ETV Bharat / bharat

శబరిమల భక్తుల కోసం 'స్వామి' AI చాట్‌బాట్‌- ఇకపై ఏ విషయంలోనూ నో ప్రాబ్లమ్​! - SABARIMALA SEASON 2024

శబరిమల భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు కొత్త సాంకేతికత- అందుబాటులోకి వాట్సాప్‌ ఆధారిత ఏఐ చాట్‌బాట్‌

Sabarimala Temple Chatbot
Sabarimala Temple Chatbot (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 26, 2024, 6:45 AM IST

Sabarimala Temple Chatbot : కేరళలోని శబరిమల ఆలయానికి మండల - మకరవిళక్కు సీజనులో లక్షల్లో తరలివచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు కొత్త సాంకేతికతను వాడుతున్నారు. ఈ క్షేత్రానికి ఏటా పెరుగుతున్న రద్దీతో పలు సవాళ్లు ఎదురవుతున్నాయి. భక్తుల వసతి, భద్రత, క్యూల నిర్వహణ ఎంతో ముఖ్యం. ఆలయ సమయాలు, ఆయా మార్గాల వివరాలు, యాత్రికుల సమూహాలకు సంబంధించిన కచ్చితమైన సమాచారం అందుబాటులో లేక భక్తులు గందరగోళానికి గురవుతుంటారు.

వాతావరణ సమాచారం లేకపోవడం వల్ల ముఖ్యంగా వర్షాకాలంలో, ట్రెక్కింగ్ సమయంలో భక్తులు తరచూ ప్రమాదాలకు గురవుతుంటారు. వీటికితోడు భాషాపరమైన సమస్యలు. ఆ సవాళ్లను అధిగమించేందుకు పథనంథిట్ట జిల్లా కలెక్టర్‌ ప్రేమ్‌ కృష్ణన్‌ నేతృత్వంలో వాట్సాప్‌ ఆధారిత ఏఐ చాట్‌బాట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీనికి స్వామి అని పేరు పెట్టారు. భక్తులకు ముఖ్యమైన, కచ్చితమైన సమాచారాన్ని అందించడమే ఈ చాట్‌బాట్‌ లక్ష్యం. యూజర్‌ ఫ్రెండ్లీగా పలు భాషల్లో ఇది సేవలందిస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ నవంబరు 13న దీన్ని ఆవిష్కరించారు. భక్తులందరికీ చేరేలా మీడియా, ఎఫ్‌ఎం రేడియో, సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేశారు. ఐదు వారాల్లోనే 1.5 లక్షల మంది భక్తులు అనుసంధానమైనట్లు అధికారులు తెలిపారు.

మరోవైపు, మండల పూజ సందర్భంగా శబరిమలలో స్వామి వారిని ఊరేగింపుగా తీసుకొచ్చిన థంకా అంకితో అలంకరించారు. ఆలయంలో దీపారాధన నిర్వహించారు. అంతకుముందు ఊరేగింపుగా తీసుకొచ్చిన థంకా అంకిని సన్నిధానం వద్ద మంత్రి వీఎన్ వాసవన్, దేవస్వోమ్ బోర్డు అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్, దేవస్వోమ్ బోర్డు సభ్యులు, ఇతర అధికారులు స్వాగతం పలికారు. ఆలయ మెట్ల వద్ద తంత్రి కందరారు రాజీవరు, మేల్శాంతి అరుణ్ కుమార్ నంబూతిరి, సహాయ అర్చకులు తంక అంకిని లాంఛనంగా స్వీకరించి ఆలయం లోపలికి తీసుకెళ్లారు. సాయంత్రం 6.30 గంటలకు మహా దీపారాధన నిర్వహించారు. థంకా అంకిని అలంకరించి, స్వామి దర్శనానికి భక్తులకు అవకాశం కల్పించారు.

అయితే శబరిమల స్వామి అయ్యప్ప ఆలయ వార్షిక తీర్థయాత్ర మొదటి దశ ముగింపును సూచించే కీలకమైన మండల పూజ గురువారం జరగనుంది. ఆలయ తంత్రి (ప్రధాన పూజారి) కందరారు రాజీవరు ఆధ్వర్యంలో మధ్యాహ్నం నుంచి 12.30 గంటల మధ్య పూజలు నిర్వహించనున్నారు. మండల పూజ, నెయ్యభిషేకం తర్వాత ఆలయం డిసెంబర్ 26వ రాత్రి 11 గంటలకు మూసివేయనున్నారు. మకరవిళక్కు ఉత్సవాల కోసం డిసెంబర్ 30వ తేదీ సాయంత్రం తిరిగి తెరవనున్నారు. డిసెంబర్ 23 నాటికి ఈ సీజన్‌లో మొత్తం 30,87,049 మంది యాత్రికులు అయ్యప్ప ఆలయాన్ని సందర్శించారు. గతేడాదితో పోలిస్తే సుమారు 4.46 లక్షల మంది భక్తులు పెరిగారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.