ETV Bharat / bharat

ప్రజ్వల్​ రేవణ్ణపై బ్లూ కార్నర్ నోటీస్​- రేవణ్ణకు 4రోజుల సిట్ కస్టడీ - prajwal revanna sex scandal - PRAJWAL REVANNA SEX SCANDAL

Prajwal Revanna Sex Scandal : సెక్స్ కుంభకోణం ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన్‌ MP ప్రజ్వల్‌ రేవణ్ణపై బ్లూ కార్నర్​ నోటీసు జారీ అయ్యింది. ఈ విషయాన్ని కర్ణాటక హోంమంత్రి డాక్టర్​ జీ పరమేశ్వర ఆదివారం వెల్లడించారు.

prajwal revanna sex scandal
prajwal revanna sex scandal (ETV BHARAT)
author img

By ETV Bharat Telugu Team

Published : May 5, 2024, 6:00 PM IST

Updated : May 5, 2024, 8:48 PM IST

Prajwal Revanna Sex Scandal : హాసన్​ సెక్స్​ రాకెట్​లో ఆరోపణలు ఎదుర్కొంటూ విదేశాలకు పారిపోయిన ఎంపీ ప్రజ్వల్​ రేవణ్ణపై బ్లూ కార్నర్​ నోటీసు జారీ అయ్యింది. ఈ విషయాన్ని కర్ణాటక హోంమంత్రి డాక్టర్​ జీ పరమేశ్వర ఆదివారం వెల్లడించారు. ఆయనను తిరిగి భారత్​కు రప్పించేందుకు ఇంటర్​పోల్​ అధికారుల సాయం తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. ప్రపంచంలోని అన్ని దేశాలకు ఇంటర్​ పోల్​ సమాచారం ఇచ్చి ఆయన్ను గుర్తిస్తుందని తెలిపారు. ప్రజ్వల్​ను తిరిగి రప్పించే విషయాన్ని సిట్​ చూసుకుంటుందని చెప్పారు. ప్రత్యేక దర్యాప్తు బృందం​ పనితీరును అభినందించిన పరమేశ్వర, సిట్ చట్ట ప్రకారం నడుచుకుంటుందన్నారు.
అంతర్జాతీయ పోలీసు సహకార సంస్థ నేరానికి సంబంధించిన నిందితుడి ఆచూకీ, వారి కార్యకలపాల అదనపు సమాచారాన్ని దాని సభ్య దేశాల నుంచి సేకరించేందుకు బ్లూకార్నర్‌ నోటీసును జారీ చేస్తుంది.

ఏ క్షణమైనా భారత్​కు వచ్చే ఛాన్స్​!
మరోవైపు ప్రజ్వల్​ రేవణ్ణ ఆదివారం భారత్​కు తిరిగి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బెంగళూరు, మంగళూరు, గోవాలో ఆయన దిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రజ్వల్​ రేవణ్ణ బాధితులు ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక హెల్ప్​ లైన్​ నంబర్లను ఏర్పాటు చేసింది సిట్​.

రేవణ్ణకు నాలుగు రోజుల సిట్ కస్టడీ
సిట్​ అదుపులో ఉన్న ప్రజ్వల్‌ తండ్రి, JDS ఎమ్మెల్యే HD రేవణ్ణను ఎసీఎమ్​ఎమ్​ కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు అధికారులు. అనంతరం నాలుగు రోజుల సిట్​ కస్టడీ విధించారు జడ్జి. అంతకుముందు ఆయన్ను వైద్య పరీక్షల కోసం బౌరింగ్​ అండ్​ లేడీ కర్జన్​ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి స్థానిక కోర్టుకు తరలించారు. ఈ సమయంలో మీడియాతో మాట్లాడిన రేవణ్ణ, ఇదంతా రాజకీయ కుట్రగా అభివర్ణించారు. తనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేకుండానే నిందితుడిని చేశారని తెలిపారు. శనివారం రాత్రి HD రేవణ్ణను సిట్ అధికారులు ఓ మహిళ కిడ్నాప్‌ కేసును ప్రాథమిక కారణంగా చూపి అరెస్ట్‌ చేశారు.

మోదీ, షాకు కాంగ్రెస్ 10​ ప్రశ్నలు
మరోవైపు ప్రజ్వల్​ రేవణ్ణ సెక్స్​ రాకెట్​పై కాంగ్రెస్​ తీవ్రంగా స్పందించింది. ఈ అంశంపై సమాధానం ఇవ్వాలంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్​ షాకు 10 ప్రశ్నలను సంధించింది. బీజేపీ కూటమిలో జేడీఎస్‌ ఉన్నందున వారిని రక్షించేందుకు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్​ ఆరోపించింది. ప్రజ్వల్‌కు సంబంధించిన సమాచారం ఉన్నప్పటికీ ఆ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారని బీజేపీని ప్రశ్నించింది. ప్రజ్వల్‌ దేశం విడిచి పారిపోకుండా విదేశాంగ శాఖ ఎందుకు అడ్డుకోలేక పోయిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఆ రాష్ట్ర ఇంఛార్జ్‌ రణ్‌దీప్‌ సుర్జేవాలా ప్రశ్నించారు. నిందితుడికి ఉన్న దౌత్య పాస్‌పోర్టును ఇంకా ఎందుకు రద్దు చేయలేదని, అతడిని స్వదేశానికి తీసుకు వచ్చేందుకు ఇంటర్‌పోల్‌ ద్వారా నోటీసులు ఎందుకు ఇవ్వలేదని అడిగారు.

సిట్ అదుపులో హెచ్​డీ రేవణ్ణ- ముందస్తు బెయిల్​ పిటిషిన్​ కొట్టేసిన కోర్టు - hasan sex scandal

'మహిళను కట్టేసి అత్యాచారం'- ప్రజ్వల్​ రేవణ్ణ సెక్స్​ రాకెట్​లో మరో ఫిర్యాదు - Prajwal Revanna Sex Scandal

Last Updated : May 5, 2024, 8:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.