ETV Bharat / bharat

'నా గొంతును డీప్​ఫేక్​తో అనుకరించారు, డిజిటల్ అంతరాన్ని అంగీకరించం'- బిల్​గేట్స్​తో మోదీ 'ఛాయ్​ పే చర్చా' - PM Modi Meeting With Bill Gates - PM MODI MEETING WITH BILL GATES

PM Modi Meeting With Bill Gates : ఆధునిక సాంకేతికత ప్రజలకు మధ్య డిజిటల్ అంతరాన్ని తాను అనుమతించనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తన గొంతును డీప్​​ఫేక్​తో అనుకరించారని ప్రధాని తెలిపారు. వ్యవసాయం, ఆరోగ్యం, విద్య రంగాలలో సాంకేతికత పెద్ద పాత్ర పోషిస్తుందని చెప్పారు. దిల్లీలోని తన అధికారిక నివాసంలో మైక్రోసాఫ్ట్​ వ్యవస్థాపకుడు బిల్​గేస్ట్​తో ఛాయ్​ పే చర్చాలో ముచ్చటించారు.

PM Modi Meeting With Bill Gates
PM Modi Meeting With Bill Gates
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 29, 2024, 10:37 AM IST

Updated : Mar 29, 2024, 11:48 AM IST

PM Modi Meeting With Bill Gates : తన గొంతును డీప్​​ఫేక్ టెక్నాలజీతో అనుకరించారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆధునిక సాంకేతికత, ప్రజల మధ్య డిజిటల్ విభజనను తాను అనుమతించనని ప్రధాని తెలిపారు. వ్యవసాయం, ఆరోగ్యం, విద్య రంగాలలో సాంకేతికత పెద్ద పాత్ర పోషిస్తుందని చెప్పారు. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్‌తో దిల్లీలోని తన అధికారిక నివాసంలో ప్రధాని చాయ్‌ పే చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్​, డిజిటల్ పేమెంట్స్, వాతావరణ మార్పులు వంటి అనేక అంశాలపై ఇరువురు చర్చించారు.

'డీప్‌ఫేక్‌తో నా గొంతునూ అనుకరించారు'
'సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి నేను ఇష్టపడతాను. అయితే ఇందులో నేను నిపుణుడిని కాదు. కాని కొత్త విషయాలను తెలుసుకోవడానికి చాలా ఉత్సుకతతో ఉంటా. మా అధ్యక్షతన జరిగిన జీ20 సదస్సులో ఏఐ టెక్నాలజీని వినియోగించుకున్నాం. ఏఐతో హిందీలో చేసిన నా ప్రసంగాన్ని తమిళంలోకి అనువదించాం. ఏఐ శక్తిమంతమైనదే. కానీ దాన్ని మ్యాజిక్‌ టూల్‌గా ఉపయోగిస్తే అది తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. తప్పుడు వ్యక్తుల చేతుల్లో పడితే వక్రమార్గంలో పయనిస్తుంది. డీప్‌ఫేక్‌తో నా గొంతును కూడా అనుకరించారు' అని మోదీ వెల్లడించారు.

మోదీ మాట్లాడిన దానికి బిల్‌గేట్స్ బదులిచ్చారు. 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంలో మనం ప్రారంభ దశలో ఉన్నాం. మనం కష్టం అనుకున్నవి సులువుగా చేస్తుంది. తేలికని భావించే వాటిలో విఫలమవుతోంది. కృత్రిమ మేధ అనేది పెద్ద అవకాశం. కానీ దాంతో కొన్ని సవాళ్లూ ఉన్నాయి' అని అన్నారు. దీనికి మోదీ స్పందిస్తూ ఏఐ సృష్టించే కంటెంట్‌కు వాటర్‌మార్క్‌లు ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అప్పుడు ఎవరూ దీన్ని తప్పుదోవ పట్టించలేరని తెలిపారు.

నమో యాప్​లో కృత్రిమ మేధ
ప్రధాని మోదీ, బిల్​గేట్స్ ముఖ్యంగా కృత్రిమ మేథ, దాని ప్రయోజనాలపై ఎక్కువగా మాట్లాడుకున్నారు. 2023 G20 సదస్సులో ఏఐ సాంకేతికత ఎలా ఉపయోగపడిందో ప్రధాని వివరించారు. అంతేకాకుండా కాశీ తమిళ సంగమం కార్యక్రమంలో తన హిందీ ప్రసంగం తమిళంలోకి ఎలా అనువాదం అయిందో తెలిపారు. నమో యాప్‌లో కృత్రిమ మేధ వినియోగం గురించి ప్రస్తావించారు. చరిత్రాత్మకంగా, మొదటి, రెండో పారిశ్రామిక విప్లవాల సమయంలో భారత్‌ వేరే వాళ్ల ఆధీనంలో ఉండటం వల్ల వెనుకబడిందని చెప్పారు. కానీ ప్రస్తుతం నాలుగో పారిశ్రామిక విప్లపం మధ్యలో ఉన్నామనీ, ఇప్పుడు డిజిటలైజేషన్ దాని ప్రధానాంశంగా ఉందని పేర్కొన్నారు. వీటి నుంచి భారత్ చాలా ప్రయోజనం పొందుతుందని తాను భావిస్తున్నట్టు ప్రధాని తెలిపారు.

