SC On Hijab Banning : క్యాంపస్‌లో హిజాబ్, బుర్ఖా, క్యాప్, నిఖాబ్‌ను నిషేధిస్తూ ముంబయిలోని ఓ కాలేజీ జారీ చేసిన సర్క్యులర్‌పై సుప్రీంకోర్టు స్టే విధించింది. నచ్చిన దుస్తుల ధరించే స్వేచ్ఛ విద్యార్థినిలకు ఉండాలని అభిప్రాయపడింది. విద్యా సంస్థలు, విద్యార్థినిల డ్రెస్ కోడ్‌పై బలవంతం చేయలేవని పేర్కొంది. ఈ మేరకు ఎన్జీ ఆచార్య అండ్ డీకే మరాఠే కళాశాలను నిర్వహిస్తున్న చెంబూర్ ట్రాంబే ఎడ్యుకేషన్ సొసైటీకి నోటీసులను జారీ చేసింది. నవంబర్ 18 లోపు విద్యార్థినిల డ్రెస్ కోడ్‌పై విధించిన నిషేధంపై ప్రతిస్పందనను తెలియజేయాలని కోరింది.
"నచ్చిన దుస్తులను ధరించే అవకాశం విద్యార్థినిలకు ఉండాలి. డ్రెస్ కోడ్‌పై వారిని కాలేజీలు బలవంతం చేయకూడదు. దేశంలో అనేక మతాలు ఉన్నాయని తెలిసి, మీరు అకస్మాత్తుగా ఇలాంటి చర్యలు తీసుకోవడం దురదృష్టకరం. విద్యార్థుల పేర్లు వారి మతపరమైన గుర్తింపును బయటపెట్టట్లేదా? అలాగని ఇక నుంచి వారిని నంబర్లతో పిలుస్తారా?. విద్యార్థుల మత విశ్వాసాలను బహిర్గతం చేయకూడదనే ఉద్దేశ్యంతో కళాశాల తిలక్(బొట్టు), బిందీలను ఎందుకు నిషేధించలేదు" అని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.
'క్లాస్ రూమ్‌లో బుర్ఖా ధరించరాదు'
క్లాస్ రూమ్‌లో అమ్మాయిలు బుర్ఖా ధరించరాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. క్యాంపస్‌లో ఎలాంటి మతపరమైన కార్యకలాపాలకు అనుమతి లేదని పేర్కొంది. ఈ మధ్యంతర ఉత్తర్వులను ఎవరైనా ఉల్లంఘిస్తే సదరు విద్యా సంస్థ కోర్టుకు వెళ్లేందుకు స్వేచ్ఛ కల్పించింది. అనంతరం దీనిపై కాలేజీకి నోటీసులు జారీ చేసింది. నవంబరు 18లోగా తమ స్పందన తెలియజేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.
ఇదీ కేసు
క్యాంపస్‌లో హిజాబ్, బుర్ఖా, నిఖాబ్, క్యాప్ వంటివి ధరించకూడదంటూ ముంబయిలోని ఎన్జీ ఆచార్య అండ్ డీకే మరాఠీ కాలేజీ ఇటీవల ఓ సర్క్యులర్ జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ కొన్ని విద్యార్థి సంఘాలు బాంబే హైకోర్టును ఆశ్రయించాయి. కళాళాల జారీ చేసిన సర్క్యులర్‌ను బాంబే హైకోర్టు సమర్థించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హిజాబ్, బుర్ఖా నిషేధం కారణంగా విద్యార్థినిలకు తరగతులకు హాజరుకాలేకపోతున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కాలేజీ జారీ చేసిన సర్క్యులర్‌పై స్టే విధించింది.
హిజాబ్‌పై ఇరాన్ మహిళ స్వేచ్ఛానినాదం.. ఇంకా చల్లారని ఆగ్రహ జ్వాల!
హిజాబ్ నిషేధంపై ఎటూ తేల్చని సుప్రీం.. భిన్న తీర్పులిచ్చిన ఇద్దరు న్యాయమూర్తులు