ETV Bharat / bharat

గుడ్​న్యూస్ : 'శ్రీవారి ఆర్జిత సేవా' ఆగస్టు కోటా టికెట్ల షెడ్యూల్ రిలీజ్ - టికెట్లు ఇచ్చేది ఎప్పుడంటే? - TIRUMALA SEVA TICKETS FOR AUGUST

author img

By ETV Bharat Telugu Team

Published : May 10, 2024, 12:00 PM IST

TTD Tirumala Seva Tickets For August 2024 : శ్రీవారి భక్తులకు గుడ్​న్యూస్. ఆగస్టు నెలకు సంబంధించిన.. ఆర్జిత సేవలు, స్పెషల్ దర్శన టికెట్లు, వసతి గదులు ఆన్​లైన్​లో బుక్ చేసుకునేందుకు షెడ్యూల్ వచ్చేసింది. ఏయే తేదీల్లో ఏయే టికెట్లను విడుదల చేయనుందో టీటీడీ వెల్లడింది. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

TTD Seva Tickets For August 2024
TTD Seva Tickets For August 2024 (ETV Bharat)

Tirumala Srivari Arjitha Seva Tickets For August 2024 : అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడిని భక్తులు మరింత ప్రీతిపాత్రంగా సేవించుకునేందుకు పలు ఆర్జిత సేవలను టీటీడీ ప్రవేశపెట్టింది. ఇందుకు సంబంధించిన టికెట్లను ముందుగానే ఆన్​లైన్​లో విడుదల చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే.. ఆగస్టు నెలకు సంబంధించిన షెడ్యూల్​​ రిలీజ్ చేసింది. మరి.. ఏయే తేదీల్లో ఏయే టికెట్లు విడుదల చేస్తోందనే వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లు : ఆగస్టు నెలకు సంబంధించిన తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లను మే 18న ఉదయం 10 గంట‌ల‌కు ఆన్​లైన్​లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది . అలాగే.. ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం మే 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని వెల్లడించింది. లక్కీ డిప్‌లో టికెట్లు పొందిన భక్తులు.. మే 20వ తేదీ నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు నగదు చెల్లించాల్సి ఉంటుందని.. ఆ తరువాత ఆర్జిత సేవల టికెట్లు ఖరారు అవుతాయని పేర్కొంది.

వర్చువల్ సేవ : కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్ల కోటాను మే 21వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన టికెట్లను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో రిలీజ్​ చేయనున్నట్లు పేర్కొన్నారు.

తిరుమల వెళ్తున్నారా? - కొండపై గదులు దొరక్కపోతే ఏం చేయాలి? - ఇలా చేస్తే పక్కా! - Rental Rooms in Tirumala

శ్రీవాణి టికెట్ల ఆన్​లైన్ కోటా : అంగప్రదక్షిణం టికెట్లను ఈనెల 23న ఉదయం 10 గంటలకు టీటీడీ అధికారులు ఆన్​లైన్​లో విడుదల చేయనున్నారు. అలాగే.. శ్రీవాణి ట్రస్టు టికెట్ల బుకింగ్‌ను మే 23 ఉదయం 11 గంటలకు రిలీజ్​ చేయనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా.. వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు స్వామిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను అదే రోజు.. మధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయనున్నట్లు తెలిపారు.

ప్రత్యేక దర్శన టికెట్లు : అదే విధంగా.. ఈ నెల 24న ఉదయం 11 గంటలకు స్వామివారి ప్రత్యేక దర్శన టికెట్లు(రూ.300 దర్శన టికెట్లు) రిలీజ్ చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. అదే సమయంలో తిరుమల, తిరుపతిల‌లో ఆగష్టు నెలకు సంబంధించి గదులను మే 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.

శ్రీవారి సేవ కోటా : శ్రీవారి సేవా టికెట్లను మే 27న ఉదయం 11 గంటలకు, న‌వ‌నీత సేవా టికెట్లను మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు, ప‌ర‌కామ‌ణి సేవ కోటాను మ‌ధ్యాహ్నం ఒంటి గంటకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. ఆసక్తి కలిగిన భక్తులు.. https://ttdevasthanams.ap.gov.in వెబ్ సైట్​ ద్వారా టికెట్లు బుక్​ చేసుకోవాలని కోరింది.

'పది' పాసైన వారికి గుడ్ న్యూస్ - తిరుమల తిరుపతి దేవస్థానం ఆహ్వానం! - TTD Sculpture Courses Applications

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.