Mumbai Toll Tax Exemption : టోల్ ఫీజుల వసూలుకు సంబంధించి మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముంబయికి వెళ్లే మార్గంలోని మొత్తం ఐదు టోల్ బూత్‌ల వద్ద లైట్ మోటార్ వాహనాలకు టోల్ ఫీజులను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు సీఎం ఏక్‌నాథ్ శిందే ప్రకటించారు. ఈ అర్థరాత్రి నుంచి ఈ టోల్ మినహయింపు అమలులోకి వస్తుందని సోమవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో తెలిపారు. మహారాష్ట్రలో త్వరలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో వాహనదారులకు ఐదు టోల్‌ప్లాజాల వద్ద ఫీజుల నుంచి మినహయింపు లభించనుంది. ఇకపై దహీసర్, ములుంద్, వైశాలి, ఐరోలి, ఆనంద్ నగర్ టోల్ ప్లాజాలో లైట్ మోటార్ వాహనాదారులు ఎలాంటి రుసుములు చెల్లించాల్సిన అవసరం ఉండదని మంత్రి దాదాజీ దగదు భూసే అన్నారు. 'ప్రస్తుతం టోల్ ఫీజుగా రూ.45, రూ.75 వసూలు చేస్తున్నాం. దాదాపు 3.5 లక్షల వాహనాలు ఈ మార్గంలో ప్రవేశిస్తాయి. వాటిలో 70 వేల హైవీ వాహనాలు కాగా, 2.80 లక్షలు చిన్నవి ఉన్నాయి. ఈ నిర్ణయం సోమవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానుంది. దీంతో ప్రజలు క్యూలలో ఉండే సమయం ఆదా అవుతుంది. ప్రభుత్వం చాలా కాలంగా చర్చించిన తర్వాతే ఈ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది' అని దాదాజీ అన్నారు.
#WATCH | Maharashtra Govt announces full toll exemption for all light motor vehicles entering Mumbai.
— ANI (@ANI) October 14, 2024
Maharashtra minister Dadaji Dagadu Bhuse says " at the time of entry into mumbai, there were 5 toll plazas, including dahisar toll, anand nagar toll, vaishali, airoli and mulund.… pic.twitter.com/jTsy4nKvN2
'మళ్లీ అధికారంలోకి రావడమే కోసమే'
ఏక్‌నాథ్ శిందే ప్రభుత్వం టోల్ రుసుములు తొలగిస్తూ తీసుకున్న నిర్ణయంపై విపక్షాలు మండిపడ్డాయి. మహారాష్ట్రలో శాంతిభద్రతలు పూర్తిగా పతనమయ్యాక ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని శివసేన(యూబీటీ) నేత ప్రియాంక చతుర్వేది ఆరోపించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని, మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు చివరి నిమిషంలో ఇలాంటి పనులు చేపడుతున్నారని విమర్శించారు.
#WATCH | Mumbai: Maharashtra Govt announces full toll exemption for all light motor vehicles entering Mumbai.
— ANI (@ANI) October 14, 2024
Shiv Sena (UBT) MP Priyanka Chaturvedi says, " just now one more announcement has been made. ..after completely finishing the law and order situation in maharashtra, now… pic.twitter.com/nHZ4o8vRQQ
యూనివర్సిటీకి రతన్ టాటా పేరు
మరోవైపు, మహారాష్ట్ర స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ పేరు మార్చుతూ మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల కన్నుమూసిన దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా గౌరవార్థం ఈ యూనివర్సిటీకి ఆయన పేరును పెట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విశ్వవిద్యాలయం పేరు 'రతన్ టాటా స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ'గా మారనుంది.