ETV Bharat / bharat

బీజేపీలోకి ఎయిర్​ఫోర్స్ మాజీ చీఫ్- ఆ నియోజకవర్గం నుంచి పోటీ? - RKS Bhadauria Join BJP - RKS BHADAURIA JOIN BJP

RKS Bhadauria Join BJP : లోక్​సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీలోకి చేరికల జోరు కనిపిస్తోంది. ఆదివారం భారత వైమానిక దళ మాజీ అధిపతి ఆర్​కేఎస్ భదౌరియా బీజేలో చేరారు.

RKS Bhadauria Join BJP
RKS Bhadauria Join BJP
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 24, 2024, 1:11 PM IST

Updated : Mar 24, 2024, 2:27 PM IST

RKS Bhadauria Join BJP : లోక్‌సభ ఎన్నికలు సమీపించిన ప్రస్తుత తరుణంలో బీజేపీలోకి చేరికలు వేగాన్ని పుంజుకున్నాయి. ఈక్రమంలోనే భారత వాయుసేన మాజీ చీఫ్ ఆర్‌కేఎస్ భదౌరియా దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయం వేదికగా బీజేపీలో చేరారు. ఈకార్యక్రమంలో ఆయనతో పాటు తిరుపతి మాజీ ఎంపీ, మాజీ ఐఏఎస్ అధికారి వరప్రసాదరావు కూడా కాషాయ పార్టీ కండువా కప్పుకున్నారు. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే సమక్షంలో ఈ చేరికలు జరిగాయి.

దేశ నిర్మాణానికి సహకరించేందుకు మరోసారి అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు భదౌరియా. 'నేను భారత వాయుసేనలో నాలుగు దశాబ్దాలకుపైగా పనిచేశాను. కానీ,నా సర్వీసులో అత్యుత్తమ సమయం మాత్రం గత ఎనిమిదేళ్ల బీజేపీ ప్రభుత్వంలోనిదే. సైన్యం సాధికారత, ఆధునీకరణ, స్వావలంబన కోసం మోదీ సర్కారు చర్యలు తీసుకుంటోంది. దీని వల్ల భద్రతా బలగాలు కొత్త సామర్థ్యాన్ని, కొత్త విశ్వాసాన్ని పొందుతాయి. ప్రపంచవ్యాప్తంగా భారతదేశాన్ని కొత్త శిఖరాలకు చేర్చిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీదే' అని వాయుసేన మాజీ చీఫ్ కొనియాడారు.

'ఆ ఇద్దరి చేరిక గొప్ప విషయం'
ప్రభుత్వ సేవలో సుదీర్ఘ చరిత్ర కలిగిన ఇద్దరు వ్యక్తులు బీజేపీలో చేరడం గొప్ప విషయమని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ' దేశ భద్రత, శ్రేయస్సు, అభివృద్ధి కోసం ప్రధాని మోదీ చేస్తున్న కృషిని చూసి వారు బీజేపీలో చేరారు. సాయుధ దళాల్లో పనిచేస్తున్న వారి 'వన్ ర్యాంక్ వన్ పెన్షన్' డిమాండ్‌ను నెరవేర్చింది కూడా మోదీ ప్రభుత్వమే. ఆర్టికల్ 370ని రద్దు చేసి, దేశ అంతర్గత భద్రతను పెంచారు' అని అనురాగ్ ఠాకూర్ తెలిపారు.

ఆర్​కేఎస్ భదౌరియాను బీజేపీలోకి చేరినందుకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే అభినందించారు.' భదౌరియా భారత వైమానిక దళానికి సుదీర్ఘ కాలం పాటు అంకితభావంతో సేవలందించారు. భారత రక్షణ దళాలలో కీలక పాత్ర పోషించారు. అలాగే రాజకీయాల్లోనూ రాణిస్తారు. అని వినోద్​ తావ్డే ఆశాభావం వ్యక్తం చేశారు.

లోక్‌సభ ఎన్నికల బరిలో భదౌరియా?
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన భదౌరియాకు ఘాజియాబాద్ లోక్‌సభ టికెట్‌ ఇచ్చే అవకాశముందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటివరకు విడుదల చేసిన నాలుగు అభ్యర్థుల జాబితాల్లో ఘజియాబాద్ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం ఈ స్థానంలో జనరల్ వీకే సింగ్ లోక్ సభ ఎంపీగా ఉన్నారు.

భదౌరియా కేరీర్
ఫ్రాన్స్ నుంచి రాఫెల్ యుద్ధ విమానాలను కొనే డీల్‌ను ఖరారు చేయడంలో భదౌరియా కీలక పాత్ర పోషించారు. రాఫెల్ ఫైటర్ జెట్స్‌తో ముడిపడిన సాంకేతిక అంశాలపై భారత ప్రభుత్వానికి గైడెన్స్ ఇచ్చింది ఆయనే. 2019 సెప్టెంబరు నుంచి 2021 సెప్టెంబరు వరకు ఎయిర్ ఫోర్స్ చీఫ్‌గా వ్యవహరించారు. అంతకంటే ముందు వాయుసేనలో వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్‌గా సేవలందించారు. 26 విభిన్న రకాల యుద్ధ విమానాలను నడిపిన ఘనత ఆయన సొంతం. దాదాపు 4,250 గంటల పాటు యుద్ధవిమానాలు, సైనిక విమానాల్లో గడిపిన రికార్డు భదౌరియాకు ఉంది. మొత్తం 36 సంవత్సరాల కెరీర్‌లో భదౌరియాకు అనేక పతకాలు లభించాయి. ఈ జాబితాలో 'అతి విశిష్ట సేవా పతకం', 'వాయు సేన పతకం', 'పరమ విశిష్ట సేవా పతకం' ఉన్నాయి. 2019 జనవరిలో భారత రాష్ట్రపతికి గౌరవ సహాయకుడు 'డి కాంపే'గానూ ఆయన నియమితులయ్యారు.

కన్నడ నాట 'నారీ' ఎన్నికల స్వారీ- రాష్ట్ర చరిత్రలో తొలిసారి- విజయం ఎవరిదో? - Woman Candiadates MP In Karnataka

కేజ్రీవాల్‌ జైలు నుంచే పాలన సాగిస్తారా? అందుకు రాజ్యాంగం అనుమతిస్తుందా? - Can Kejriwal Rule From Jail

Last Updated : Mar 24, 2024, 2:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.