SC Review On Governor Immunity : క్రిమినల్ కేసుల విషయంలో గవర్నర్లకు మినహాయింపునిచ్చే రాజ్యాంగ నిబంధనలను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. బంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ తనపై వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఓ మహిళా ఉద్యోగిని దాఖలు చేసిన పిటిషన్‌పై బంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. క్రిమినల్ కేసుల్లో గవర్నర్లకు రాజ్యాంగపరమైన మినహాయింపులు ఉన్న వ్యవహారంలో అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి సహాయాన్ని సుప్రీంకోర్టు కోరింది.
బంగాల్ రాజ్‌భవన్‌లో పనిచేస్తున్న మహిళా కాంట్రాక్ట్ ఉద్యోగి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 361 ప్రకారం, క్రిమినల్ కేసుల నుంచి గవర్నర్లకు పూర్తి మినహాయింపు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గవర్నర్లకు మినహాయింపుల విషయంలో మార్గదర్శకాలు రూపొందించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఇందులో కేంద్రాన్ని కూడా భాగస్వామిగా చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం గవర్నర్లకు మినహాయింపునిచ్చే రాజ్యాంగ నిబంధనలను పరిశీలించేందుకు అంగీకరించింది.
అసలేంటీ ఆర్టికల్ 361?
రాజ్యాంగంలోని ఆర్టికల్ 361 ప్రకారం, రాష్ట్రపతి, గవర్నర్లకు వ్యతిరేకంగా వారి పదవీకాలంలో ఎటువంటి క్రిమినల్ ప్రొసీడింగ్‌లు జరపడానికి వీలులేదు. అంటే ఈ ఆర్టికల్ ద్వారా రాజ్యాంగ అధిపతులుగా ఉన్న రాష్ట్రపతి, గవర్నర్లకు సివిల్, క్రిమినల్ కేసుల్లో కొన్ని మినహాయింపులు ఉంటాయి.
కేసు ఏంటంటే?
బంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై కొన్నాళ్ల క్రితం రాజ్‌భవన్‌లో పనిచేసే ఓ మహిళా ఉద్యోగి లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఆ తర్వాత ఆమె స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఉద్యోగం విషయంలో ప్రయోజనాలు చేకూర్చుతానన్న నెపంతో, గవర్నర్ తనను పలుమార్లు లైంగికంగా వేధించారని ఆరోపించారు. అప్పట్లో ఈ ఆరోపణలు రాజకీయంగా సంచలనం రేపాయి. టీఎంసీ సర్కార్, గవర్నర్ ఆనంద్ బోస్‌ల మధ్య మాటల యుద్ధం కూడా నడిచింది. గవర్నర్ పదవికి ఆనంద్ బోస్ అప్రతిష్ఠ తెచ్చారని టీఎంసీ విమర్శించింది. సందేశ్ ఖాలీలో మహిళా హక్కుల గురించి మాట్లాడిన వ్యక్తే ఇప్పుడు ఇలాంటి అవమానకరమైన చర్యలో భాగమయ్యారని దుయ్యబట్టింది.
'త్వరలో డ్రగ్స్ సరఫరా విధ్వంసక వ్యవస్థ - దేశంలోకి ఒక్క గ్రాము కూడా రానివ్వం' - అమిత్ షా
46ఏళ్ల తర్వాత తెరచుకున్న పూరీ రత్నభాండాగారం - ఎంత సంపద ఉందంటే? - Puri Jagannath Ratna Bhandar Open