ETV Bharat / bharat

తెలంగాణ టూరిజం స్పెషల్​ ప్యాకేజీ - ఫ్లైట్​లో జర్నీ - షిరిడీ సాయినాథుడి దర్శనంతో పాటు మరెన్నో ప్రదేశాలు! - Telangana Tourism Shiridi Package - TELANGANA TOURISM SHIRIDI PACKAGE

Telangana Tourism Shiridi Flight Package: షిరిడీ సాయినాథుడిని దర్శించుకోవాలనుకునే వారికి గుడ్ న్యూస్. తక్కువ ధరలోనే హైదరాబాద్‌ నుంచి షిరిడీకి తెలంగాణ టూరిజం టూర్‌ ప్యాకేజీని ఆపరేట్‌ చేస్తుంది. మరి ఈ టూర్‌ ఎన్ని రోజులు సాగుతుంది ? టికెట్ల ధర ఎంత ? వంటి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Telangana Tourism
Telangana Tourism Shiridi Flight Package (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 11, 2024, 4:04 PM IST

Telangana Tourism Shiridi Flight Package : పర్యాటక ప్రదేశాలు, ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకునే వారి కోసం తెలంగాణ టూరిజం ఎప్పటికప్పుడూ కొత్తకొత్త ప్యాకేజీలను ప్రవేశపెడుతోంది. బస్సు, రైలు ద్వారా వివిధ టూర్‌ ప్యాకేజీలను ఆపరేట్‌ చేస్తుంది. అందుబాటు ధరలోనే ప్యాకేజీలను ఆపరేట్​ చేస్తోంది. ఈ క్రమంలోనే షిరిడీ సాయినాథుడిని దర్శించుకోవాలనుకునే భక్తులకు తాజాగా ఈ సంస్థ ఒక శుభవార్తను చెప్పింది. తక్కువ ధరలోనే హైదరాబాద్‌ నుంచి షిరిడీకి టూర్​ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫ్లైట్‌ జర్నీ ద్వారా సాయినాథుడిని దర్శనం చేసుకోవచ్చు. మరి ఈ ట్రిప్‌ ఎలా సాగుతుంది ? ఏయే ప్రాంతాలను చూడొచ్చు ? ప్యాకేజీ ధర ఎంత ఉంటుంది ? అనే వివరాలను ఇప్పుడు చూద్దాం.

తెలంగాణ టూరిజం 'షిర్డీ-ఫ్లైట్ ప్యాకేజీ-తెలంగాణ టూరిజం' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్‌ చేస్తోంది. రెండు రోజుల పాటు ఈ టూర్‌ ఉంటుందని సంస్థ తెలిపింది. ఈ టూర్‌ ద్వారా షిరిడీ సాయినాథుడి దర్శనంతో పాటు పంచముఖి గణపతి టెంపుల్‌, ఖండోబా మందిర్‌ వంటి వివిధ ప్రాంతాలను సందర్శించవచ్చు.

టూర్‌ ఇలా సాగుతుంది :

  • మొదటి రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు శంషాబాద్ ఎయిర్‌ పోర్ట్ నుంచి షిరిడీకి ఫ్లైట్​ జర్నీ ప్రారంభమవుతుంది.
  • మధ్యాహ్నం 2.50 గంటలకు షిరిడీ విమానాశ్రయానికి చేరుకుంటారు.
  • తర్వాత అక్కడి నుంచి హోటల్‌కు తీసుకెళ్తారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత సాయంత్రం సాయిబాబా దర్శనం ఉంటుంది.
  • సాయంత్రం 6 నుంచి 6.30 గంటలకు జరిగే హారతి కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే సాయినాథుడిని దర్శనం కూడా చేసుకోవచ్చు.
  • నైట్‌ 7 నుంచి 7.30 గంటల మధ్య థీమ్‌ పార్క్‌లో షో ఉంటుంది. అందులో పాల్గొంటారు.
  • తర్వాత రాత్రి 8 గంటల వరకు షాపింగ్ చేసుకోవచ్చు. రాత్రి 9 గంటలకు తిరిగి హోటల్‌కు చేరుకుంటారు. అక్కడే నైట్‌ స్టే చేస్తారు.

హైదరాబాద్​ టూ అయోధ్య వయా కాశీ - IRCTC సూపర్​ ప్యాకేజీ - ధర కూడా తక్కువే! - IRCTC Punya Kshetra Yatra

రెండవ రోజు :

  • ఉదయం 8 గంటలకు బ్రేక్‌ఫాస్ట్‌ చేసిన తర్వాత పంచముఖి గణపతి ఆలయాన్ని సందర్శిస్తారు.
  • తర్వాత ఓల్డ్‌ షిరిడీని సందర్శిస్తారు. ఇక్కడ పర్యాటకులే టికెట్‌ కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
  • అలాగే ఖండోబా మందిరాన్ని చూడొచ్చు.
  • ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సాయి తీర్థ ఆధ్యాత్మిక పార్క్‌ సందర్శిస్తారు. ఇక్కడ కూడా ఎంట్రీ టికెట్‌ ఫీజు ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది.
  • మధ్యాహ్నం 12.30 గంటలకు హోటల్‌కు వస్తారు.
  • తర్వాత 1 నుంచి 2 గంటల వరకు భోజనం చేసి, 2.30 గంటలకు హోటల్‌ నుంచి విమానాశ్రయానికి బయలు దేరతారు.
  • సాయంత్రం 4 గంటలకు షిరిడీ నుంచి హైదరాబాద్‌కు జర్నీ ఉంటుంది.
  • సాయంత్రం 5.30 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్‌ పూర్తవుతుంది.

ఛార్జీలు ఎలా ఉన్నాయి : ఈ టూర్​ ప్రతిరోజూ ఉంటుంది. అయితే షిరిడీ వెళ్లాలి అనుకునేవారు మూడు రోజుల ముందుగానే బుకింగ్​ చేసుకోవాలి. ఇక ఈ టూర్‌లో ఒక్కరికి రూ. 12,499గా ధరను నిర్ణయించారు. ఈ టూర్‌ను బుకింగ్‌ చేసుకోవాలనుకునే వారు.. అలాగే మరిన్ని వివరాలను తెలుసుకోవాలనుకునే వారు ఈ లింక్​పై క్లిక్​ చేసి తెలుసుకోండి.

కేరళ అందాలు చూసొస్తారా? - తక్కువ ధరలోనే ఐఆర్​సీటీసీ స్పెషల్​ ప్యాకేజీ! - IRCTC Kerala Hills and Water Tour Package

తక్కువ ధరలో పుణ్యక్షేత్రాల దర్శనం - IRCTC స్ఫెషల్​ ప్యాకేజీ - పూర్తి వివరాలివే! - IRCTC Divya Dakshin Yatra

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.