Hindenburg On SEBI Chief Issue : సెబీ ఛైర్‌పర్సన్ మాధబి బచ్‌పై అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తాజా ఆరోపణలు సంచలనంగా మారాయి. దేశంలో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. హిండెన్‌బెర్గ్ చేసిన ఆరోపణలపై దర్యాప్తును సీబీఐ లేదా సిట్‌కు అప్పగించాలని సుప్రీంకోర్టుకు కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. మరోవైపు, హస్తం పార్టీతోపాటు దాని మిత్రపక్షాలు దేశంలో ఆర్థిక అస్థిరతకు దారితీసేందుకు కుట్ర పన్నాయని బీజేపీ ఆరోపించింది.
సెబీతో కుమ్మక్కు అయ్యే అవకాశం ఉన్నందునే!
సెబీతో కుమ్మక్కు అయ్యే అవకాశం ఉన్నందున అదానీ సంస్థను ఉద్దేశించి హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలపై దర్యాప్తును సీబీఐ లేదా సిట్‌కు అప్పగించాలని సుప్రీంకోర్టుకు కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. సెబీ ఛైర్‌పర్సన్ పదవికి మాదభి బచ్ వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ డిమాండ్ చేశారు. మోదీ, అదానీ కలిసి చేసిన "మోదానీ మెగా స్కామ్"పై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయడానికి వెంటనే జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని పునరుద్ఘాటించారు.
Here is the statement by Shri @Jairam_Ramesh, MP and General Secretary (Communications), AICC, dated August 12, 2024, in response to SEBI's statement of August 11, 2024. pic.twitter.com/Tsb8qdiVHk
— Congress (@INCIndia) August 12, 2024
హిండెన్‌బర్గ్ ఆరోపణలపై 2 నెలల్లో దర్యాప్తు ముగించాలని గతేడాది ఫిబ్రవరిలో సెబీని సుప్రీంకోర్టు ఆదేశించిందని గుర్తు చేశారు జైరాం రమేశ్. ఇప్పటివరకు కనీస పబ్లిక్ షేర్ హోల్డింగ్‌కు సంబంధించిన రూల్ 19Aని అదానీ సంస్థ ఉల్లంఘించిందా అనే దాన్ని కూడా సెబీ తెలుసుకోలేదని ఆరోపించారు. సెబీ దర్యాప్తు ఆలస్యం వల్ల తన స్నేహితుడి అక్రమ కార్యకలాపాలు బయటపడకుండా ప్రధాని మోదీ, ఎన్నికలను సౌకర్యవంతంగా నావిగేట్ చేశారన్నారు.
అదానీకి సెబీ ఓ కాజీ క్లబ్‌లా!
"మాధవి బచ్‌ను సెబీ ఛైర్‌పర్సన్‌గా నియమించే సమయంలో బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తోంది? అదానీ ఆఫ్‌షోర్ కంపెనీల్లో ఆమెకు పెట్టబడులు ఉన్నాయని నిజంగానే వారికి తెలియదా? లేక తెలిసే చేశారా? దానికి కూడా కాంగ్రెసే కారణమా? అని హస్తం పార్టీ నేత పవన్ ఖేరా ప్రశ్నించారు. "ఈ మొత్తం వ్యవహారానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వమేకారణం. సెబీ ఛైర్మన్ నియామకం సమయంలో ఈ విషయాల్ని పరిగణనలోకి తీసుకోలేదు. అందుకే అదానీకి సెబీ ఓ కాజీ క్లబ్‌లా మారిపోయింది" అని పవన్ ఆరోపించారు.
VIDEO | “What were they (BJP) doing when they were appointing Madhavi Buch as Chairperson of SEBI? Didn’t they know all these facts about Madhavi Buch’s investments in offshore companies owned by Adani? Is the Congress responsible for that conflict of interest? The BJP and the… pic.twitter.com/hM52xIRhNR
— Press Trust of India (@PTI_News) August 12, 2024
'భారత ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచే కుట్ర!'
సెబీ చైర్‌పర్సన్‌పై హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలపై జేపీసీ విచారణ జరపాలన్న కాంగ్రెస్ డిమాండ్‌ను భారతీయ జనతా పార్టీ తోసిపుచ్చింది. ఇది భారత ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచి, దేశంలో పెట్టుబడులను నాశనం చేసే బూటకం లాంటిదని వ్యాఖ్యానించింది. ప్రతిపక్షాల విమర్శలు కుట్రలో భాగంలోనివని బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు.
