Tips To Clean Ceiling Fan : ప్రతి ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కచ్చితంగా ఉంటుంది. రోజంతా ఎక్కువగా ఆన్‌లో ఉండే వస్తువులలో ఇదీ ఒకటి. అయితే, సీలింగ్ ఫ్యాన్ చాలా ఎత్తులో ఉండటం వల్ల దీనిని తరచూ శుభ్రం చేయడం కష్టమవుతుంది. దీనివల్ల ఫ్యాన్‌పై దుమ్ము దూళీ, పేరుకుపోతాయి. ఇలా దుమ్ముతో ఉన్న ఫ్యాన్ తిరగడం వల్ల ఇంట్లోని గాలి కలుషితం అవుతుంది. ఈ గాలి పీల్చడం వల్ల మనకు అలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే, కొన్ని సింపుల్ టిప్స్ పాటించడం వల్ల ఫ్యాన్‌పై ఉన్న డస్ట్‌ను ఈజీగా తొలగించవచ్చని అంటున్నారు నిపుణులు. మరి ఆ చిట్కాలు ఏంటో చూసేద్దామా..
పిల్లో కవర్‌తో క్లీన్ చేయండి : ఇంట్లో ఉండే పాత పిల్లో(దిండు) కవర్‌లతో సీలింగ్ ఫ్యాన్‌ని సులభంగా క్లీన్ చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. ఎలా అంటే.. ముందుగా నిచ్చెన లేదా కుర్చీపై నిలబడి పిల్లో కవర్‌లను ఫ్యాన్ రెక్కలకు తొడగాలి. తర్వాత పిల్ల కవర్‌లను పట్టుకుని ఫ్యాన్ రెక్కలను రుద్దుతూ శుభ్రం చేయండి. ఈ టిప్ పాటించడం వల్ల రెక్కలపైన ఉన్న దుమ్ము, దూళీ ఫ్లోర్‌పై పడకుండా ఉంటుంది. దీంతో ఫ్యాన్ ఈజీగా క్లీన్ అవుతుంది.
సాక్సులతో : ఫ్యాన్ క్లీన్ చేయడంలో సాక్సులు కూడా ఉపయోగపడతాయని నిపుణులు అంటున్నారు. అందుకోసం పాత సాక్స్‌లను నీటిలో తడిపి.. ఫ్యాన్ రెక్కలను శుభ్రం చేసుకోవచ్చు. సాక్స్‌లు మెత్తగా ఉండి.. సాగుతాయి కాబట్టి ఫ్యాన్‌ను శుభ్రం చేయడం చాలా సులభమవుతుంది. కాబట్టి, మీ సీలింగ్ ఫ్యాన్‌ను తళతళా మెరిపించడానికి ఈ టిప్ పాటించమని సలహా ఇస్తున్నారు.
అలర్ట్ : మీ అందాన్ని పాడుచేసే మొటిమలకు - మీ దిండు కారణమని తెలుసా?
డస్టర్ : సీలింగ్ ఫ్యాన్ పైన ఉన్న డస్ట్‌ను తొలగించడానికి డస్టర్ బాగా ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. ముందుగా డస్టర్‌ను నీటిలో ముంచి నీళ్లను పిండండి. తర్వాత నిచ్చెన లేదా కుర్చీపై నిలబడి డస్టర్ సహాయంతో ఫ్యాన్‌ను శుభ్రం చేయండి.
వాక్యూమ్ క్లీనర్‌తో : ప్రస్తుత కాలంలో చాలా మంది ఇళ్లలో వాక్యూమ్ క్లీనర్‌లుంటున్నాయి. కాబట్టి.. నిచ్చెన లేదా కుర్చీపై నిలబడి ఈజీగా ఫ్యాన్ రెక్కలను వాక్యూమ్ క్లీనర్‌తో శుభ్రం చేసుకోవచ్చు. సీలింగ్ ఫ్యాన్‌ను శుభ్రం చేయడానికి అన్నింటి కంటే ఈజీ పద్ధతి ఇదే అంటున్నారు నిపుణులు.
షాంపూతో : ఒక గ్లాసు నీళ్లలో కొద్దిగా షాంపూ, ఆవాల నూనె కలపండి. ఈ నీటిలో స్పాంజి ముంచి ఫ్యాన్ రెక్కలను తుడవాలి. ఇలా చేస్తే డస్ట్ పోయి ఫ్యాన్ మెరుస్తుందని చెబుతున్నారు.
వెనిగర్, బేకింగ్ సోడా : ఫ్యాన్‌ను క్లీన్ చేయడంలో బేకింగ్ సోడా, వెనిగర్ చాలా బాగా సాయపడుతుందని నిపుణులు అంటున్నారు. అందుకోసం ఒక గిన్నెలో వెనిగర్, బేకింగ్ సోడాను కలిపి.. ఆ పేస్ట్‌ను ఫ్యాన్ రెక్కలపై అప్లై చేయండి. ఒక 5 నిమిషాల తర్వాత తడి కాటన్ వస్త్రంతో ఫ్యాన్ రెక్కలను క్లీన్ చేయండి. ఈ టిప్స్ పాటించడం వల్ల ఈజీగా ఫ్యాన్‌ను శుభ్రం చేసుకోవచ్చు.
NOTE: ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. పైన చెప్పిన టిప్స్ పాటించేముందు ఫ్యాన్ కొనుగోలు సమయంలో ఇచ్చే యూజర్ గైడ్ తనిఖీ చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే కొన్ని ఫ్యాన్‌లకు ప్రత్యేకమైన శుభ్రత సూచనలు ఉండవచ్చంటున్నారు. కాబట్టి వీటిని గమనించమంటున్నారు.
తుప్పు, జిడ్డు మరకలతో ట్యాప్స్ అసహ్యంగా ఉన్నాయా? - ఇలా చేస్తే కొత్తవాటిలా మెరిసిపోతాయి!
అలర్ట్ : జుట్టు మెరిసిపోవాలని హెయిర్ పెర్ఫ్యూమ్స్ వాడేస్తున్నారా? - మీ ఒంట్లో ఏం జరుగుతుందో తెలుసా?