ETV Bharat / bharat

యూపీని వణికిస్తున్న తోడేళ్ల దాడులు- రెేబిస్ వ్యాధే కారణమా? - Wolf Attacks - WOLF ATTACKS

Wolf Attacks : ఉత్తర్​ప్రదేశ్​లో తోడేళ్ల దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాటిలో వచ్చిన మార్పుల వల్లే ఈ దాడులకు పాల్పడుతున్నాయని ఇంటర్నేషనల్‌ బిగ్‌ క్యాట్ అలయన్స్‌ చీఫ్‌ ఎస్పీ యాదవ్‌ తెలిపారు. రేబిస్‌ లేదా కెనైన్‌ డిస్టెంపర్‌ వైరస్‌ సోకడం వల్లే అవి ఇలా ప్రవర్తిస్తున్నాయని చెప్పారు.

Wolf Attacks
Wolf Attacks (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 10, 2024, 10:21 PM IST

Wolf Attacks : ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహరయిచ్‌ జిల్లాలో తోడేళ్ల దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. సుమారు 50 గ్రామాల ప్రజలకు అవి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అయితే తోడేళ్లు ఈ విధంగా వరుస దాడులకు పాల్పడటం అసాధారణ విషయమని 'ఇంటర్నేషనల్‌ బిగ్‌ క్యాట్ అలయన్స్‌' చీఫ్‌ ఎస్పీ యాదవ్‌ పేర్కొన్నారు. బహుశా రేబిస్‌ బారినపడటం లేదా వాటికి 'కెనైన్‌ డిస్టెంపర్‌ వైరస్‌' సోకడమే దీనికి కారణమై ఉండొచ్చని పీటీఐ వార్తాసంస్థకు తెలిపారు.

''తోడేళ్ల వరుస దాడులు అసాధారణ విషయం. గత పదిసంవత్సరాల్లో ఈ తరహా ఘటన ఇదే మొదటిది కావచ్చు. ఆ జంతువుల్లో దేనికైనా రేబిస్‌ వ్యాధి సోకి ఉండొచ్చు. దాన్ని గుర్తించేందుకు అటవీ శాఖ సర్వే చేస్తుంది. అయితే, జంతువుల నమూనాల సమగ్ర విశ్లేషణ ద్వారా మాత్రమే కచ్చితమైన కారణాలను గుర్తించవచ్చు. రేబిస్, కెనైన్ డిస్టెంపర్ వైరస్‌లు కొన్నిసార్లు పులుల వంటివాటి ప్రవర్తనను మార్చగలవు. తద్వారా అవి మనుషులంటే భయాన్ని కోల్పోతాయి. తోడేళ్ల దాడులకు ఇది కూడా ఓ కారణమై ఉండొచ్చు'' అని ఎస్పీ యాదవ్‌ చెప్పారు.

ఇటీవలి కాలంలో తోడేళ్లు దాడులు చేసిన ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆరు తోడేళ్లతో కూడిన గుంపు సంచరిస్తోందని అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు ఐదింటిని బంధించారు. 'ఆపరేషన్ భేడియా' కింద మంగళవారమే ఐదో జంతువు చిక్కిన విషయం తెలిసిందే. వాటిని పట్టుకునేందుకుగాను అటవీశాఖ 165 మంది సిబ్బందిని, 18 మంది షూటర్‌లను మోహరించింది. థర్మల్ కెమెరాలతో కూడిన డ్రోన్‌లను వాడుతుంది.

మధ్యప్రదేశ్​లో నక్కల దాడి
మధ్యప్రదేశ్‌లోని సీహోర్ జిల్లాలో ఇద్దరు వ్యక్తులపై నక్క దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రెహ్తీ ప్రాంతంలో ఓ నక్క ఒక్కసారిగా వచ్చి రోడ్డు పక్కన కూర్చున్న ఇద్దరు వ్యక్తులపై దాడి చేసింది. దాని నుంచి తప్పించుకోవడానికి వారు ప్రయత్నించినప్పటికీ తీవ్రంగా గాయపరిచింది. బాధితులలో ఓ వ్యక్తి ఆ నక్కను పట్టుకొని దూరంగా విసిరివేయడంతో అది అక్కడి నుంచి పారిపోయింది. గాయపడిన ఇద్దరు వ్యక్తులను స్థానికులు జిల్లా ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ఘటన అంతా అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యింది. మరో ఘటనలో సల్కాన్‌పుర్‌లో ఐదుగురిపై నక్క దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు.

8 మందిని చంపిన తోడేళ్ల కోసం వేట- ఎట్టకేలకు 'ఆపరేషన్‌ భేడియా'లో పురోగతి! - Wolf Attack In Uttar Pradesh

'కిల్లర్' తోడేళ్ల పనిబట్టేందుకు సూపర్ ప్లాన్- ఆ బొమ్మలు, చిన్నారుల మూత్రంతో ఎర! - Wolf Attack In Uttar Pradesh

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.