ETV Bharat / bharat

సమ్మర్​ స్పెషల్​ - కూల్​ కూల్​ బనానా మిల్క్ షేక్​ - ప్రిపరేషన్​ వెరీ ఈజీ! - Banana Milkshake Recipe - BANANA MILKSHAKE RECIPE

Banana Milkshake: అన్ని కాలాల్లో అందరికీ అందుబాటులో ఉండే ఆహారమేదంటే మనందరికీ వెంటనే గుర్తుకొచ్చేది.. అరటి పండు. తక్కువ ధర, తినడానికి సౌలభ్యంగా ఉండే ఈ పండును నేరుగా కాకుండా.. ఇలా మిల్క్ షేక్​ రూపంలో తీసుకుంటే సమ్మర్​లో అధిక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు నిపుణులు. తయారీ కూడా చాలా ఈజీ! ఇంతకీ, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పడు చూద్దాం.

How to Make Banana Milkshake
Banana Milkshake
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 24, 2024, 3:36 PM IST

How to Make Banana Milkshake at Home: ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10 దాటక ముందే సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు. దీంతో జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ముఖ్యంగా ఈ టైమ్​లో శరీరాన్ని హైడ్రేట్​గా ఉంచుకోవడం చాలా అవసరం. ఈ క్రమంలో చాలా మంది వేసవి తాపం నుంచి ఉపశమనం పొందడం కోసం ఏవేవో శీతల పానీయాలు తీసుకుంటుంటారు. అయితే, వాటిని తాగడం వల్ల తక్షణ ఉపశమనం దొరికినా తర్వాతర్వాత తీవ్ర అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు. అలాకాకుండా.. ఉండాలంటే కూల్​డ్రింక్స్​కు బదులు అరటి పండుతో(Banana) ఇలా మిల్క్ షేక్ ప్రిపేర్ చేసుకుని తీసుకోవడం మంచిది అంటున్నారు.

అరటిపండుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయో మనందరికీ తెలిసిన విషయమే. అందరికీ అందుబాటు ధరలో ఉండే బనానాతో మిల్క్ షేక్ తయారుచేసుకొని తాగితే సమ్మర్​లో ఎండ వేడిమి మంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే.. డీహైడ్రేషన్, నీరసం దరిచేరకుండా రోజంతా యాక్టివ్​గా ఉంటారు. దీని తయారీ కోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఇంటి వద్దే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి, ఇంకెందుకు ఆలస్యం ఈ రుచికరమైన బనానా మిల్క్ షేక్​ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • బాగా పండిన అరటిపండ్లు - 4 చిన్నవి లేదా 2 పెద్దవి
  • పాలు -1 కప్పు
  • చక్కెర - రుచికి సరిపడా
  • జీడిపప్పు, బాదం తరుగు - కొద్దిగా
  • ఐస్ క్యూబ్స్ - కొన్ని(అవసరం మేరకు)

కొబ్బరి నీళ్లు Vs లెమన్‌ వాటర్‌- సమ్మర్​లో ఏ డ్రింక్​ బెస్ట్​! నిపుణుల మాటేంటి!

బనానా మిల్క్ షేక్ తయారీ విధానం :

  • ముందుగా ఒక కప్పు పాలను వేడి చేసి చల్లార్చుకోవాలి. అవసరమైతే కాసేపు ఫ్రీజర్​లో ఉంచుకోండి.
  • అలాగే అరటిపండ్లను తొక్క తీసి మీడియం సైజ్​లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. గార్నిష్ కోసం జీడిపప్పు, బాదం పప్పులను సన్నని ముక్కలుగా(తరుగు) కట్ చేసుకొని పెట్టుకోవాలి.
  • ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసుకున్న అరటిపండు ముక్కలు, సరిపడా పంచదార, కాచి చల్లార్చిన పాలతో పాటు కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
  • ఆపై ఆ మిశ్రమాన్ని ఒక గ్లాస్​లోకి తీసుకొని దానిపై జీడిపప్పు, బాదంపప్పు ముక్కలతో గార్నిష్ చేసుకోవాలి. అంతే.. ఎంతో రుచికరమైన కూల్​ కూల్​గా ఉండే బనానా మిల్క్ షేక్ రెడీ! అయితే.. ఇక్కడ ఐస్ క్యూబ్స్ వేయని వారు నార్మల్​గా దానిని ప్రిపేర్ చేసుకొని కాసేపు ఫ్రిజ్​లో ఉంచి ఆ తర్వాత తీసుకోవచ్చు.
  • దీనిని సమ్మర్​లో తాగారంటే వేసవి తాపం నుంచి ఉపశమనం పొందవచ్చు. అరటిపండు తినని పిల్లలు కూడా ఈ మిల్క్​షేక్​ను తాగుతారు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు నిపుణులు.

సమ్మర్ స్పెషల్ పెరుగు పచ్చళ్లు - ఈజీగా ప్రిపేర్ చేసుకోండిలా - రుచితోపాటు ఆరోగ్యం బోనస్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.