ETV Bharat / bharat

తిరుమలపై జరుగుతున్న ఆ ప్రచారం అబద్ధం - భక్తులు అలా చేయొద్దు - స్పందించిన టీటీడీ - Tirumala AnnaPrasadam - TIRUMALA ANNAPRASADAM

TTD Latest Updates : తిరుమల తిరుపతి దేవస్థానం ఓ నిర్ణయం తీసుకుందంటూ.. సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ప్రచారంపై టీటీడీ స్పందించింది. అదంతా అబద్ధమని క్లారిటీ ఇచ్చింది! ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

TTD AnnaPrasadam
TTD AnnaPrasadam News (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 3, 2024, 1:53 PM IST

Updated : Jul 3, 2024, 2:00 PM IST

TTD AnnaPrasadam News : తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త నిర్ణయం తీసుకుందంటూ సోషల్ మీడియాలో ఓ ప్రచారం సాగుతోంది. ఇటీవల లడ్డూ ప్రసాదం, దర్శన టికెట్ ధరల విషయానికి సంబంధించి కూడా ఇలాంటి ప్రచారమే సాగింది. ఇప్పుడు మరో విషయం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. దీంతో.. మరోసారి టీటీడీ స్పందించింది. ఈ మేరకు టీటీడీ ఈవో జె. శ్యామలరావు స్పష్టత ఇచ్చారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

అన్న ప్రసాదంపై..
స్వామివారికి సమర్పించే అన్నప్రసాదాల విషయంలో మార్పులు జరిగాయని, ఈ మేరకు టీటీడీ నిర్ణయం తీసుకుందంటూ.. సోషల్ మీడియాలో ఓ ప్రచారం సాగుతోంది. అదేమంటే.. అన్నప్రసాదం కోసం సేంద్రియ బియ్యం వాడకాన్ని నిలిపివేసి.. గతంలో వినియోగించిన బియ్యాన్ని వాడాలని టీటీడీ నిర్ణయించిందని ఒక వార్త వైరల్‌ అవుతోంది. అదేవిధంగా.. అన్నప్రసాదాల దిట్టం కూడా పెంచాలని నిర్ణయం తీసుకున్నారని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. దీంతో.. ఈ వార్తలపై టీటీడీ స్పందించింది. ఇవి పూర్తిగా ఫేక్‌న్యూస్‌ అని టీటీడీ ఈవో జె. శ్యామల రావు ఒక ప్రకటనలో తెలిపారు.

"శ్రీవారి ఆలయంలో అన్నప్రసాదాల తయారీలో మార్పులు చేశారంటూ, దిట్టం పెంచినట్టు కొంతమంది సోషల్ మీడియాలో పుకార్లు సృష్టిస్తున్నారు. ఈ వార్తలన్నీ అవాస్తవం. నెట్టింట వైరల్ అవుతున్న ప్రచారాన్ని భక్తులు నమ్మవద్దు" అని టీటీడీ ఈవో జె. శ్యామల రావు స్పష్టం చేశారు. ఆలయ అర్చక స్వాములు, ఆలయ అధికారులతో టీటీడీ ఈవో సమావేశమై స్వామివారికి నివేదించే అన్న ప్రసాదాల గురించి, వాటి దిట్టం గురించి సుదీర్ఘంగా చర్చించారు. అంతేగానీ, ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు.

భక్తులకు తీపి వార్త​ : తిరుమల స్వామివారి లడ్డూపై కీలక నిర్ణయం!

ధరలు తగ్గించారంటూ..
కొన్ని రోజుల క్రితం తిరుమల లడ్డూ ధరతోపాటు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్‌ ధర తగ్గించారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. లడ్డూ ధరను రూ.50 నుంచి రూ.25కి తగ్గించారని, అలాగే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను రూ.200లకు తగ్గించారంటూ ఫేక్‌న్యూస్‌ ప్రచారమైంది. అప్పుడు కూడా టీటీడీ స్పందించింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తమని స్పష్టం చేసింది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం.. రూ. 50 లడ్డూ ధరల్లో ఎలాంటి మార్పూ లేదని తేల్చి చెప్పింది.

భక్తులు మోసపోవద్దు..

ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం దళారులను నమ్మి మోసపోవద్దని టీటీడీ భక్తులకు సూచించింది. కొందరు టికెట్లు ఇప్పిస్తామని బురిడీ కొట్టించే ఛాన్స్ ఉందని.. అందువల్ల అలాంటి వారి మాయలో పడకూడదని తెలిపింది.

వారంతా ఎంత పుణ్యం చేసుకున్నారో - ప్రతీవారం తిరుమల శ్రీవారి దర్శనం!

తిరుమల వెళ్తున్నారా? - ఈ విషయం తెలుసుకోకపోతే చిక్కులు తప్పవు!

Last Updated : Jul 3, 2024, 2:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.