NITI Aayog Meeting 2024 : 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడం ప్రతి ఒక్క భారతీయుడి ఆశయమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలను కలిగి ఉండటం వల్ల ఈ ఆశయ సాధనలో రాష్ట్రాలు ముఖ్యమైన పాత్ర పోషించేందుకు అవకాశం ఉందని తెలిపారు. పాలకమండలి సమావేశంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు నీతి ఆయోగ్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేసింది.
" we are moving in the right direction. we have defeated once in hundred years pandemic. our people are full of enthusiasm and confidence. we can fulfil our dreams of viksit bharat @ 2047 with combined effort of all states. viksit states will make viksit bharat": prime minister…<="" p>— niti aayog (@nitiaayog) July 27, 2024
వికసిత్ భారత్‌ను రాష్ట్రాలే!
నీతి ఆయోగ్ సమావేశంలో ఈ దశాబ్దం మార్పులు, సాంకేతికత, భౌగోళిక రాజకీయాలు సహా అవకాశాలతో కూడుకున్నదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ అవకాశాలను భారత్ అందిపుచ్చుకుని అంతర్జాతీయ పెట్టుబడులకు అనుగుణంగా విధానాలను రూపకల్పన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భారత్‌ను అభివృద్ ధిచెందిన దేశంగా తీర్చిదిద్దడానికి ఇది ఒక అడుగు అని పేర్కొన్నారు. మనం సరైన దిశలోనే పయణిస్తున్నామని వందల ఏళ్లకు ఒకసారి వచ్చే మహమ్మారిని జయించామని వెల్లడించారు. ప్రజలు ఉత్సాహం, విశ్వాసంతో ఉన్నారన్న ఆయన, రాష్ట్రాల సంయుక్త కృషితో వికసిత్ భారత్-2047ను సాకారం చేసుకోవచ్చని అభిప్రాయపడ్డారు. వికసిత్ రాష్ట్రాలు, వికసిత్ భారత్‌ను తీర్చిదిద్దుతాయని పేర్కొన్నారు.
'వికసిత్ భారత్ సాధనకు రాష్ట్రాల సహకారం చాలా ముఖ్యం'
అయితే సమావేశం అనంతరం వివరాలను నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం మీడియాకు వెల్లడించారు. "వచ్చే 25 ఏళ్లలో వికసిత్ భారత్ సాధించే దిశగా ప్రధాని మోదీ కీలక సూచనలు చేశారు. మమతా బెనర్జీకి మాట్లాడే అవకాశం ఇవ్వలేదనటం వాస్తవం కాదు. ప్రతి సీఎంకు మాట్లాడేందుకు 7 నిమిషాల సమయం ఇచ్చాం. ప్రధానంగా రెండు అంశాలపై చర్చ జరిగింది. 2047 నాటికి వికసిత్ భారత్ సాకారం అయ్యే ప్రణాళికపై చర్చించాం. దేశంలో ప్రతి ఇంటికీ తాగునీరు, విద్యుత్ వంటి సదుపాయాల కల్పనపై చర్చించాం. వికసిత్ భారత్‌పై కేంద్రం రూపొందించిన డాక్యుమెంట్‌ను వివరించాం. వికసిత్ భారత్ సాధించడంలో రాష్ట్రాల సహకారం చాలా ముఖ్యం. రాష్ట్రాలు అమలు చేయాల్సిన ప్రణాళికలపై సూచనలు చేశాం. వైద్యరంగంలో తీసుకురావాల్సిన సంస్కరణలపై విస్తృతంగా చర్చించాం. సైబర్ సెక్యూరిటీలో అమలు చేయాల్సిన సాంకేతిక పరిజ్ఞానంపై చర్చించాం. అభివృద్ధి విషయంలో రాష్ట్రాల ప్రణాళికలు కూడా నీతి ఆయోగ్ శ్రద్ధగా విన్నది. కొన్ని రాష్ట్రాల సూచనలు, వారి ప్రణాళికలు చాలా బాగున్నాయి. తెలంగాణ, తమిళనాడు, కేరళ సహా పది రాష్ట్రాల నుంచి నీతి ఆయోగ్ సమావేశానికి ఎవరూ పాల్గొనలేదు" అని సీఈవో వివరించారు.
#WATCH | After the NITI Aayog meeting, CEO B.V.R. Subrahmanyam says, " ...we had 10 absentees and 26 participants. we had absentees from kerala, tamil nadu, karnataka, telangana, bihar, delhi, punjab, himachal pradesh, jharkhand and puducherry. the chief minister of west bengal… pic.twitter.com/dedCuQOHca
— ANI (@ANI) July 27, 2024