ETV Bharat / bharat

గర్భిణీ దారుణ హత్య- 20ముక్కలు చేసి రోడ్డు పక్కన వేసిన దుండగులు! - Pregnant Girl Murdered In UP

Pregnant Murdered In Uttar Pradesh : ఓ గర్భిణీ మృతదేహాన్ని 20 ముక్కలుగా చేసి రెండు సంచుల్లో పెట్టి బైపాస్ రోడ్డు సమీపంలో పడేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ అమానవీయ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. ఝార్ఖండ్​లోన జరిగిన మరో ఘటనలో ప్రియురాలితో పాటు ఆమె తల్లిపైనా పెట్రోల్​ పోసి నిప్పంటించాడు ఆమె ప్రియుడు.

Pregnant Girl Murdered In Uttar Pradesh
Pregnant Girl Murdered In Uttar Pradesh
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 27, 2024, 8:40 PM IST

Pregnant Murdered In Uttar Pradesh : గర్భిణీ మృతదేహాన్ని 20 ముక్కలుగా చేసి రోడ్డుపక్కన ఉన్న పొదల్లో పడేశారు దుండగులు. ఈ దారుణం ఉత్తర్​ప్రదేశ్​లోని అమ్​రోహలో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు.

ఇదీ జరిగింది
ఖేతాపుర్ ధనౌరా బైపాస్ సమీపంలో స్థానికులకు రోడ్డుపక్కన రెండు సంచులు కనిపించాయి. అనుమానం వచ్చి వాటిని చూడగా యువతి శరీర భాగాలు ఉన్నాయి. దీంతో వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు స్థానికులు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బ్యాగులను పరిశీలించగా మృతురాలు గర్భవతి అని తేలింది. ఒక బ్యాగ్​లో తల నుంచి నడుము వరకు, రెండో బ్యాగ్​లో నడుము నుంచి పాదాల వరకు శరీర భాగాలు ఉన్నాయి. ఆమె వయసు 23 నుంచి 24 ఏళ్ల మధ్యలో ఉంటుందని గుర్తించారు.

శరీర భాగాలను అనేక ముక్కలుగా నరికి
బాధితురాలి రెండు చేతులను నిందితులు అత్యంత దారుణంగా నరికినట్లు పోలీసులు గుర్తించారు. బాధితురాలి నడుము కింది భాగాన్ని పదునైన ఆయుధంతో ముక్కలుగా చేసినట్లు తెలిపారు. 'బాధితురాలి మృతదేహాన్ని 20 ముక్కలుగా చేసి రోడ్డు పక్కన రెండు సంచుల్లో విసిరేసినట్లుగా గుర్తించాం. యువతి ఎవరనే వివరాలు తెలియరాలేదు. కేసు దర్యాప్తు చేపట్టాం. నిందితుల కోసం అన్ని ప్రాంతాల్లోనూ గాలిస్తున్నాం' అని సర్కిల్ ఆఫీసర్ అంజలి కటారియా తెలిపారు.

ప్రియురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియుడు
తన ఇంటికి వచ్చేందుకు నిరాకరించిన ప్రియురాలితో పాటు ఆమె తల్లిపైనా పెట్రోల్​ పోసి నిప్పంటించాడు ఆమె ప్రియుడు. ప్రస్తుతం వారిద్దరూ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. ఈ ఘటన ఝార్ఖండ్​లోని దుమ్కాలో జరిగింది.

దుమ్కా ప్రాంతంలోని సునిరామ్ కిస్కు అనే వ్యక్తి గత కొంత కాలంగా ఓ యువతితో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు. అయితే ప్రియురాలిని తన ఇంటికి రావాల్సిందిగా కోరాడు. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహానికి గురైన నిందితుడు ఆమె ఇంట్లోకి వెళ్లి నిద్రపోతున్న బాధితురాలు, ఆమె తల్లిపై పెట్రోల్​ పోసి నిప్పంటించి పారిపోయాడు. వీరిని గమనించిన స్థానికులు, బాధితురాలు, ఆమె తల్లిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.

బామ్మకు పాముకాటు వేయించి హత్య- రూ.కోటి బీమా సొమ్ము కోసం మనవడి దారుణం- చివరకు!

పగ తీర్చుకునేందుకు 9ఏళ్ల బాలుడి హత్య- వేధింపులు తాళలేక విద్యార్థిని ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.