ETV Bharat / bharat

హత్య కేసులో A1గా పవిత్ర, A2గా దర్శన్​- ఫ్రెండ్ వద్ద రూ.40లక్షలు అప్పు తీసుకుని మరీ! - Darshan Case Latest Update - DARSHAN CASE LATEST UPDATE

Renuka Swamy Murder Case : రేణుకాస్వామిని హత్య చేసిన తర్వాత దర్శన్‌ తన సన్నిహితులకు ఫోన్ చేసినట్లు పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. చట్టపరమైన ఇబ్బందులను తొలగించేందుకు, సాక్ష్యాలను మాయం చేసేందుకు, వీలుగా తన స్నేహితుడి దగ్గర నుంచి 40 లక్షల రూపాయలు తీసుకోగా వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ హత్య కేసులో పవిత్ర గౌడను ఏ1గా, దర్శన్‌ను ఏ2గా పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు.

DARSHAN CASE LATEST UPDATE
DARSHAN CASE LATEST UPDATE (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 21, 2024, 7:07 PM IST

Renuka Swamy Murder Case : రేణుకాస్వామిని హత్య చేసిన అనంతరం హడావుడిగా ఆధారాలను మాయం చేసేందుకు సినీనటుడు దర్శన్‌ తీవ్రంగా యత్నించినట్లు తేలింది. ఈ క్రమంలో అతడు తన స్నేహితుడి వద్ద 40 లక్షల రూపాయలు అప్పు చేసినట్లు పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. దర్శన్‌తో పాటు మరో ముగ్గురు నిందితులను తమ కస్టడీకి అప్పగించాలని కోరారు. పవిత్ర గౌడతో పాటు మిగతా నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి పంపించాలని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

పవిత్ర గౌడ ప్రధాన కారణం!
దర్శన్‌తో పాటు ధన్‌రాజ్‌, వినయ్‌, ప్రదోష్‌ విచారణకు సహకరించలేదని, వాస్తవాలను దాచేందుకు యత్నించారని పోలీసులు తెలిపారు. రేణుకాస్వామి హత్యకు పవిత్ర గౌడ ప్రధాన కారణమని పోలీసులు గుర్తించారు. ఆమే ఇతర నిందితులను ప్రేరేపించి, వారితో కుట్ర చేసి, నేరంలో పాల్గొన్నట్లు తేల్చారు. రేణుకాస్వామి హత్యలో దర్శన్‌ స్వయంగా పాల్గొని, ఆధారాలను ధ్వంసం చేసేందుకు యత్నించి చట్టాన్ని అతిక్రమించాడని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.

ఎలక్ట్రిక్ షాక్ టార్చ్‌ను ఉపయోగించి!
రేణుకాస్వామి హత్య కేసులో ఏ9గా ఉన్న ధన్‌రాజ్‌ పోలీసులకు స్వచ్ఛందంగా ఇచ్చిన వాంగ్మూలంలో పలు విషయాలను వెల్లడించాడు. బాధితుడిపై దాడి చేసి, కరెంట్ షాక్ ఇచ్చేందుకు ఎలక్ట్రిక్ షాక్ టార్చ్‌ను ఉపయోగించినట్లు తెలిపాడు. అయితే ఆ పరికరాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో మాత్రం వెల్లడించలేదని, ఆ విషయాన్ని తెలుసుకునేందుకు కస్టడీకి అప్పగించాలని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. హత్య అనంతరం దర్శన్‌ అనేక మందిని సంప్రదించాడని పోలీసులు తెలిపారు.

రూ.40 లక్షలు తీసుకుని మరీ!
దీని వెనుక ఉన్న ఉద్దేశాన్ని, కారణాలను తెలుసుకునేందుకు అతడిని విచారించాల్సి ఉందన్నారు. ఈ కేసులో జోక్యం చేసుకోవడానికి కొందరు పెద్దలు ప్రయత్నించగా పోలీసులు అడ్డు చెప్పినట్లు సమాచారం. చట్టం నుంచి తప్పించుకోవడానికి, సాక్ష్యాలను మాయం చేయడానికి తన స్నేహితుడు మోహన్ రాజా నుంచి రూ.40 లక్షలు తీసుకున్నట్లు దర్శన్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడని తెలిసింది. దర్శన్ నివాసంలో రూ.37.4 లక్షలు, భార్య విజయలక్ష్మి దగ్గర నుంచి రూ.3 లక్షలను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

అతడిదే కీలక పాత్ర
ఆధారాల ధ్వంసంలో ప్రదోష్‌ కీలక పాత్ర పోషించాడని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. విచారణకు అతడు సహకరించడం లేదని తెలిపారు. హత్య జరిగిన స్థలానికి ప్రదోష్ వేరే వ్యక్తిని తీసుకొని వెళ్లాడన్న పోలీసులు, అతడి గురించి చెప్పడం లేదని అన్నారు. రేణుకాస్వామితో పాటు కేసులో ఏ4గా ఉన్న రాఘవేంద్ర సెల్‌ఫోన్‌లను ప్రదోష్‌ కాలువలో పడేశాడని తెలిపారు. వాటిని సేకరించేందుకు ప్రయత్నించినా ఆచూకీ లభించలేదన్నారు.

సీసీటీవీ దృశ్యాల సేకరణ!
చిత్రదుర్గలో నిందితుడు రాఘవేంద్ర నివాసంలో 4 లక్షల 40 వేల రూపాయలను స్వాధీనం చేసుకన్నామని వెల్లడించారు పోలీసులు. అక్కడే రేణుకాస్వామికి చెందిన బంగారు ఉంగరం, చైన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. రేణుకాస్వామి తల్లి కూడా వాటిని గుర్తు పట్టిందని వివరించారు. మరోవైపు, రేణుకాస్వామి హత్య జరిగిన సమయంలో దర్శన్‌ ఘటనా స్థలంలోనే ఉన్నాడనేందుకు అవసరమైన సాక్ష్యాధారాలతో పాటు సీసీటీవీ దృశ్యాలను దర్యాప్తు బృందం సేకరించినట్లు తెలిసింది. లాఠీ, కర్రలు, వాటర్ బాటిల్‌, రక్తపు మరకలతో ఇతర ఆధారాలను పోలీసులు ఇప్పటికే సేకరించారు.

'మృతదేహాన్ని మాయం చేసేందుకు రూ.30 లక్షలు ఇచ్చా'- నేరం అంగీకరించిన దర్శన్! - Darshan Renuka Swamy

రేణుకస్వామికి కరెంట్ షాక్‌ ఇచ్చి చిత్రహింస!- దర్శన్ కేసులో విస్తుపోయే విషయాలు- సెల్​ఫోన్​ కోసం గాలింపు చర్యలు - Darshan Case

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.