Terrorist Attack On Army Convoy : జమ్ముకశ్మీర్‌లోని అఖ్నూర్ సెక్టార్‌లో ఆర్మీ అంబులెన్స్‌పై కాల్పులు జరిపిన ఉగ్రవాదుల్లో ఒకరిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. సంఘటన స్థలం వద్ద నుంచి ఆయుధ సామాగ్రిని ఆర్మీ జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. అర్థరాత్రి జమ్ములోని అఖ్నూర్ సెక్టార్‌లో ఆర్మీ అంబులెన్స్‌ను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు కాల్పులు జరిపారు. తర్వాత వారు అక్కడ నుంచి జారుకున్నారు. ఘటనపై తక్షణమే స్పందించిన ఆర్మీ ఉగ్రవాదుల కోసం భారీ గాలింపు చర్యలు చేపట్టింది. ముగ్గురు ఉగ్రవాదులు అర్థరాత్రి సమయంలో జమ్ములోకి చొరబడి ఆర్మీ అంబులెన్స్‌పై కాల్పులు జరిపినట్లు అధికారులు ధృవీకరించారు. అఖ్నూర్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ సమీపంలోని ఓ గ్రామంలో గాలింపు చర్యలు చేపట్టగా ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. మిగిలిన ఉగ్రవాదుల కోసం ఆపరేషన్ కొనసాగుతోందని ఆర్మీ అధికారులు వెల్లడించారు.
#WATCH | Akhnoor, J&K: J&K ADGP Anand Jain, along with NSG team, reaches at the site of encounter.
— ANI (@ANI) October 28, 2024
One terrorist has been gunned down and two have been hiding after terrorists fired upon an Army convoy near Asan, Sunderbani Sector today morning. pic.twitter.com/sKoMsLsRWd
రంగంలోకి యుద్ధ ట్యాంకులు
అయితే, సెర్చ్ ఆపరేషన్ కోసం ఆర్మీ యుద్ధ ట్యాంకులను రంగంలోకి దింపింది. APC 'శరత్' అని పిలిచే BMP-II ఇన్ఫ్యాంట్రి కంబాట్ వెహికిల్‌ను ఘటనా ప్రాంతంలో సైన్యం మోహరించింది.
#WATCH | Akhnoor, Jammu and Kashmir | One terrorist has been gunned down and two have been hiding after terrorists fired upon an Army convoy near Asan, Sunderbani Sector in the morning
— ANI (@ANI) October 28, 2024
BMP-II, Infantry Combat Vehicle which is also known as APC 'Sarath' (BMP-II) deployed as… pic.twitter.com/dXTxoGZ3hh
#WATCH | Akhnoor, Jammu and Kashmir | One terrorist has been gunned down and two have been hiding after terrorists fired upon an Army convoy near Asan, Sunderbani Sector in the morning
— ANI (@ANI) October 28, 2024
BMP-II, Infantry Combat Vehicle which is also known as APC 'Sarath' (BMP-II) deployed as… pic.twitter.com/2OXK3xTkDn
ఆపరేషన్‌లో ప్రాణాలు విడిచిన ఆర్మీ డాగ్
అఖ్నూర్‌లో జరిగిన ఎన్కౌంటర్లో ఆర్మీ డాగ్ 'ఫాంటమ్' ణాలు కోల్పోయింది. ఉగ్రవాదులు కాల్చిన బుల్లెట్ తగిలి మృతిచెందింది. 'ఫాంటమ్' ధైర్యం, విధేయత, అకితభావం ఎప్పటికీ మరచిపోలేనిదని సైన్యం తెలిపింది. నిజమైన హీరో, వీర ఇండియన్ ఆర్మీ డాగ్- ఫాంటమ్ చేసిన అత్యున్నత త్యాగానికి తాము సెల్యూట్ చేస్తున్నట్లు సైన్యం పేర్కొంది. తాము ఉగ్రవాదుల పైగా కాల్పులు జరుపుతుండగా, వారి బులెట్ తగిలి ఫాంటమ్ తీవ్రంగా గాయపడిందని ఆర్మీ వెల్లడించింది.
Indian Army dog, Phantom lost its life in operation after terrorists fired upon an Army convoy near Asan, Sunderbani Sector today morning.
— ANI (@ANI) October 28, 2024
White Knight Corps tweets, " as our troops were closing in on the trapped terrorists, phantom drew enemy fire, sustaining fatal injuries.… pic.twitter.com/81wKcCLG6k
ఆర్మీ కౌంటర్ సిస్టమ్
జమ్ముకశ్మీర్‌లో నియంత్రణ రేఖ దాటి వచ్చే డ్రోన్లను అడ్డుకునేందుకు భారత సైన్యం కౌంటర్ డ్రోన్ సిస్టమ్(మ్యాన్ పోర్టబుల్ కౌంటర్ డ్రోన్ సిస్టమ్ (MPCDS))- ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా స్థానిక ఆర్మీ కేంద్రాలు, నియంత్రణ రేఖ వెంబడి ఏర్పాటు చేసిన ప్రత్యేక కెమెరాల ద్వారా అనుమానాస్పద కదలికలపై నిఘా ఉంచుతాయి. చొరబాట్లను నియంత్రించడానికి సహాయపడతాయి.
#WATCH | Jammu & Kashmir | Counter Drone System - Man Portable Counter Drone System (MPCDS) has been installed by the Indian Army to monitor the LoC
— ANI (@ANI) October 28, 2024
The Counter Drone System has been placed by the Indian Army to block the drones coming from across the LoC. Local Control Centres… pic.twitter.com/It59Zp0KVR