Shahrukh Khan Father Contested In 1957 LS Polls : బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తండ్రి మీర్ తాజ్ మహమ్మద్ ఖాన్ ఓ స్వాత్రంత్ర సమరయెధుడు. సరిహద్దు గాంధీగా పేరొందిన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్‌తో కలసి అహింసా ఉద్యమంలో షారూక్ తండ్రి చురుగ్గా పాల్గొన్నారు. దేశవిభజనకు ముందు పాకిస్థాన్‌లోని పెషావర్‌లో నివాసం ఉన్న వీరి కుటుంబం స్వాతంత్ర్యం తర్వాత దిల్లీకి మకాం మార్చింది. అప్పట్నుంచి రాజకీయాల్లోనూ చురుగ్గా ఉండేవారు.
1957లో ఎన్నికల బరిలోకి షారుక్ తండ్రి!
హరియాణా నుంచి షారుక్ ఖాన్ తండ్రి మీర్ తాజ్ మహమ్మద్ ఖాన్ ఎన్నికల బరిలో కూడా నిలిచారు. దేశ మొదటి విద్యాశాఖమంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి మౌలానా అబుల్ కలాం అజాద్‌పై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన తాజ్ పరాజయం పాలయ్యారు. అయితే తన తండ్రి ఎన్నికల సమరంలో పాల్గొనే సమయాంలో అసలు షారుక్ ఖాన్ ఇంకా పుట్టనే లేదు. షారుక్ 1965లో జన్మించగా, మీర్ తాజ్ 1957లోనే ఎన్నికల బరిలోకి దిగారు.
1957వ సంవత్సరంలో షారుఖ్ ఖాన్ తండ్రి హరియాణాలోని గుడ్‌గావ్ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు. స్వాతంత్య్రానంతరం జరిగిన రెండో లోక్‌సభ ఎన్నికలు అవి. 1957 ఎన్నికల్లో గుడ్‌గావ్ స్థానం నుంచి మొత్తం ముగ్గురు అభ్యర్థులు బరిలో నిలిచారు. కాంగ్రెస్ నుంచి అబుల్ కలాం ఆజాద్, భారతీయ జన్‌సంఘ్ నుంచి మూల్ చంద్, స్వతంత్ర అభ్యర్థిగా షారుక్ తండ్రి మీర్ తాజ్ మహమ్మద్ ఖాన్ బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో మీర్ తాజ్ పరాజయాన్ని చవిచూశారు.
ఒక్కటంటే ఒక్క ఓటు కూడా పడలేదు
1957లో గుడ్‌గావ్ లోక్‌సభ స్థానంలో మొత్తం 4,34,621 మంది ఓటర్లు ఉండగా అందులో 2,86,774 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్‌కు చెందిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ 1,91,221 ఓట్లు సాధించారు. అంటే పోలైన మొత్తం ఓట్లలో అజాద్‌కు 66.7 శాతం ఓట్లు వచ్చాయి. రెండో స్థానంలో మూల్ చంద్ ఉన్నారు. ఆయనకు 95,553 ఓట్లు వచ్చాయి. మూల్ చంద్‌కు 33.3 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన మీర్ తాజ్ మహమ్మద్ ఖాన్‌కు ఒక్క ఓటు కూడా పడలేదు. ఈ ఎన్నికల్లో ఆయన ఘోరంగా ఓడిపోయారు. 1981లో క్యాన్సర్ వ్యాధితో మరణించారు.
సేవకుడి మృతదేహం వద్ద ఆవు కన్నీరు- శ్మశానానికి వెళ్లి కూడా! - Cow At Owner Funeral