Wayanad Landslide Death Toll : కేరళ వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు 123 మంది మరణించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అనేక మంది గాయపడినట్లు రెవెన్యూ మంత్రి కార్యాలయం ప్రకటించింది. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు వివరించారు ప్రధాన కార్యదర్శి వీ వేణు.
ఘటనా స్థలంలో కేరళ రాష్ట్ర విపత్తు స్పందన దళం-KSDMA, అగ్నిమాపక బృందం, జాతీయ విపత్తు స్పందన దళం-NDRF బృందాలు, నేవీ కలిసి రెస్క్యూ ఆపరేషన్‌ను కొనసాగిసున్నాయి. తాళ్ల సాయంతో వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తుండటం వల్ల సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. కొండచరియల కింద చాలా మంది ప్రజలు చిక్కుకుపోయి ఉంటారని స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు.
#WATCH | Kerala: Latest visuals from the spot in Chooralmala area of Wayanad where a landslide occurred earlier today claiming the lives of over 70 people.
— ANI (@ANI) July 30, 2024
Rescue operation underway. pic.twitter.com/cilEoUg04Z
#WATCH | Kerala: Latest visuals from the spot in rain-ravaged and landslide hit Chooralmala area of Wayanad.
— ANI (@ANI) July 30, 2024
The landslide claimed the lives of over 70 people. pic.twitter.com/f2r3MLm1ul
మృతదేహాలు వెతుకుతూ బంధువుల రోదనలు
మరోవైపు వయనాడ్ జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో విషాదఛాయలు అలుముకున్నాయి. నేలపైనే మృతదేహాలను ఆస్పత్రిలో ఉంచడం వల్ల వారిని వెతుకుతూ బంధువులు చేస్తున్న రోదనలు మిన్నంటాయి. ఈ ప్రమాదం నేపథ్యంలో మంగళ, బుధవారాలను సంతాప దినాలుగా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. మరోవైపు బాధితులకు అందుతున్న వైద్య సేవలపై సమీక్షించారు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్.
Kerala government declares official mourning in the state today and tomorrow after at least 70 people lost their lives in a landslide incident in Wayanad. pic.twitter.com/5LckoqWwdA
— ANI (@ANI) July 30, 2024
In response to the landslide in Wayanad, Kerala Health Minister Veena George visited the Health Department Directorate to assess the ongoing arrangements. She provided a detailed overview of the situation and instructed for precise tracking of available hospital beds in the… pic.twitter.com/ph72mW27wC
— ANI (@ANI) July 30, 2024
జాతీయ విపత్తుగా ప్రకటించాలని విపక్షం డిమాండ్
మరోవైపు వయనాడ్ ప్రమాదాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశాయి విపక్షాలు. బాధిత కుటంబాలకు సత్వరం సాయం అందజేయాలని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ డిమాండ్ చేశారు. వీలైతే పరిహారాన్ని మరింత పెంచాలని కోరారు. క్షతగాత్రులకు అవసరమైన వైద్య సాయాన్ని అందించాలని లోక్‌సభలో రాహుల్ పేర్కొన్నారు. వయనాడ్‌లో పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.
"ఈ తెల్లవారుజామున వయనాడ్‌లో విధ్వంసకర కొండచరియలు విరిగిపడ్డాయి. 70 మందికి పైగా చనిపోయారు. ముండకై గ్రామంతో సంబంధాలు తెగిపోయాయి. విషాదం జరిగిన తీరు కారణంగా ప్రాణనష్టాన్ని ఇంకా అంచనా వేయలేదు. నేను రక్షణ మంత్రి, కేరళ ముఖ్యమంత్రితో మాట్లాడాను. రెస్క్యూ , వైద్య సాయం కోసం సాధ్యమైన అన్ని విధానాల్లో సహాయం అందించాలని కోరాను. మృతుల కుటుంబాలకు పరిహారం వెంటనే విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను. ఆ పరిహారాన్ని కూడా పెంచగలిగేలా చూడాలని కోరాను. కీలకమైన రవాణా, కమ్యూనికేషన్ మార్గాలను పునరుద్ధరించండి. వీలైనంత త్వరగా బాధిత కుటుంబాల పునరావాసం కోసం రోడ్‌మ్యాప్ సిద్ధం చేయండి."
--రాహుల్‌గాంధీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత
కేరళకు కేంద్రం భరోసా
మరోవైపు సహాయక చర్యల కోసం కేరళ ప్రభుత్వం సైన్యం సాయం కోరింది. దీంతో రక్షణ మంత్రి రాజ్ నాథ్ ఆర్మీచీఫ్ ఉపేంద్ర ద్వివేదితో మాట్లాడి 122 ఇన్ ఫాంట్రీ బెటాలియన్‌కు చెందిన రెండు బృందాలను కేరళకు పంపారు. బాధితులకు సాయం చేయడానికి నౌకాదళానికి చెందిన 30 మంది గజ ఈతగాళ్లను రప్పించారు. రెండు ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లను రంగంలోకి దించారు. మొత్తం 225 మంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే వయనాడ్‌లో ఆర్మీ చేపట్టిన సహాయక చర్యలపై ఆరా తీశారు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్. ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్విదేదితో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం కేరళ సీఎం పినరయి విజయన్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. కేంద్రం నుంచి అవసరమైన పూర్తి సాయాన్ని అందిస్తామని భరోసా ఇచ్చారు.
#WATCH | Wayanad landslide: Indian Army column reached the landslide site at Chooralmala by 1200 hours. Using ropes, soldiers are being ferried across the river which is in spate to assist and carry out rescue efforts in Ward No 10 of Chooralmala: Indian Army officials
— ANI (@ANI) July 30, 2024
(Source:… pic.twitter.com/lOCJjLVYoC
పొరుగు రాష్ట్రాల ఆపన్నహస్తం
కేరళ ప్రమాదంపై పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ విపత్కర సమయంలో రాష్ట్రానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ మేరకు కేరళ సీఎం పినరయి విజయన్‌కు ఫోన్ చేసి మాట్లాడారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. సీఎం నిధుల నుంచి రూ.5 కోట్లు విడుదల చేయాలని తమిళనాడు సీఎం స్టాలిన్ అధికారుల్ని ఆదేశించారు. 20 మంది అగ్నిమాపక సిబ్బంది, 10 మంది వైద్యులతో కూడిన వైద్య బృందాన్ని కేరళకు పంపించనున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య- రాష్ట్రానికి అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.