ETV Bharat / bharat

బాలక్​రామ్​ దర్శనానికి పోటెత్తిన భక్తులు- మధ్యాహ్నానికే 3లక్షల మంది దర్శనం - అయోధ్యలో భక్తుల రద్దీ

Ram Mandir Crowd Today :ప్రాణప్రతిష్ఠ తర్వాత రెండో రోజు కూడా అయోధ్య బాలక్‌రామ్ దర్శనానికి భక్తులు భారీగా వచ్చారు. లక్షలాది భక్తులు అయోధ్య రామయ్యను దర్శనం చేసుకుని పులకించిపోయారు. చలి తీవ్రత అధికంగా ఉన్నా తెల్లవారుజాము నుంచే భక్తులు రాముడి దర్శనం కోసం కిలోమీటర్ల మేర బారులు తీరారు. మంగళవారం భవ్య రామమందిరం వద్ద స్వల్ప తోపులాట జరగడం వల్ల భారీ బందోబస్తు ఏర్పాటు చేసి భక్తులను దైవ దర్శనానికి అనుమతించారు. జై శ్రీరామ్‌ నినాదాలతో అయోధ్య ఆలయ పరిసరాలు మార్మోగాయి.

Ram Mandir Crowd Today
Ram Mandir Crowd Today
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 24, 2024, 7:04 PM IST

Ram Mandir Crowd Today : అయోధ్య బాలక్‌రామ్‌ దర్శనానికి రెండోరోజూ భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామునుంచే అయోధ్య ఆలయానికి చేరుకుని గంటల తరబడి క్యూలో నిల్చొని దైవ దర్శనం చేసుకున్నారు. విపరీతమైన చలిలోనూ భక్తులు రాత్రంతా ఆలయ పరిసరాల్లోనే ఉండి దర్శనం కోసం ఎదురు చూశారు. ప్రవేశ ద్వారం వెలుపల కిలోమీటరుకు పైగా భక్తుల క్యూలు కనిపించాయి. ఉదయం ఏడు గంటలకు ఆలయం తలుపులు తెరిచి పటిష్ఠ బందోబస్తు మధ్య భక్తులకు అయోధ్య రామయ్య దర్శన భాగ్యం కల్పించారు.

అయోధ్యలో భక్త జన సందోహం
బుధవారం మధ్యాహ్నం మూడు గంటల వరకు సుమారు మూడు లక్షల మంది భక్తులు స్వామి దర్శనం చేసుకున్నారని ఆలయ నిర్వాహకులు ప్రకటించారు. తొలిరోజు దాదాపు 5 లక్షల మంది భక్తులు ఆలయాన్ని దర్శించుకోగా రెండో రోజు మధ్యాహ్నం కల్లా మూడు లక్షల మంది బాలక్‌రామ్‌ దర్శనం చేసుకున్నారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఉత్తర్‌ప్రదేశ్‌ లా అండ్ ఆర్డర్ డీజీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. పటిష్టమైన క్యూ లైన్లను ఏర్పాటు చేసి భక్తులకు దర్శనం చేయిస్తున్నామని వెల్లడించారు. దర్శనం సజావుగా సాగుతోందని తెలిపారు. రద్దీ నియంత్రణ కోసం అయోధ్య ఆలయం వైపు నుంచి వెళ్లే బస్సులను నిలిపేశారు. సుల్తాన్‌పూర్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఆయోధ్య ఆలయ మార్గంలో బస్సులను రద్దు చేసినట్లు UPSRTC వెల్లడించింది.

రద్దీ నిర్వహణపై యూపీ సీఎం సమీక్ష
లక్షల్లో భక్తులు దర్శనానికి తరలివస్తున్నారు. దీంతో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. అయోధ్యలో రద్దీ నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించిన యోగి వీఐపీలు దర్శనానికి వస్తే ముందుగానే ఆలయ అధికారులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అయోధ్య ధామ్‌కు తరలివస్తున్నారని వీఐపీలు, ప్రముఖులు ఎవరైనా అయోధ్యకు రావాలనుకుంటే శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు కానీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి తెలపాలని యోగి విజ్ఞప్తి చేశారు. అయోధ్యకు తరలివస్తున్న భక్తులు బాలరాముని దర్శనం కోసం ఓపిక పట్టాలని కోరారు.

