ETV Bharat / bharat

శ్రీవారి భక్తులకు బిగ్​ అలర్ట్​ - ఆ టికెట్లను తగ్గించిన టీటీడీ - అప్పటి నుంచే అమలు! - TTD Reduced Srivani Tickets - TTD REDUCED SRIVANI TICKETS

TTD Latest News : శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. కొండపైన భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ టికెట్ల జారీ విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకోండి.

TTD Latest News
TTD Latest News (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 21, 2024, 1:29 PM IST

TTD Reduced Srivani Tickets: గత కొన్ని రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. దీంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే సామాన్య భక్తులకు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడంలో మరింత ప్రాధాన్యత కల్పించడానికి వీలుగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే కొత్తగా మార్గదర్శకాలు జారీ చేసింది. ముఖ్యంగా ఆ టికెట్ల జారీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

శ్రీవారి దర్శనం కోసం బుక్ చేసుకునే శ్రీవాణి టికెట్ల సంఖ్యను తిరుమల తిరుపతి దేవస్థానం తగ్గించింది. ఆన్‌లైన్‌లో ప్రస్తుతం ఉన్న సంఖ్యలోనే టికెట్‌లను అందుబాటులో ఉంచగా, ఆఫ్‌లైన్‌లో మాత్రం శ్రీవాణి టికెట్ల జారీ సంఖ్యను పరిమితం చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం జులై 22వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది.

ఇప్పటివరకు ఆన్‌లైన్‌లో 500 శ్రీవాణి టికెట్లు ఇస్తుండగా.. వాటి సంఖ్యను అంతే ఉంచనున్నారు. ఆఫ్‌లైన్‌లో జారీ చేసే శ్రీవాణి టికెట్ల సంఖ్యను వెయ్యికి(1000) పరిమితం చేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఆఫ్‌లైన్‌లో అందించే వెయ్యి శ్రీవాణి టికెట్‌లలో 900 టికెట్లను.. తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో మొదట వచ్చిన వారికి ఇవ్వనున్నారు. అలాగే ఇక మిగిలిన 100 టికెట్‌లను శ్రీవాణి దాతలకు రేణిగుంట ఎయిర్‌పోర్టులోని కరెంట్‌ బుకింగ్‌ కౌంటర్‌లలో అందుబాటులో ఉంచనున్నారు. అయితే, ఇక్కడ ఒక విషయాన్ని భక్తులు గుర్తుంచుకోవాలి. బోర్డింగ్‌ పాస్‌ ఉన్న వారికి మాత్రమే తిరుపతి ఎయిర్‌పోర్ట్‌ కౌంటర్‌లో ఈ ఆఫ్‌లైన్‌ శ్రీవాణి టికెట్లు జారీ చేస్తారని టీటీడీ అధికారులు తెలిపారు.

శ్రీవాణి టికెట్‌లు ఎవరికి ఇస్తారు ?: శ్రీవాణి ట్రస్ట్‌ను 2018లో టీటీడీ ప్రారంభించింది. శ్రీవాణి దర్శనం కింద టికెట్ పొందాలనుకునే భక్తులు.. రూ.10 వేల విరాళంగా అందించాల్సి ఉంటుంది. ఈ టికెట్‌ ద్వారా భక్తులు ఎక్కువసేపు లైన్‌లో నిలబడకుండానే స్వామి వారిని దర్శనం చేసుకోవచ్చు. విరాళంగా సమర్పించే రూ. 10 వేలలో.. రూ.500 టీటీడీకి చెందుతాయి. మిగతా రూ.9500 శ్రీవాణి ట్రస్ట్‌లో జమ అవుతాయి. ఈ ట్రస్ట్‌ ద్వారా దేశం మొత్తంలో వివిధ ప్రాంతాలలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాలను నిర్మించడం, వాటి నిర్వహణ, పండుగలను నిర్వహించడం చేస్తుంటారు.

శ్రీవాణి టికెట్ల ఆన్​లైన్ కోటా : అక్టోబర్​ నెలకు సంబంధించిన శ్రీవాణి ట్రస్టు టికెట్ల బుకింగ్‌ను జులై ​23న ఉదయం 11 గంటలకు ఆన్​లైన్​లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. అంతేకాకుండా.. వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌ వారు స్వామిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను అదే రోజు(జులై 23).. మధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి :

ఇవేం పనులురా అయ్యా - తిరుమలలో పోకిరీల ప్రాంక్ వీడియో

ఏపీలో గత వైఎస్సార్సీపీ పాలకులు వీరప్పన్ వారసులు : కేంద్రమంత్రి బండి సంజయ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.