ETV Bharat / bharat

తండ్రిని చంపి ఇంట్లోనే పాతిపెట్టిన ఇద్దరు కొడుకులు- 30ఏళ్ల తర్వాత మూడో సన్ ఎంట్రీతో! - Father Murdered And Buried - FATHER MURDERED AND BURIED

Father Murdered And Buried In House : కన్నతండ్రిని చంపిన ఇద్దరు కుమారులు మృతదేహాన్ని ఇంటి ఆవరణలో పాతిపెట్టారు. ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిందీ ఘటన.

Murder
Murder (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 27, 2024, 10:31 PM IST

Father Murdered And Buried In House : ఉత్తర్‌ప్రదేశ్‌లో కన్నతండ్రినే కడతేర్చిన ఇద్దరు కుమారులు, అనంతరం మృతదేహాన్ని ఇంటి ఆవరణలో పాతిపెట్టారు. 30 ఏళ్ల క్రితం ఈ ఘటన జరిగింది. అయితే మూడో కుమారుడు తాజాగా ఇచ్చిన ఫిర్యాదుతో తాజాగా ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన అధికారులు, ఆ ప్రదేశంలో తవ్వకాలు జరపగా అక్కడ నిజంగానే ఓ మానవ అస్థిపంజరం లభ్యమైంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హాథ్రస్‌కు చెందిన బుధ్‌ సింగ్‌ 1994 నుంచి కనిపించకుండా పోయాడు. ఇదే విషయంపై అతడి కుమారుడు పంజాబీ సింగ్‌ ఇటీవల స్థానిక కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. తన ఇద్దరు సోదరులు మరో వ్యక్తితో కలిసి తండ్రిని చంపి ఇంటి ప్రాంగణంలోనే పాతిపెట్టారని ఆరోపించాడు. అప్పుడు తన వయసు తొమ్మిదేళ్లు అని చెప్పాడు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన స్థానిక పోలీసులు, ఆ ఇంట్లో తవ్వకాలు చేపట్టగా ఓ అస్థిపంజరం లభ్యమైంది. దానికి పోస్టుమార్టంతోపాటు డీఎన్‌ఏ పరీక్షకు పంపించారు.

అయితే వ్యవసాయం చేసుకునే బుధ్‌ సింగ్‌కు నలుగురు కుమారులు. సోదరుల మధ్య ఇటీవల గొడవలు వచ్చాయి. మూడు దశబ్దాల క్రితం తండ్రికి, తన అన్నయ్యలకు మధ్య జరిగిన గొడవ విషయం గుర్తుకు వచ్చింది. ఆ విషయాలు మాట్లాడటం వల్ల ఆ ఇద్దరు సోదరులు పంజాబీ సింగ్‌ను బెదిరించారు. దీంతో వారిపై సింగ్​కు అనుమానం వచ్చింది. తండ్రి అదృశ్యమవడానికి వారే కారణమని భావించాడు. వెంటనే ఇద్దరు సోదరులపై ఫిర్యాదు చేయడంతో డీఎన్‌ఏ నివేదిక ఆధారంగా తగు చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

స్కూల్‌ ప్రతిష్ఠ పెంచుకునేందుకు విద్యార్థి బలి
మరోవైపు, యూపీలోనే క్షుద్ర పూజలకు రెండో తరగతి చదువుతున్న విద్యార్ ప్రాణాలు కోల్పోయాడు. పాఠశాల ప్రతిష్ఠను పెంచుకునేందుకు యాజమాన్యమే అతడిని బలి ఇచ్చింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, హాథ్రస్‌లోని ఒక ప్రైవేటు పాఠశాల యాజమాన్యం ఒక విద్యార్థిని బలి ఇచ్చిందని వెల్లడించారు. స్కూల్‌ హాస్టల్‌లో అతడిని చంపేశారని తెలిపారు. పాఠశాల డైరెక్టర్ తండ్రి బ్లాక్‌ మ్యాజిక్‌ను విశ్వసిస్తాడని తెలిపారు. తొలుత స్కూల్ బయట ట్యూబ్‌వెల్‌ సమీపంలో ఆ పిల్లాడిని చంపాలనుకున్నారని, అయితే హాస్టల్‌ నుంచి బయటకు తీసుకెళ్తున్నప్పుడు అతడు భయంతో కేకలు వేయడంతో గొంతు నులిమి హత్యచేశారని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.