'పన్నుల రూపంలో రూ. 5 వేల కోట్లు'
మరోవైపు అయోధ్యలో బాల రాముడి కొలువుదీరడం వల్ల ఉత్తర్‌ప్రదేశ్‌కు భారీగా ఆదాయం సమకూరనుంది. బాలక్‌ రామ్‌ను దర్శించుకునేందుకు లక్షల్లో భక్తులు వస్తుండటం వల్ల పర్యటకంగా ఉత్తర్‌ప్రదేశ్ బాగా అభివృద్ధి చెందుతుందని SBI నివేదిక అంచనా వేసింది. యూపీకి ఏటా పన్నుల రూపంలో రూ.5 వేల కోట్ల ఆదాయం చేకూరనుందని పేర్కొంది. అయోధ్యలో రామ మందిరం ప్రారంభం కావడం వల్ల ఉత్తర్‌ప్రదేశ్‌కు భారీగా లబ్ధి చేకూరనుంది. "బాలక్ రామ్" విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అనంతరం అయోధ్యకు లక్షల్లో భక్తులు పోటెత్తడం వల్ల యూపీ సర్కార్ ఖజానాకు ఏటా పన్నుల రూపంలో వేల కోట్ల రూపాయల ఆదాయం రానుందని SBI అధ్యయనంలో తేలింది. రామ మందిరంతో పాటు ఇతర పర్యటక కేంద్రాల ద్వారా 2024-25లో ఉత్తర్‌ప్రదేశ్‌ రూ5వేల కోట్ల రూపాయల వరకు పన్నులు వసూలు చేయగలదని అంచనా వేసింది. అయోధ్య ఏటా దాదాపు 5 కోట్ల మంది భక్తులను ఆకర్షిస్తుందని ఇది యూపీలోనే కాకుండా భారత్‌లోనే ప్రధాన పర్యాటక కేంద్రంగా మారుతుందని SBI నివేదిక అంచనా వేసింది.

అత్యధిక భక్తులు సందర్శించే పుణ్యక్షేత్రాలివే
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి వెంకటేశ్వరస్వామి పుణ్య క్షేత్రాన్ని ఏటా 2.5 కోట్ల మంది భక్తులు సందర్శించుకుంటున్నారు. కానుకల రూపంలో 1,200 కోట్ల రూపాయల ఆదాయం తిరుపతికి వస్తోంది. జమ్మూకశ్మీర్‌లోని వైష్ణో దేవి ఆలయాన్ని ఏటా 80 లక్షల మంది సందర్శించుకుంటుండగా రూ. 500 కోట్ల మేర ఆదాయం లభిస్తోంది. ఉత్తర్‌ప్రదేశ్‌ ఆగ్రాలోని తాజ్ మహల్‌కు ప్రతి సంవత్సరం 70 లక్షల మంది సందర్శకులు వస్తుండగా రూ.100 కోట్ల ఆదాయం చేకూరుతోంది. స్విట్జర్లాండ్, ఇటలీ, ఫ్రాన్స్, అమెరికా, యూఏఈ వంటి దేశాలు టూరిజం ఆధారంగా సాటిలేని ఆర్థికాభివృద్ధిని సాధించాయని పలువురు ఆర్థిక నిపుణులు పేర్కొన్నారు. అయోధ్యలో ఆలయ ప్రారంభోత్సవంతో భారత్ ఈ దేశాల సరసన చేరేందుకు సిద్ధంగా ఉందని అంచనా వేస్తున్నారు.

అయోధ్య రామయ్యను దర్శించుకున్న హనుమంతుడు! గర్భగుడిలో ఆసక్తికర ఘటన

అయోధ్య రామయ్యకు వెల్లువెత్తిన విరాళాలు- 101 కిలోల బంగారం కానుకగా ఇచ్చిన భక్తుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.