Party and State Wise Modi Cabinet Ministers : ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కొలువు దీరిన ఎన్డీఏ 3.O సర్కార్ కేబినెట్లో బీజేపీకి 61, ఎన్డీఏ మిత్రపక్షాలకు 11 బెర్తులు లభించాయి. మొత్తం 72మందితో మోదీ కేంద్ర కేబినెట్ కొలువుదీరింది. ఎన్డీఏ ప్రధాన మిత్రపక్షాలైన తెలుగుదేశం, జేడీయూకి చెరో రెండు కేబినెట్ బెర్తులు దక్కాయి. ఎల్జేపీ(ఆర్ వీ), జేడీఎస్, శివసేన, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, రాష్ట్రీయ లోక్ దళ, అప్నా దళ్, హిందూ అవామీ మోర్చా చెరో ఒక్క కేబినెట్ స్థానాన్ని దక్కించుకున్నాయి.
రాష్ట్రాలవారీగా కేబినెట్ బెర్తులు
మరోవైపు రాష్ట్రాల వారీగా చూస్తే కేంద్ర కేబినెట్లో ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, మహారాష్ట్రకు మోదీ సర్కార్ పెద్ద పీట వేసింది. 80 లోక్‌సభ స్థానాలున్న యూపీకి 9, బిహార్‌కు 8 కేంద్ర కేబినెట్ బెర్తులు దక్కాయి. మహారాష్ట్రకు 6, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌కు చెరో 5 కేంద్ర మంత్రి పదవులు వరించాయి. హరియాణా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు చెరో మూడు, ఒడిశా, అసోం, ఝార్ఖండ్, తెలంగాణ, పంజాబ్, బంగాల్, కేరళకు చెరో రెండు కేంద్ర మంత్రి పదవులు దక్కాయి.
రాష్ట్రాలవారీగా కేంద్రమంత్రులు
- ఉత్తర్‌ప్రదేశ్ నుంచి బీజేపీ అగ్రనేత రాజ్‌నాథ్ సింగ్ కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్నారు. ఆ రాష్ట్రంలో ఏకైక క్యాబినెట్ మంత్రి ఆయనే. మరో 8మందికి కేంద్ర సహాయ మంత్రులుగా అవకాశం దక్కింది.
- గుజరాత్ - అమిత్ షా, మన్సుఖ్ మాండవీయ, సీఆర్ పాటిల్
- బిహార్ - హిందూస్థానీ అవామీ మోర్చా నుంచి జితన్ రామ్ మాంఝీ, జేడీయూ తరఫున రాజీవ్ రంజన్ సింగ్, బీజేపీ నేత గిరిరాజ్ సింగ్, ఎల్జేపీ(ఆర్వీ) నేత చిరాగ్ పాసవాన్
- మధ్యప్రదేశ్ - శివరాజ్ సింగ్ చౌహాన్, వీరేంద్ర కుమార్, జ్యోతిరాధిత్య సింథియా
- మహారాష్ట్ర - నితిన్ గడ్కరీ, పీయూశ్ గోయల్
- తమిళనాడు - నిర్మలా సీతారామన్, ఎస్ జైశంకర్, ఎల్ మురుగన్
- రాజస్థాన్ - అశ్విని వైష్ణవ్, భూపేందర్ యాదవ్, గజేంద్ర సింగ్ షెకావత్
- ఒడిశా - ధర్మేంద్ర ప్రధాన్, జువల్ ఓరమ్
- కర్ణాటక - హెచ్ డీ కుమారస్వామి, ప్రహ్లాద్ జోషి
- ఆంధ్రప్రదేశ్ - కింజరాపు రామ్మోహన్ నాయుడు
- తెలంగాణ - గంగాపురం కిషన్ రెడ్డి
- హరియాణా - మనోహర్ లాల్ ఖట్టర్
- హిమాచల్ ప్రదేశ్ - జేపీ నడ్డా
మనవడి కోసం ప్రాణం పణంగా పెట్టిన బామ్మ- 70ఏళ్ల వయసులో కిడ్నీ దానం - KIDNEY TRANSPLANT