Ram Mandir Crowd Today : అయోధ్య రామయ్య దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. మంగళవారం అర్ధరాత్రి నుంచే భక్తులు రామ్‌లల్లా దర్శనం కోసం క్యూ కట్టారు. అలా మంగళవారం మధ్యాహ్ననానికి వేలాది భక్తులు రామాలయ ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో రామాలయం రోడ్లన్ని భక్తులతో నిండిపోయాయి. దీంతో భక్తులను అదుపు చేసేందుకు భద్రతా సిబ్బంది తీవ్ర అవస్థలు పడ్డారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రామమందిరం వెలుపల మరింత భద్రతను పెంచారు అధికారులు.
'జై శ్రీరామ్' నినాదాలు చేస్తూ ఆలయ గేటు దాటేందుకు ప్రయత్నించిన భక్తులను అడ్డుకున్నారు అధికారులు. అప్పుడు ఆలయ ప్రధాన ద్వారం వద్ద స్వల్ప తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో ఒక భక్తుడు స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే అతడిని భద్రతా సిబ్బంది అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.
-
VIDEO | Injured devotees being taken to hospital in an ambulance from outside the Ram Temple in Ayodhya. pic.twitter.com/UZnMd4VnmB
— Press Trust of India (@PTI_News) January 23, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">VIDEO | Injured devotees being taken to hospital in an ambulance from outside the Ram Temple in Ayodhya. pic.twitter.com/UZnMd4VnmB
— Press Trust of India (@PTI_News) January 23, 2024VIDEO | Injured devotees being taken to hospital in an ambulance from outside the Ram Temple in Ayodhya. pic.twitter.com/UZnMd4VnmB
— Press Trust of India (@PTI_News) January 23, 2024
-
#WATCH | Uttar Pradesh: People break through security at Shri Ram Janmabhoomi Temple in Ayodhya.
— ANI (@ANI) January 23, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
The Pran Pratishtha ceremony was done yesterday at Shri Ram Janmabhoomi Temple. pic.twitter.com/vYEANsXQkP
">#WATCH | Uttar Pradesh: People break through security at Shri Ram Janmabhoomi Temple in Ayodhya.
— ANI (@ANI) January 23, 2024
The Pran Pratishtha ceremony was done yesterday at Shri Ram Janmabhoomi Temple. pic.twitter.com/vYEANsXQkP#WATCH | Uttar Pradesh: People break through security at Shri Ram Janmabhoomi Temple in Ayodhya.
— ANI (@ANI) January 23, 2024
The Pran Pratishtha ceremony was done yesterday at Shri Ram Janmabhoomi Temple. pic.twitter.com/vYEANsXQkP
కాగా మంగళవారం మధ్యాహ్నం వరకు అయోధ్య రామయ్యను దాదాపు రెండు లక్షలు మంది దర్శించుకున్నారని ఓ అధికారి చెప్పారు. దర్శన సమయం పూర్తయ్యే సరికి మొత్తం 5లక్షల మంది దర్శించుకుంటారని అంచనా వేసినట్లు తెలిపారు. వేలాది మంది భక్తులు ఇంకా క్యూ లో వేచి ఉన్నారని చెప్పారు. భక్తులకు నిరంతర దర్శనం కల్పించేందుకు స్థానిక యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోందని అన్నారు.
మరోవైపు, అయోధ్య రామయ్య దర్శనం పూర్తిచేసుకున్న పంజాబ్‌కు చెందిన మనీశ్ వర్మ అనే భక్తుడు ఆనందం వ్యక్తం చేశాడు. 'చాలా ఆనందంగా ఉంది. నా జీవిత లక్ష్యం నెరవేరింది. మా పూర్వీకులు అయోధ్యలో రామాలయ నిర్మాణ కోసం చాలా కష్టపడ్డారు.' అని తెలిపారు. రామ్‌లల్లా దర్శనం అయ్యిన తర్వాతే ఇంటికి తిరిగి వెళ్తానని రాజస్థాన్‌కు చెందిన అనురాగ్ శర్మ తెలిపారు.
బిహార్‌లోని మాధేపురా జిల్లాకు చెందిన నితీశ్ కుమార్ 600 కిలోమీటర్లకు పైగా సైకిల్‌పై ప్రయాణించి అయోధ్య చేరుకున్నారు. 'ఎక్కువ రద్దీ ఉంది. కానీ ఈ రోజు నాకు రామయ్య దర్శనం జరుగుతుందని ఆశిస్తున్నా. రాముడి దర్శనం అయ్యాక తిరిగి ప్రయాణం ప్రారంభిస్తా.' అని నితీశ్ కుమార్ అన్నారు.
'బస్సులు నిలిపివేయాలని కలెక్టర్ ఆదేశాలు'
రామాలయం వద్ద భక్తుల తాకిడి పెరగడం వల్ల అయోధ్య కలెక్టర్ నీతీశ్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు గంటలపాటు బస్సులను అయోధ్య వైపు పంపవద్దని రవాణా శాఖను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో రవాణా శాఖ అప్రమత్తమైంది. లఖ్‌నవూ, ఇతర జిల్లాల నుంచి అయోధ్యకు బస్సులను నడపడం నిలిపివేసింది. అయోధ్య వద్ద గుమిగూడిన భక్తులను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు 100 ఖాళీ బస్సులు అయోధ్యకు పంపించింది. మరోవైపు, అయోధ్యకు భక్తుల తాకిడి పెరగిన నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆలయ పరిసరాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు.
-
#WATCH | Uttar Pradesh Chief Minister Yogi Adityanath conducts an aerial survey of the Shri Ram Janmabhoomi Temple premises in Ayodhya as devotees continue to arrive here for the darshan of Ram Lalla. pic.twitter.com/IlhWppFo3g
— ANI (@ANI) January 23, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Uttar Pradesh Chief Minister Yogi Adityanath conducts an aerial survey of the Shri Ram Janmabhoomi Temple premises in Ayodhya as devotees continue to arrive here for the darshan of Ram Lalla. pic.twitter.com/IlhWppFo3g
— ANI (@ANI) January 23, 2024#WATCH | Uttar Pradesh Chief Minister Yogi Adityanath conducts an aerial survey of the Shri Ram Janmabhoomi Temple premises in Ayodhya as devotees continue to arrive here for the darshan of Ram Lalla. pic.twitter.com/IlhWppFo3g
— ANI (@ANI) January 23, 2024
అయోధ్య రాముడికి కొత్త పేరు- ఇకపై ఏమని పిలుస్తారంటే?
అయోధ్య రామయ్యకు వెల్లువెత్తిన విరాళాలు- 101 కిలోల బంగారం కానుకగా ఇచ్చిన భక్తుడు