ETV Bharat / bharat

శ్రీవారి భక్తులకు గుడ్​న్యూస్​ - అక్టోబర్​​ కోటా టికెట్ల షెడ్యూల్ రిలీజ్ - వివరాలివే! - TTD Darshan Tickets October 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 15, 2024, 10:32 AM IST

TTD October Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్​న్యూస్​. అక్టోబర్​ నెలలో ఆర్జిత సేవలు, స్పెషల్ దర్శనాలు, వసతి గదులకు సంబంధించిన షెడ్యూల్​ను టీటీడీ విడుదల చేసింది. మరి, ఏఏ తేదీల్లో ఏ టికెట్లు విడుదల చేయనుందో పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

TTD Darshan Tickets for October 2024
TTD Darshan Tickets for October 2024 (ETV Bharat)

TTD Darshan Tickets for October 2024: అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడిని మరింత ప్రీతిపాత్రంగా సేవించుకునేందుకు భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం పలు ఆర్జిత సేవలను ప్రవేశపెట్టింది. అందుకు సంబంధించిన టికెట్లను మూడు నెలలు ముందుగానే ఆన్​లైన్​లో విడుదల చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే.. అక్టోబర్​ నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి గదుల బుకింగ్​కు సంబంధించిన షెడ్యూల్​​ రిలీజ్ చేసింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లు : అక్టోబర్​ నెలకు సంబంధించిన తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లను జులై​ 18న ఉదయం 10 గంట‌ల‌కు ఆన్​లైన్​లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. అలాగే.. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం జులై​ 18వ తేదీ ఉదయం 10 నుంచి జులై​ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్​ చేసుకోవచ్చని వెల్లడించింది. లక్కీ డిప్‌లో టికెట్లు పొందిన భక్తులు జులై 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు నగదు చెల్లించి టికెట్లు ఖరారు చేసుకోవాలని తెలిపింది.

వర్చువల్ సేవ : అదే విధంగా కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్ల కోటాను జులై 22వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన టికెట్లను అదే రోజు(జులై 22) మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో రిలీజ్​ చేయనున్నట్లు స్పష్టం చేశారు.

శ్రీవాణి టికెట్ల ఆన్​లైన్ కోటా : అక్టోబర్​ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టికెట్లను ఈ నెల 23న ఉదయం 10 గంటలకు ఆన్​లైన్​లో టీటీడీ అధికారులు విడుదల చేయనున్నారు. అలాగే.. శ్రీవాణి ట్రస్టు టికెట్ల బుకింగ్‌ను జులై ​23న ఉదయం 11 గంటలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అంతేకాకుండా.. వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌ వారు స్వామిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను అదే రోజు(జులై 23).. మధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

తిరుమలపై జరుగుతున్న ఆ ప్రచారం అబద్ధం - భక్తులు అలా చేయొద్దు - స్పందించిన టీటీడీ

ప్రత్యేక దర్శన టికెట్లు : వేంకటేశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శన టికెట్లు(రూ.300 దర్శన టికెట్లు) ఈ నెల 24న ఉదయం 10 గంటలకు ఆన్​లైన్​లో విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. అలాగే తిరుమల, తిరుపతిలో అక్టోబర్​ నెలకు సంబంధించి గదులను జులై 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది.

అలాగే జులై 24న ఉదయం 10 గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుచానూరు ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.200 దర్శన టికెట్లు) ఆగష్టు నెలకు సంబంధించిన టికెట్లు విడుదల చేయనున్నట్లు తెలిపింది. అలాగే ఆగష్టులో స్థానిక ఆలయాల సేవా కోటా బుకింగ్ టికెట్లు ఈ నెల 25న ఉదయం 10 గంటలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

ఆసక్తి కలిగిన భక్తులు ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, వసతి గదుల్ని https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవాల‌ని కోరింది.

భక్తులకు తీపి వార్త​ : తిరుమల స్వామివారి లడ్డూపై కీలక నిర్ణయం!

వారంతా ఎంత పుణ్యం చేసుకున్నారో - ప్రతీవారం తిరుమల శ్రీవారి దర్శనం!

తిరుమల వెళ్తున్నారా? - కొండపై గదులు దొరక్కపోతే ఏం చేయాలి? - ఇలా చేస్తే పక్కా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.