2023 జీ20 సమావేశం
గతేడాది భారత్​లో జరిగిన జీ20 సమావేసం గురించి ప్రధాని మోదీ, బిల్​ గేట్స్​ చర్చించారు. ' మేము జీ20 సమావేశం నిర్వహించడానికి ముందు విస్తృతమైన చర్చలు జరిపాము. మీరు చూసినట్లుగానే సమావేశం చాలా మలుపులు తిరిగింది. ఇప్పుడు మేము జీ20 ప్రధాన ఉద్దేశాలు, లక్ష్యాలతో, వాటిని ప్రధాన మార్గంలోకి తీసుకురావడంలో సమతూకంలో ఉన్నాం.' అని మోదీ అన్నారు.

దీనికి బదులిచ్చిన బిల్​గేస్ట్ ' జీ20 మరింత ఇన్​క్లూసివ్​గా ఉంది. భారత్​ ఈ సమావేశాన్ని నిర్వహించడం అద్భుతం. అందులో డిజిటల్ ఆవిష్కరణలు బాగున్నాయి. మీరు భారత్​లో సాధించిన ఫలితాల గురించి మా ఫౌండేషన్ ఉత్సాహంగా ఉంది. దానిని ఇతర దేశాలకు తీసుకెళ్లే ప్రయత్నంలో మేము భాగస్వామిగా ఉంటాం' అని అన్నారు.

సాంకేతిక విప్లవం
ప్రధాని నరేంద్ర మోదీ, బిల్ గేట్స్ భారత్‌లో డిజిటల్ విప్లవం గురించి చర్చించారు. 'ఇండోనేషియాలో జరిగిన G20 సదస్సు సందర్భంగా, ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన ప్రతినిధులు, భారత్​లో జరుగుతున్న డిజిటల్ విప్లవం గురించి ఆసక్తి కనబర్చారు. దాని గురించి నేను వారికి వివరించాను. గుత్తాధిపత్యాన్ని నిరోధించడానికి మేము సాంకేతికతను డెమొక్రటైజ్​ చేశాం'అని మోదీ తెలిపారు. 'ఇక్కడ, ఇది డిజిటల్ గవర్నమెంట్ లాంటిది. భారతదేశం సాంకేతికతను స్వీకరించడమే కాదు, వాస్తవానికి అందరికీ దారి చూపిస్తోంది' అని బిల్ గేట్స్ మోదీకి బదులిచ్చారు.

'నమో డ్రోన్ దీదీ'
'నమో డ్రోన్ దీదీ' పథకం గురించి బిల్‌ గేట్స్‌కు మోదీ వివరించారు. కొత్త సాంకేతికతలో భాగంగా తాను 'నమో డ్రోన్ దీదీ' పథకాన్ని ప్రారంభించాననీ అది చాలా విజయవంతంగా కొనసాగుతోందని ప్రధాని తెలిపారు. కొందరు సైకిల్‌ తొక్కడం రాని మహిళలు కూడా పైలట్లు, డ్రోన్లు ఆపరేట్‌ చేసే స్థాయికి ఎదిగారని ప్రధాని గుర్తు చేశారు.

భారత్​లో రిన్యువబుల్​ ఎనర్జీ
'రెన్యువబుల్ (పునరుత్పాదక) ఇంధనంలో భారత్​ వేగంగా పురోగమిస్తోందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. గ్రీన్ హైడ్రోజన్‌ తయారీలో పురోగతి సాధించాలనుకుంటున్నాము. తమిళనాడులో నేను హైడ్రోజన్‌తో నడిచే పడవను ప్రారంభించాను. కాశీ-అయోధ్య మధ్య కూడా ఇలాంటి పడవ ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అది జరిగితే 'క్లీన్​ గంగా' ఉద్యమం బలపడుతుందని, పర్యావరణ స్పృహతో కూడిన సమాజానికి ఇది ఒక సందేశాన్ని పంపుతుంది."

Last Updated : Mar 29, 2024, 11:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.