ప్రజలు తిరస్కరించిన తర్వాత కాంగ్రెస్‌తోపాటు దాని మిత్రపక్షాలు టూల్‌కిట్ ముఠాలోని సన్నిహిత మిత్రుడితో కలిసి దేశంలో ఆర్థిక అస్థిరతకు దారితీసేందుకు కుట్ర పన్నాయని రవిశంకర్ ప్రసాద్ మండిపడ్డారు. 2004 నుంచి 2014 మధ్య పదేళ్ల కాంగ్రెస్ పాలనలో అనేక కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. ఇప్పుడు వచ్చిన నివేదికలు అప్పుడు ఎందుకు బయటకు రాలేదని ప్రశ్నించారు. కల్పిత నివేదిక ఆధారంగా ఆర్థికంగా అరాచకం సృష్టించడంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నిమగ్నమైందని ఆరోపణలు చేశారు.
అయితే పెట్టుబడిదారులు కాంగ్రెస్ కుట్రను గ్రహించారని, మార్కెట్‌ను కుదిపేసే ప్రయత్నాలను తిరస్కరించారని తెలిపారు. అదానీ గ్రూప్‌పై స్టాక్ మార్కెట్ అవకతవకలకు సంబంధించి గత ఏడాది హిండెన్‌బర్గ్‌కు సెబీ నోటీసు పంపిందని, కానీ విచారణకు సహకరించలేదని ఆరోపించారు. దానికి బదులు ఇప్పుడు చైర్‌పర్సన్ మాధబిపై దాడి మొదలుపెట్టిందని అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతోపాటు ఆయన టూల్ కిట్ స్నేహితులు దేశంపై ద్వేషం పెంచుకున్నారని ఆరోపణలు చేశారు.
#WATCH | On the recent report of Hindenburg Research, BJP MP Ravi Shankar Prasad says, " today we want to raise some issues. whose investment is there in hindenburg? do you know this gentleman george soros who regularly runs propaganda against india...he is the main investor… pic.twitter.com/52B78GGFBC
— ANI (@ANI) August 12, 2024
హిండెన్‌బర్గ్‌పై కఠిన చర్యలు తీసుకుంటాం: కేంద్రమంత్రి
అయితే హిండెన్‌బర్గ్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, జైరాం రమేశ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. "ఇది దేశం పరువు తీసే గ్యాంగ్. రాహుల్ గాంధీ, జైరాం రమేశ్, హిండెన్‌బర్గ్ మన పరువు తీశారు. దేశానికి జరిగిన ఈ అవమానాన్ని మేం సహించం. ఇలాంటి వ్యక్తులు దేశానికి శత్రువులు. హిండెన్‌బర్గ్‌పై కఠిన చర్యలు తీసుకుంటాం" అని చెప్పారు.
గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ నియంత్రణలోని కొన్ని బెర్ముడా, మారిషస్ ఫండ్‌లలో సెబీ చీఫ్ మాధబి పురి, ఆమె భర్త ధావల్ బచ్ 2015లో పెట్టుబడులు పెట్టారని, వారి వాటాల నికర విలువ 10 మిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చని హిండెన్‌బర్గ్ ఆరోపించింది. 2017లో సెబీ పూర్తి కాలపు సభ్యురాలిగా మాధబి నియమితులయ్యారు. 2022 మార్చిలో సెబీ ఛైర్‌పర్సన్‌గా పదోన్నతి పొందారు. తమకు వాటాలున్న విదేశీ సంస్థలు కనుకే, అదానీ గ్రూప్‌పై సెబీ విచారణ తూతూమంత్రంగా జరిగేలా చేశారన్నది హిండెన్‌బర్గ్ తాజా ఆరోపణ. దీన్ని సెబీ చీఫ్‌తో పాటు అదానీ గ్రూప్ కూడా ఖండించింది.
హిండెన్‌బర్గ్ ఆరోపణల ఎఫెక్ట్ - అదానీ గ్రూప్ స్టాక్స్ ఢమాల్ - Adani Shares Today Graph