ETV Bharat / bharat

శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమలలో ఆ సేవలన్నీ రద్దు! - TTD Vasanthotsavam

TTD Updates : వసంతోత్సవాల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయాలు తీసుకుంది. పలు సేవలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.

TTD Vasanthotsavam
TTD Updates
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 11, 2024, 11:26 AM IST

Updated : Apr 11, 2024, 11:40 AM IST

Tirumala Tirupati Devasthanam Updates : తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 21 నుండి 23వ తేదీ వరకు మూడు రోజులపాటు సాలకట్ల వసంతోత్సవాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. ప్రతీ సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేట్టుగా.. ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా.. ఏప్రిల్ 21వ తేదీన ఉదయం 6.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు నాలుగు మాడవీధులలో ఊరేగుతారు. అనంతరం వసంతోత్సవ మండపానికి వేంచేస్తారు. అక్కడ వసంతోత్సవ అభిషేక నివేదనలు పూర్తయిన తర్వాత తిరిగి ఆలయానికి చేరుకుంటారు.

రెండు, మూడో రోజు ఇలా..

రెండవరోజు ఏప్రిల్ 22న శ్రీ మలయప్పస్వామివారు ఉదయం 8 నుండి 10 గంటల వరకు బంగారు రథాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో ఊరేగుతారు. అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. చివరిరోజు ఏప్రిల్ 23న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారితోపాటుగా శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవ మూర్తులు.. శ్రీ రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయానికి చేరుకుంటారు.

వసంత క్రతువు అలా..

ఈ సందర్భంగా ప్రతి రోజూ మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. కాగా ప్రతి రోజు సాయంత్రం 6 నుండి 6.30 గంటల వరకు ఆస్థానం ఘనంగా నిర్వహిస్తారు. వసంత ఋతువులో శ్రీ మలయప్పస్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి 'వసంతోత్సవ'మని పేరు. ఈ క్రతువులో సుగంధ పుష్పాలను స్వామికి సమర్పించటమే కాక వివిధ ఫలాలను కూడా నివేదించడం ఈ వసంతోత్సవంలో ప్రధాన ప్రక్రియగా ఉంటుంది.

ఈ సేవలు రద్దు..

ఈ వసంతోత్సవాన్ని పురస్కరించుకొని పలు సేవలను రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 21 నుండి 23వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. ఏప్రిల్ 23న అష్టదళ పాదపద్మారాధన సేవను కూడా రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది.

Last Updated : Apr 11, 2024, 11:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.