Rahul Gandhi Loksabha 2024 : లోక్‌సభ స్పీకర్ అంశంలో అధికార, ప్రతిపక్షాల మధ్య వివాదం తలెత్తి సభాపతి ఎన్నిక అనివార్యమైన నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించేందుకుాఆయనే ముందుకొచ్చారు.
ఇటీవల దిల్లీలో నిర్వహించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పార్టీ అధిష్ఠానం ఇప్పటికే ఆయన్ను లోక్‌సభ ప్రతిపక్ష నేతగా ఎంపిక చేసినప్పటికీ, రాహుల్ తన నిర్ణయాన్ని పెండింగ్‌లో ఉంచారు.
18వ లోక్‌సభకు సంబంధించి స్పీకర్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రతిపక్ష కూటమినంతా ఏకతాటిపైకి తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో ప్రతిపక్ష నేత బాధ్యతలను రాహుల్ స్వీకరించారు. ఈ మేరకు మంగళవారం రాత్రి జరిగిన ప్రతిపక్ష పార్టీల భేటీలో నాయకుల అభిప్రాయం మేరకు తన నిర్ణయాన్ని తెలియజేశారు. ఇందులో భాగంగా ప్రొటెం స్పీకర్‌కు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) నేత సోనియా గాంధీ లేఖ ద్వారా ఆయన సమచారం పంపారు. దీంతో గత పదేళ్ల కాలంలో తొలిసారిగా లోక్‌సభలో ప్రతిపక్షనేత ఉన్నట్లు అయ్యింది.
మరోవైపు డిప్యూటీ స్పీకర్ పొజిషన్‌ను ప్రతిపక్షానికి కేటాయించాలన్న డిమాండ్‌కు అధికార ఎన్డీఏ తల వంచకపోవడం వల్ల స్పీకర్ పదవికి ప్రతిపక్షం తరఫున కాంగ్రెస్ ఎంపీ కె. సురేశ్‌ను బరిలోకి దించింది. దీంతో బుధవారం స్పీకర్ ఎన్నిక నిర్వహించే అవకాశముంది.
ఇదిలా ఉండగా, మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు నామినేషన్ ఉపసంహరణకు గడవు ఉంది. అంతలోపు విపక్షాలు వెనక్కి తగ్గకుంటే జూన్ 26న ఉదయం 11 గంటలకు స్పీకర్ పదవికి ఎన్నికను నిర్వహిస్తారు.
రాహుల్ గాంధీ ఇప్పటి వరకు ఐదుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం రాయ్‌బరేలీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వయనాడ్ నుంచి కూడా గెలుపొందినప్పటికీ, ఇటీవల ఆ స్థానానికి రాజీనామా చేశారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఆయన సోదరి ప్రియాంక గాంధీ ఆ స్థానం నుంచి బరిలోకి దిగనున్నారు. మరోవైపు డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షానికి కేటాయించాలన్న డిమాండ్‌కు అధికార ఎన్డీయే అంగీకరించకపోవడం వల్ల స్పీకర్ పదవికి ప్రతిపక్షం తరఫున కాంగ్రెస్ ఎంపీ కె సురేశ్‌ను బరిలోకి దించింది. బుధవారం స్పీకర్ ఎన్నిక జరగనుంది.