ETV Bharat / business

కొత్త కారు కొంటున్నారా? ఈ 5 ఫీచర్స్​ ఉంటే ఫుల్​ కంఫర్ట్,​ సేఫ్​ జర్నీ! - Best Car Features - BEST CAR FEATURES

5 Best Car Features : కారు కొనేటప్పుడు అందులో మంచి ఫీచర్లు ఉండాలని కోరుకుంటాం. అయితే బడ్జెట్​, కలర్​ ఫీచర్స్ తదితర అంశాలను గురించి మాత్రమే ఆలోచిస్తాం. కానీ, ఎలాంటి ఫీచర్లు కావాలో మనకే సరిగ్గా తెలియదు. అందుకే కారు కొనాలని అనుకుంటే ఈ ఫీచర్ల ఉండేలా చూసుకోవాలి. అవేంటంటే?

Best Car Features
Best Car Features (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 3, 2024, 8:48 AM IST

5 Best Car Features : కారు కొనాలని నిర్ణయించుకున్నప్పుడు అందులో అన్ని ఫీచ‌ర్లు ఉండాల‌ని కోరుకుంటాం. తయారీదారులు ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా అనేక మార్పులతో కార్లను తీసుకొస్తున్నారు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఆటోమొబైల్‌ రంగంలో విస్తృతమైన మార్పులు వస్తున్నాయి. ప్రయాణికుల సౌకర్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని కార్లను తయారు చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యంగా ప్రయాణాలు చేయడానికి కావాల్సిన బెస్ట్ ఫీచర్లు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఆటోమేటిక్‌ క్లైమేట్ కంట్రోల్‌(Automatic Climate Control)
ప్రస్తుతం వస్తున్న కార్లలో ఈ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఫీచర్​ అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో ప్రయాణాలు చేసేటప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. డ్రైవింగ్​లో పదే పదే ఏసీ టెంపరేచర్​ను అడ్జస్ట్​ చేసే అవసరం లేకుండా చేస్తుంది. బయట ఉష్టోగ్రత ఎలా ఉన్నప్పటికీ లోపలి మాత్రం సౌకర్యవంతంగా ఉండేలా చేస్తుంది.

వెంటిలేటెడ్‌ సీట్స్ (Ventilated Seats)
ప్రస్తుతం వస్తున్న కార్లలో వెంటిలేటెడ్​ సీట్స్ ముఖ్యమైన ఫీచర్​గా ఉంది. వెంటిలేటెడ్ సీట్లు కారులోని డ్రైవర్​ సీటుతో పాటు ప్రయాణికులకు కూడా ఉంటాయి. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, సౌకర్యంగా ఉండేలా చేస్తుంది. సీజన్​ బట్టి వెంటిలేటెడ్​ సీట్స్ ప్రయాణాన్ని సాఫీగా చేస్తాయి. చలికాలంలో కారులో ప్రయాణించేటప్పుడు వెచ్చదనాన్ని అందిస్తుంది. ఇక సమ్మర్‌లో ఎంత ఏసీ ఉన్నప్పటికీ మనకు వేడి అనేది తెలియకుండా మంచి గాలి ప్రసరణతో చల్లగా ఉంచుతుంది.

హెడ్-అప్ డిస్‌ప్లే (HUD)
ఇప్పుడు అన్ని కార్లు హెడ్-అప్ డిస్‌ప్లేతో వస్తున్నాయి. డ్రైవర్లకు కావాల్సిన నావిగేష్ డైరెక్షన్లు, స్పీడ్, ఇంజిన్ ఉష్టోగ్రత, హెడ్​లైట్ అప్​డేట్​ వంటి వాటిని డ్యాష్​ బోర్డ్​పై చూపిస్తుంది. డ్రైవింగ్​ వేగాన్ని ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉంటుంది. సురక్షితంగా ప్రయాణాలు చేసేలా చేస్తుంది.

అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్‌ అసిస్టెన్స్‌ సిస్టమ్‌ (ADAS)
ఆధునిక కార్లలో ఎక్కువగా వినిపించే ఫీచర్ అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్‌ అసిస్టెన్స్‌ సిస్టమ్‌. డ్రైవర్ సహాయం లేకుండా కొన్ని పనులను ఆటోమేటిక్​గా నిర్వహించడానికి ఇది సహాయపడుతుంది. సురక్షితంగా డ్రైవింగ్ చేసేలా చేస్తుంది. ఈ టెక్నాలజీతో డ్రైవర్ ప్రమేయంగా లేకుండానే అత్యవసర సమయాల్లో ఆటోమేటిక్​ బ్రేక్ వేయడం వంటివి చేస్తుంది. ప్రయాణాలు సురక్షితంగా జరిగేలా హెచ్చరిస్తూ ఉంటుంది.

వైర్​లెస్ కనెక్టివిటీ (Wireless Connectivity)
ప్రస్తుతం వస్తున్న కార్లలో బ్లూటూత్, స్మార్ట్ ఫోన్ ఇంటిగ్రేషన్ వంటి వైర్​లెస్ కనెక్టివిటీని అందిస్తున్నాయి. దీంతో స్మార్ట్ ఫోన్​కు పని చెప్పకుండానే చేస్తుంది. అంటే మీరు ఎక్కడికైనా వెళ్లాలనుకున్నప్పుడు మొబైల్​లో ఉండే లొకేషన్​ మ్యాప్స్​ను ఓపెన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అలాగే మ్యూజిక్, హ్యాండ్స్ ఫ్రీ కాల్స్ చేయడానికి ఉపయోగపడుతుంది.

ట్యాక్స్ బెనిఫిట్స్​ కోసం జీవిత బీమా తీసుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోవడం మస్ట్​! - Life Insurance Tax Benefits

మీరు కాస్త పొట్టిగా ఉంటారా? మీకు సూట్​ అయ్యే టాప్​-10 బైక్స్ ఇవే! - Best Low Seat Height Bikes

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.