World Smallest Cow : ప్రపంచంలోనే అతి చిన్న ఆవును రెండున్నర లక్షలకు కొనుగోలు చేశాడు ఓ వ్యక్తి. పుంగనూర్ జాతి ఆవులుగా పిలిచే వీటి ఎత్తు కేవలం రెండున్నర అడుగులు మాత్రమే. పొట్టిగా ఉండటమే కాకుండా ఈ ఆవు పాలల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకే ఈ జాతి ఆవు పాలను బంగారు పాలు అని అంటారు. అలానే వీటిని ఇంట్లో పెట్టుకోవటం కూడా వాస్తు ప్రకారం మంచిదని భావిస్తారు. అందుకే ఈ జాతి ఆవులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. వీటి ధర కూడా ఎక్కువగానే ఉంటుంది.
రూ.2 లక్షలకు కొనుగోలు
మధ్యప్రదేశ్లో పందుర్ణాలోని కచ్చిధానా గ్రామానికి చెందిన సంజీవ్ ఖండేల్వాల్ ఈ జాతి ఆవులను రూ. 2,80 లక్షలకు కొనుగోలు చేశారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్ జిల్లా నుంచి ఒక జత పుంగనూరు జాతి ఆవులు, ఒక ఎద్దును కొన్నారు. ఈ జాతి ఆవులను చూసేందుకు సంజీవ్ ఇంటికి ప్రతిరోజూ ప్రజలు వస్తున్నారు. ఈ జాతి ఆవులను ఇంటిలో కుక్కపిల్లలుగా పెంచుకోవచ్చని సంజీవ్ తెలిపారు. ప్రస్తుతం ఈ ఆవులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నాయని చెప్పారు. మొదట్లో అరలీటర్ పాలు మాత్రమే ఇచ్చేవని, ఇప్పుడు రోజుకు ఒకటిన్నర నుంచి 2లీటర్ల వరకు ఇస్తున్నాయని సంజీవ్ తెలిపారు.
ఆరోగ్యానికి మేలు
ఈ ఆవు పాలల్లో అనేక ఔషధాలు ఉన్నాయని అంటున్నారు పశువైద్యుడు డాక్టర్ సురేంద్ర చౌక్సే. 'వీటి పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీటిలో 8 శాతం వరకు వెన్న ఉంటుంది. అయితే సాధారణ ఆవుల్లో ఇది మూడు నుంచి నాలుగు శాతం మాత్రమే ఉంటుంది. ఈ ఆవు మూత్రాన్ని కూడా ఎక్కువగా విక్రయిస్తుంటారు. దీని మూత్రంలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల వల్ల రైతులు తమ పొలాల్లో పురుగుమందులుగా ఉపయోగిస్తారు' అని సురేంద్ర తెలిపారు.
ప్రస్తుతం పుంగనూరు జాతి ఆవులు అంతరించిపోయే దశలో ఉన్నాయని అధ్యయనాల్లో తేలింది. ప్రస్తుతం వీటి సంఖ్య తక్కువగా ఉండటం వల్ల ధర కూడా లక్షల్లో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలోని పుంగనూరులో గర్తించడం వల్ల వీటికి ఊరు పేరును పెట్టారు. ఈ ఆవు ధర సుమారు ఒకటి నుంచి పది లక్షల వరకు ఉంటుంది. కొంతమంది రైతులు ఈ జాతి ఆవుల సంరక్షణలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు.
ఆపరేషన్ థియేటర్లో అత్త శివ భజన- ఫ్రీగా కోడలి డెలివరీ- తల్లీబిడ్డలు సేఫ్! - Woman Sang Bhajan In OT
బాలుడి గొంతులోకి 'చేప'- కండీషన్ సీరియస్! - Fish Struck In Boy Throat