ETV Bharat / bharat

'ప్రధాని మోదీని చంపేస్తా'- NIA కంట్రోల్ రూమ్​కు ఫోన్ కాల్- పోలీసులు అలర్ట్ - THREAT CALL FOR PM MODI - THREAT CALL FOR PM MODI

Threat Call For PM Modi : ప్రధాని నరేంద్ర మోదీని చంపేస్తానని గుర్తు తెలియని వ్యకి చెన్నైలోని ఎన్ఐఏ కంట్రోల్ రూమ్​కు ఫోన్ చేశాడు. ఈ క్రమంలో ఎన్​ఐఏ అధికారులు అప్రమత్తమై చెన్నై పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడిని గుర్తించేందుకు చెన్నై పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Threat Call To Pm Modi
Threat Call To Pm Modi (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : May 23, 2024, 11:01 AM IST

Updated : May 23, 2024, 11:30 AM IST

Threat Call For PM Modi : భారత ప్రధాని నరేంద్ర మోదీని చంపేస్తామని గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపులకు దిగాడు. తమిళనాడు చెన్నైలోని పురశైవాకంలో ఉన్న నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(ఎన్ఐఏ) కంట్రోల్ రూమ్​కు ఫోన్ చేసి ప్రధాని మోదీని హతమారుస్తానని బెదిరించాడు. ఈ నేపథ్యంలో ఎన్ఐఏ అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే చెన్నై పోలీసులకు సమాచారం అందించారు. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసిన నంబర్​ను పోలీసులకు ఇచ్చారు. ఈ ఘటనపై చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నిందితుడిని గుర్తించే పనిలో పోలీసులు
గుర్తు తెలియని వ్యక్తి ప్రధాని మోదీని చంపేస్తానని హిందీలో మాట్లాడినట్లు తెలుస్తోంది. నిందితుడు ఏ ప్రాంతం నుంచి ఫోన్ చేశాడు? ఏ సిమ్ కార్డు వాడాడు? అనే విషయాలను తెలుసుకునే పనిలో చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులు నిమగ్నమయ్యారు. కాగా, వాంటెడ్ క్రిమినల్స్​ను పట్టుకోవడానికి నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(ఎన్ఐఏ) పోలీసు కంట్రోల్ నంబర్స్​ను ఇటీవల ప్రకటించింది. ఈ నెంబరుకు ఫోన్ చేసి ప్రధాని మోదీని హతమారుస్తానని గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపులకు పాల్పడడం గమనార్హం.

ప్రధాని మోదీ, యోగికి బెదిరింపులు
ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ను​ చంపుతానంటూ కొన్నాళ్ల క్రితం ఓ అంగంతుకుడు బెదిరించాడు. గుర్తు తెలియని ఆ వ్యక్తి ఉత్తర్​ప్రదేశ్​ నోయిడాలో ఉన్న ఓ మీడియా సంస్థకు ఈ మెయిల్​ చేశాడు. దీంతో ఆ మీడియా సంస్థ అధికారులు వెంటనే పోలీసులుకు సమాచారం అందించారు. దేశ ప్రధానినే చంపుతామని బెదిరింపులు రావడం వల్ల పోలీసులు ఈ కేసులు సీరియస్​గా తీసుకుని విచారణ చేపట్టారు.

నోయిడాలోని ఓ ప్రైవేట్​ మీడియా సంస్థ ఛీఫ్ ఫైనాన్షియల్​ ఆఫీసర్​కు కొన్నాళ్ల క్రితం ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి మెయిల్ వచ్చింది. ఆ మెయిల్​లో దేశ ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​లను చంపేస్తానని బెదిరించాడు. ఆ మీడియా సంస్థ ప్రతినిధులు పోలీసులుకు ఫిర్యాదు చేశారు. singhkartik78107@gmail.com అనే మెయిల్ ఐడీతో తమ కార్యాలయానికి సందేశం వచ్చినట్లు వారు పోలీసులకు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

'నేను బతికున్నంతకాలం ఎస్​సీ, ఎస్​టీ రిజర్వేషన్లను ఎవరూ లాక్కోలేరు- ఇది మోదీ గ్యారెంటీ' - lok sabha election 2024

ఇంటర్ ఎగ్జామ్స్ రాసిన తల్లీకొడుకులు- ఇద్దరిలో 'ఆమె'కే ఎక్కువ మార్కులు

Last Updated : May 23, 2024, 11:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.