ETV Bharat / bharat

పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే పదేళ్ల జైలు శిక్ష- పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం - Public Examinations Bill 2024

Public Examinations Bill 2024 : పోటీ పరీక్షల్లో అక్రమాలను అడ్డుకునేందుకు ఉద్దేశించిన 'పబ్లిక్ ఎగ్జామినేషన్స్​ (ప్రివెన్షన్ ఆఫ్ అన్​ఫెయిర్ మీన్స్) బిల్లు, 2024'కు శుక్రవారం పార్లమెంట్ ఆమోదముద్ర వేసింది.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 9, 2024, 7:30 PM IST

Updated : Feb 9, 2024, 8:57 PM IST

Public Examinations Bill 2024 : కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్వహించే పోటీ పరీక్షల్లో అక్రమాలను అడ్డుకునేందుకు వీలుగా తీసుకొచ్చిన 'పబ్లిక్ ఎగ్జామినేషన్స్​ (ప్రివెన్షన్ ఆఫ్ అన్​ఫెయిర్ మీన్స్) బిల్లు, 2024'ను శుక్రవారం పార్లమెంట్ ఆమోదించింది. సోమవారం లోక్​సభ ఆమోదించిన ఈ బిల్లును శుక్రవారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలు తిరస్కరించి ఓటింగ్​ నిర్వహించగా, మోజారిటీ సభ్యులు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో ఈ బిల్లుకు రాజ్యసభ ఆమోదం లభించింది.

ఈ బిల్లుపై జరిగిన చర్చకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సమాధానమిచ్చారు. 'దేశంలోని కీలకమైన యువశక్తి, కొంతమంది చేతుల్లో లొంగిపోవడాన్ని మేము అనుమతించలేం. అందుకే చాలా జాగ్రత్తగా మేము విద్యార్థులను, నిజాయితీ గల ఉద్యోగార్థులను ఈ చట్ట పరిధి నుంచి మినహాయించాం. కాబట్టి ఈ కొత్త చట్టం యువతను వేధించడానికి ఉద్దేశింది కాదు. ఎవరైతే వారి భవిష్యత్తు, తద్వారా దేశ భవిష్యత్తుతో ఆడుకుంటున్నారో వారిని అడ్డుకోవడానికి మాత్రమే ఈ చట్టం తెచ్చాం' అని జితేంద్ర సింగ్ తెలిపారు.

చట్టం అమలైతే ఏం జరుగుతుంది?
ఈ చట్టం అమల్లోకి వస్తే పోటీ పరీక్షల్లో పేపరు లీకేజీకి పాల్పడినా, మాల్‌ ప్రాక్టీస్‌ చేసినా, నకిలీ వెబ్‌సైట్లను సృష్టించినా కనిష్ఠంగా మూడేళ్ల నుంచి గరిష్ఠంగా ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తారు. అంతేకాకుండా రూ.కోటి వరకు జరిమానా కూడా పడుతుంది. ఈ చట్టం వ్యవస్థీకృత ముఠాలు, మాఫియాపై ఉక్కుపాదం మోపుతుంది. వారితో చేతులు కలిపిన ప్రభుత్వ అధికారులపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC), స్టాఫ్​ సెలెక్షన్ కమిషన్ (SSC), రైల్వే రిక్రూట్​మెంట్ బోర్డ్ (RRB), ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ బ్యాంకింగ్ పర్సనల్ (IBPS), నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వంటి సంస్థలు నిర్వహించే పోటీ పరీక్షలు ఈ చట్టం పరిధిలోకి వస్తాయి.

ఈ నేరాలకు పాల్పడితే, శిక్షలు తప్పవు!

  • ప్రశ్న పత్రాలు, సమాధాన పత్రాల లీకేజీలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాలుపంచుకోవడం
  • అభ్యర్థులకు నేరుగా గానీ, ఇతర మార్గాల ద్వారా గానీ సహకరించడం
  • కంప్యూటర్‌ నెట్‌వర్క్‌ను ట్యాంపరింగ్‌ చేయడం
  • నియామక సంస్థల పేరుతో నకిలీ వెబ్‌సైట్లను సృష్టించడం
  • నకిలీ పరీక్షలను నిర్వహించడం
  • నకిలీ అడ్మిట్‌ కార్డులను జారీ చేయడం
  • నకిలీ నియామక పత్రాలను ఇవ్వడం శిక్షార్హం.

పరీక్షల సమయంలో అనుకూలురకు సీట్లను మార్చడం పరీక్ష తేదీలను, షిఫ్టులను అనుకూలంగా మార్చడం సైతం శిక్షార్హమే.

Last Updated : Feb 9, 2024, 8:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.