 Nm - 250 Nm
- సీటింగ్ కెపాసిటీ - 5
- మైలేజ్ - 24.2 కి.మీ/లీటర్
Hyundai Venue Price : మార్కెట్లో ఈ హ్యుందాయ్ వెన్యూ కారు ధర సుమారుగా రూ.7.94 లక్షల నుంచి రూ.13.48 లక్షలు (ఎక్స్-షోరూం) ఉంటుంది.
5. Citroen C3 Aircross : ఈ సిట్రోయెన్ కారు రెండు రకాల సీటింగ్ లేఅవుట్ ఆప్షన్లతో లభిస్తుంది. ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీ కారు 1.2 లీటర్ పెట్రోల్, 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇవి మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానంతో పనిచేస్తాయి.
- ఇంజిన్ - 1199 సీసీ
- పవర్ - 81 bhp - 108.62 bhp
- టార్క్ - 190 Nm - 205 Nm
- సీటింగ్ కెపాసిటీ - 5, 7
- మైలేజ్ - 17.6 - 18.5 కి.మీ/లీటర్
Citroen C3 Aircross Price : మార్కెట్లో ఈ సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ కారు ధర సుమారుగా రూ.9.99 లక్షల నుంచి రూ.14.33 లక్షలు (ఎక్స్-షోరూం) ఉంటుంది.
రూ.1 లక్ష బడ్జెట్లో మంచి బైక్ కొనాలా? ఈ టాప్-10 మోడల్స్‌పై ఓ లుక్కేయండి!
రూ.9 లక్షల బడ్జెట్లో మంచి కారు కొనాలా? టాప్-10 మోడల్స్ ఇవే!