Tirupati Balaji Darshanam from Visakhapatnam: కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తిరుమల కొండ పైకి తరలి వెళ్తుంటారు. వేసవి సెలవుల్లో కొండపైన భక్తుల తాకిడి ఇంకా ఎక్కువగా ఉంటుంది. రోజూ ఎంతో మంది భక్తులు ఆ స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. మరి మీరు కూడా తిరుమల వెళ్లాలనుకుంటున్నారా ? అయితే, మీకో గుడ్‌న్యూస్. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC).. ఓ టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ఈ ప్యాకేజీ ద్వారా వేంకటేశ్వర స్వామివారి దర్శనంతో పాటు వివిధ పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చు. మరి, ఈ టూర్ ఎన్ని రోజులు సాగనుంది? ఏయే ప్రదేశాలు చూడొచ్చు? ధర ఎంత ఉంటుంది ? అనే వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC).. "తిరుపతి బాలాజీ దర్శనం" పేరుతో ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. ఈ ప్యాకేజీ విశాఖపట్నం నుంచి ఉంటుంది. ఈ టూర్ రెండు రాత్రులు, 3 పగళ్లు ఉంటుంది. మీరు ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకుంటే విమానంలో తిరుపతికి వెళ్లొచ్చు.
టూర్ వివరాలు :
- మొదటి రోజున ఉదయం 10:25 గంటలకు విశాఖపట్నం నుంచి తిరుపతికి విమానం బయలుదేరుతుంది. మధ్యాహ్నం 12:10 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హోటల్‌కు వెళ్లి ఫ్రెషప్, లంచ్ తర్వాత శ్రీనివాస మంగాపురం, కాణిపాకం దేవాలయాలను దర్శించుకుని హోటల్‌కు రావాలి. రాత్రి భోజనం తర్వాత స్టే అక్కడే ఉంటుంది.
- రెండో రోజు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత బాలాజీ దర్శనం ఉంటుంది. తర్వాత లంచ్ చేసి శ్రీకాళహస్తి, తిరుచానూరు ఆలయాలను సందర్శించి హోటల్‌కు తిరిగిరావాలి. రాత్రి భోజనం తర్వాత స్టే అక్కడే ఉంటుంది.
- మూడవ రోజు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ అయ్యి గోవింద రాజ స్వామి టెంపుల్, ఇస్కాన్ టెంపుల్ దర్శించుకోవాలి. లంచ్ తర్వాత ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటే తిరుపతి నుంచి విశాఖపట్నంకు విమానం బయలుదేరుతుంది. విశాఖపట్నం చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
ధర: విశాఖపట్నం నుంచి తిరుపతి ఫ్లైట్ టూర్ ప్యాకేజీ ధర ఒక్కొక్కరికి 17వేల 730 రూపాయలను ఛార్జ్ చేస్తున్నారు. ఈ టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్స్, లోకల్ ట్రాన్స్‌పోర్టేషన్, తిరుమలలో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, తిరుచానూర్ ఆలయంలో దర్శనం, శ్రీనివాస మంగాపురం కవర్ అవుతాయి. అలాగే తిరుపతిలో రెండు రాత్రులు ఏసీ హోటల్‌లో బస కూడా ఏర్పాటు చేస్తారు. రెండు రోజులు ఉదయం బ్రేక్‌ఫాస్ట్, రాత్రి డిన్నర్ ఉంటాయి. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను ఈ లింక్‌పై క్లిక్ చేసి తెలుసుకోండి.
హైదరాబాద్ టూ అయోధ్య వయా కాశీ - IRCTC సూపర్ ప్యాకేజీ - ధర కూడా తక్కువే! - IRCTC Punya Kshetra Yatra
హైదరాబాద్ టూ కాశీ - ఐఆర్సీటీసీ స్పెషల్ టూర్ - ధర కూడా అందుబాటులోనే! - IRCTC Ganga Ramayan Yatra