PM Modi On China Relationship : భారత్-చైనా మధ్య స్థిరమైన, శాంతియుత సంబంధాలు రెండు ప్రాంతాలకు మాత్రమే కాదు, ప్రపంచ దేశాలకు అత్యంత కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సరిహద్దుల అంశంలో ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన దౌత్య, సైనిక స్థాయుల్లో సానుకూల, నిర్మాణాత్మక చర్చల ద్వారానే పరిష్కారం అవుతుందన్న ఆయన తన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు చేశారు.
'సూపర్ పవర్‌గా భారత్'
భారత్ ఎదుగుదలను ఎవరూ ఆపలేరని మోదీ అన్నారు. ఆర్థిక వ్యవస్థ దూసుకెళుతోందని, దౌత్యపరంగా, శాస్త్రీయంగా, సైనికశక్తిపరంగా ఎదుగుతున్న తీరు భారత్‌ను ఓ వర్ధమాన 'సూపర్ పవర్'గా నిలబెడుతోందని అన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికలు, క్వాడ్, రామమందిరం తదితర అంశాల గురించి కూడా ఆయన ఈ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
ఈ నేపథ్యంలో చైనాతో సంబంధాలు భారత్‌కు చాలా ముఖ్యమని నొక్కిచెప్పారు. 'ఇరు దేశాల మధ్య సరిహద్దుల విషయంలో దీర్ఘకాలంగా నెలకొన్న పరిస్థితి వేగంగా పరిష్కారం కావాలి. అదే జరిగితే మా ద్వైపాక్షిక సంబంధాల్లో నెలకొన్న అనిశ్చితి తొలగిపోతుంది' అని ప్రధాని పేర్కొన్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, భారత్‌లతో ఏర్పడిన క్వాడ్ కూటమి ఏ ఒక్క దేశానికీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. తమకు వ్యతిరేకంగా ఈ కూటమి ఏర్పడిందంటూ గతంలో చైనా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మోదీ ఇలా పేర్కొనడం గమనార్హం.
'రాముడు తన జన్మభూమి అయిన అయోధ్యకు తిరిగి రావడం దేశ ఐక్యతకు సంబంధించిన ఒక చారిత్రక ఘట్టమని' రామమందిరం ప్రారంభం గురించి మాట్లాడుతూ మోదీ పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిందని చెప్పారు. భారత్‌లో మూడోసారి తమ ప్రభుత్వ పాలన కోసం క్రేజ్ పెర్గుతోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
"ఎంతటి ఆదరణ ఉన్న ప్రభుత్వమైనా రెండో విడత పదవీకాలం ముగిసేలోపు మద్దతు కోల్పోతుంది. ప్రపంచవ్యాప్తంగా గత కొన్నేళ్లుగా ఇదే జరుగుతోంది. భారత్ ఇందుకు మినహాయింపు. మా ప్రభుత్వానికి రోజురోజుకు మరింత మద్దతు పెరుగుతోంది."
- నరేంద్ర మోదీ, భారత ప్రధాని
భారత్‌తో సత్సంబంధాలు- చైనా రియాక్షన్
China Reaction On Modi Latest Interview : మరోవైపు చైనాతో సంబంధాలు భారత్‌కు చాలా ముఖ్యమని ప్రధాని మోదీ అన్న వ్యాఖ్యలపై డ్రాగన్ దేశం స్పందించింది. చైనా-భారత్ మధ్య మంచి, స్థిరమైన సంబంధాలు రెండు దేశాల ప్రయోజనాలకు దోహదం చేస్తాయని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
'అవినీతిపై కాపీరైట్స్ వారికే'- డీఎంకే, కాంగ్రెస్‌పై మోదీ ఫైర్ - PM Narendra Modi Tamil Nadu Visit