Vehicle Fell Into River In Uttarakhand : ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. రుద్రప్రయాగ్‌లోని బద్రీనాథ్ జాతీయ రహదారిపై ప్రయాణికులతో వెళ్తున్న వాహనం అదుపుతప్పి అలకనంద నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 14మంది చనిపోయారు. అనేక మందికి గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న SDRF, స్థానిక పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. గాయపడినవారిని అంబులెన్స్‌లో సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
శనివారం ఉదయం 11.30 గంటలకు 26 మంది ప్రయాణికులతో టెంపో రుద్రప్రయాగ్ వైపుగా బయలుదేరింది. రైటోలి సమీపంలోకి రాగానే డ్రైవర్ నిద్రమత్తు కారణంగా టెంపో అదుపు తప్పి అలకనంద నదిలో పడిపోయింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న SDRF, స్థానిక పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో అక్కడిక్కడికే 10 మంది మరణించారు. గాయపడిన వారిని విమానంలో ఆస్పత్రికి తరలించారు. వీరిలో చికిత్స పొందుతూ మరో నలుగురు మరణించారు.
ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన కేంద్రం
మరోవైపు ఈ ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున కేంద్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. గాయపడిన వారికి రూ.50,000 ఆర్థిక సాయం చేయనున్నట్లు తెలిపింది. ఎక్స్‌గ్రేషియా ప్రకటించినందుకు కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి కృతజ్ఞతలు తెలిపారు. గాయపడిన వారిని పరామర్శించేందుకు సీఎం ఆస్పత్రికి వెళ్లారు.
ఈ ప్రమాదం జరిగిన ప్రదేశంలో సమీపంలోనే రైల్వే లైన్ పనులు జరుగుతన్నాయి. ఈ పనులు చేస్తున్న ముగ్గురు కూలీలు ప్రయాణికులను రక్షించేందుకు నదిలోకి దిగారు. వీరిలో ఓ కూలీ నదీలో కొట్టుకుపోయాడు. అతడి కోసం సెర్ట్ టీమ్ ముమ్మరంగా గాలిస్తోంది.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ విచారం వ్యక్తం చేశారు. "రుద్రప్రయాగ్‌లో టెంపో ట్రావెలర్ ప్రమాదం గురించి చాలా బాధాకరమైన వార్తలు వచ్చాయి. స్థానిక యంత్రాంగం, SDRF బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై విచారణకు జిల్లా మేజిస్ట్రేట్‌ను ఆదేశించాను. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని బాబా కేదార్‌ని ప్రార్థిస్తున్నాను." అని పుష్కర్ సింగ్ ధమీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్కౌంటర్- 8మంది నక్సలైట్లు హతం
NDA ప్రభుత్వం పొరపాటున ఏర్పడింది- ఎప్పుడైనా కూలిపోవచ్చు: ఖర్గే