Mallikarjun Kharge Health Update : కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అస్వస్థతకు గురయ్యారు. జమ్ముకశ్మీర్‌లోని కఠువా జిల్లాలో ఆదివారం ఆ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తున్న సమయంలో ఆయన అదుపు తప్పి పడపోబోయారు. దీంతో అక్కడున్న నేతలు ఖర్గేను పట్టుకున్నారు. వెంటనే నీరు తాగించారు. అయినప్పటికీ ఆయన ప్రసంగాన్ని మాత్రం ఆపలేదు. పార్టీ నేతలు ఆయనను పట్టుకుని నిలబడి ఉండగా ప్రసంగాన్ని కొనసాగించారు.
"జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను తిరిగి తీసుకువస్తాం. అందుకోసం పోరాడుతూనే ఉంటాం. ఎనిమిది పదుల వయసులో ఉన్న నేను అప్పుడే చనిపోను. మోదీ సర్కార్‌ను గద్దె దించే వరకు అలసిపోను. అప్పటివరకు బతికే ఉంటా"
-- మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు
అయితే మల్లికార్జున ఖర్గే అస్వస్థతకు గురైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వెంటనే పార్టీ అగ్రనాయకత్వం జమ్ముకశ్మీర్ నేతలను అప్రమత్తంగా ఉండమని సూచించింది. అనంతరం కఠువా ఆస్పత్రికి వైద్య పరీక్షల కోసం పార్టీ నాయకులు ఖర్గేని తీసుకెళ్లారు. ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు- బీపీ సమస్య ఉన్నట్లు గుర్తించారు. అదే సమయంలో మల్లికార్జున ఖర్గే ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన కుమారుడు ప్రియాంక్ ఖర్గే సోషల్ మీడియాలో వెల్లడించారు.
Karnataka Minister and son of Mallikarjun Kharge tweets " congress president mallikarjun kharge felt slightly unwell while addressing a public meeting in jasrota, jammu & kashmir. he has been checked upon by his medical team and apart from slightly low blood pressure, he is doing… https://t.co/dWzEVfQiV0 pic.twitter.com/DOdeZnnGLL
— ANI (@ANI) September 29, 2024
"జస్రోతాలో జరిగిన బహిరంగసభలో ప్రసంగిస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అస్వస్థతకు గురయ్యారు. వెంటనే డాక్టర్ల బృందం వైద్య పరీక్షలు చేసింది. బీపీ సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించింది. ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారు. ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రజల ఆశీస్సులతో ఆయన బలంగా ముందుకు వెళ్తారు. ఆయన సంకల్పం కూడా అలానే ఉంటుంది" అని ప్రియాంక ఖర్గే ట్వీట్ చేశారు. వైద్య పరీక్షల అనంతరం ఆస్పత్రి నుంచి మల్లికార్జున ఖర్గే ఆదివారం సాయంత్రం డిశ్చార్జ్ అయ్యారు
#WATCH | J&K: Congress national president Mallikarjun Kharge discharged from a hospital in Kathua
— ANI (@ANI) September 29, 2024
He was admitted here after he felt slightly unwell while addressing a public meeting in Jasrota (Kathua), Jammu & Kashmir. pic.twitter.com/j7XwY7jTvq
జమ్ముకశ్మీర్‌లోని ఏడు జిల్లాల పరిధిలో తొలి దశ కింద 24 శాసనసభ నియోజకవర్గాలకు జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 61 శాతం పోలింగ్ నమోదు అయింది. రెండో విడత పోలింగ్ ఆరు జిల్లాల్లోని 26 నియోజకవర్గాల్లో పూర్తి కాగా, ఇప్పుడు మూడో విడత పోలింగ్‌కు జమ్ముకశ్మీర్ సిద్ధమైంది.