Woman Fell Into Borewell : ప్రమాదవశాత్తు 25 ఏళ్ల మహిళ 100 అడుగులు లోతున్న బోరుబావిలో పడిపోయింది. ఈ ఘటన రాజస్థాన్లోని గంగాపూర్ జిల్లాలో జరిగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపారు. గంగాపుర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ గౌరవ్ సైనీ ఆధ్వర్యంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
ప్రమాదమా? హత్యా?
జిల్లాలోని గుడ్లా గ్రామానికి చెందిన 25 ఏళ్ల మోనా భాయి మంగళవారం రాత్రి 8 గంటల నుంచి కనిపించకుండా పోయింది. ఈ క్రమంలో బుధవారం ఇంటివెనక పొలంలో తవ్వి ఉన్న బోరుబావి సమీపంలో ఆమె వేసుకున్న చెప్పులను గుర్తించారు కుటుంబ సభ్యులు. దీంతో మోనా బోరుబావిలో పడిపోయి ఉంటుందనే అనుమానంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మోనా భాయి ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయిందా? లేదా ఎవరైనా తోసేసి ఉంటారా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
'గుడ్లా గ్రామంలో 25 ఏళ్ల మహిళ బోరుబావిలో పడిపోయిందనే సమాచారం మాకు బుధవారం మధ్యాహ్నం అందింది. దీంతో సహాయక బృందాలతో మేము ఆ ప్రాంతానికి చేరుకున్నాం. గృహిణి ఇంటి వెనక పొలంలో తవ్వి ఉన్న బోరుబావి లోతు 100 అడుగులుగా తెలుస్తోంది. అయితే మహిళను ఎవరైనా తోసేశారా? లేదా ఆమెనే ప్రమాదవశాత్తు పడిందా? అనే వివరాలు తెలియాల్సి ఉంది. దర్యాప్తు కొనసాగుతోంది. ప్రస్తుతం లోపల ఉన్న ఆమెకు ఆక్సిజన్ సరఫరా చేశాం.' అని బమన్వాస్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంత్రమ్ తెలిపారు.
బోరుబావిలో 2 ఏళ్ల బాలుడు- సేఫ్గా బయటకు
గుజరాత్ జామ్నగర్ జిల్లాలోని గోవానా గ్రామంలో మంగళవారం రెండేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు 15 అడుగుల లోతున్న బోరుబావిలో పడిపోయాడు. దాదాపు 6 గంటల పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు శ్రమించి బాలుడిని సురక్షితంగా బయటకు తీశారు. ఈ వార్త పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
బోరుబావి బాధిత చిన్నారుల కోసం కెమెరా!
Engineer Developed Camera For Borewell Rescue Operations : బోరుబావిలో పడిన వారిని కాపాడేందుకు ఒడిశాకు చెందిన ఓ ఇంజనీర్ ఇటీవలే ఓ కెమెరాను తయారు చేశారు. ఈ కెమెరాకు 50 అడుగుల లోతులో ఉన్న బావిలోకి వెళ్లి ఆడియో, వీడియోలను రికార్డు చేయగలగే సామర్థ్యం ఉంది. అతి తక్కువ ఖర్చుతో దీనిని అభివృద్ధి చేశానని, దీని తయారీకి కేవలం రెండు రోజుల సమయం మాత్రమే పట్టిందని కెమెరా రూపొందించిన ఇంజనీర్ తెలిపారు. దీనికి రూ.10 వేల ఖర్చయిందని చెప్పారు. మరి దీనికి సంబంధించి ఫీచర్స్తో పాటు ఈ కెమెరాను తయారు చేసిన వ్యక్తికి సంబంధించిన ప్రత్యేక కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కశ్మీర్లో ఉగ్రవాదుల దుశ్చర్య- స్థానికేతరుడిపై కాల్పులు- పంజాబీ కార్మికుడు మృతి
యజమాని చిత్రహింసలు- కువైట్ నుంచి ముంబయికి బాధితుల పరార్- సముద్రంలో 10 రోజుల జర్నీ