ETV Bharat / bharat

కన్నతల్లిపై రేప్​- కొడుకును సుత్తితో కొట్టి చంపిన పేరెంట్స్- గోనె సంచిలో కుక్కి! - PARENTS KILLED SON - PARENTS KILLED SON

Parents Killed Son In Indore : తల్లిపై అత్యాచారానికి పాల్పడిన కుమారుడిని సుత్తి, స్కూడ్రైవర్​తో కొట్టి చంపేశారు అతడి తల్లిదండ్రులు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. మరోవైపు, తన ప్రేమకు అడ్డుచెబుతున్నారని కుటుంబ సభ్యులకు విషం కలిపిన చికెన్ రైస్​ను పెట్టింది ఓ యువతి. దీంతో యువతి తల్లి, తాత ప్రాణాలు విడిచారు. ఈ దారుణం తమిళనాడులో జరగింది. గుజరాత్‌లో జరిగిన మరో ఘటనలో ఓ వివాహిత ఇంటికి ఆమె ప్రియుడు పార్సిల్‌ బాంబు పంపాడు. అది బాంబు పేలి ఆమె భర్త, కుమార్తె దుర్మరణం పాలయ్యారు.

MURDER
MURDER (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : May 4, 2024, 11:01 AM IST

Parents Killed Son In Indore : సొంత కుమారుడిని అతడి తల్లిదండ్రులే చంపి గోనె సంచిలో చుట్టి బయట పడేశారు. ఈ దారుణం మధ్యప్రదేశ్​లోని ఇందౌర్ లో జరిగింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరపగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. కన్న తల్లిపై అత్యాచారానికి పాల్పడడం వల్లే కుమారుడిని అతడి తల్లిదండ్రులు హత్య చేశారని పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
ఇందౌర్​లోని ఏరోడ్రోమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏప్రిల్ 26న గోనె సంచిలో చుట్టి ఉన్న ఓ మృతదేహం పారిశుధ్య కార్మికులకు కనిపించింది. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి మెడలో ఓం లాకెట్ ఉంది. అలాగే మృతుడి శరీరంపై లోదుస్తులు మాత్రమే ఉన్నాయి. ఈ క్రమంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని ఉంచిన గోనె సంచిపై ఉన్న అడ్రస్​ను బట్టి నిందితులను పట్టుకోగలిగారు.

'ఏప్రిల్ 26న గోనె సంచిలో గుర్తు తెలియని మృతదేహాం కనిపించింది. మృతదేహాన్ని పెట్టిన గోనె సంచి జైన్ నమ్కీన్ అనే వ్యాపారి దుకాణం నుంచి ఏప్రిల్ 17న నిందితులు కొనుగోలు చేశారు. ఇదే నిందితులను పోలీసులు గుర్చించడానికి ఉపయోగపడింది. మృతుడు సుధాన్షు ఇటుక బట్టీలో కూలీ. ఏప్రిల్ 24న కన్నతల్లిపైనే సుధాన్షు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ విషయాన్ని భర్తకు బాధితురాలు తెలియజేసింది. అనంతరం భార్యాభర్తలిద్దరూ కలిసి రాత్రి 3 గంటల సమయంలో సుధాన్షును సుత్తి, స్క్రూడ్రైవర్​తో కొట్టి హత్య చేశారు. అనంతరం కొడుకు మృతదేహాన్ని రెండు రోజుల పాటు ఇంట్లోనే ఉంచారు. దుర్వాసన రావడం వల్ల ఏప్రిల్ 26వ తేదీ తెల్లవారుజామున బైక్​పై మృతదేహాన్ని సుధాన్షు తండ్రి రాజారామ్ నిర్జీవ ప్రదేశంలో పడేశాడు. సమీపంలో ఉన్న సీసీటీవీలో నిందితుడు మృతదేహాన్ని పడేస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. సుధాన్షు తండ్రి రాజారామ్​ను అరెస్ట్ చేశాం. సుధాన్షు తల్లిని నిందితురాలిగా చేర్చాం'
--వినోద్ కుమార్ మీనా, ఇందౌర్ డీసీపీ

ప్రేమను అంగీకరించలేదని చికెన్ రైస్ లో విషం
తన ప్రేమకు అడ్డు చెప్పారని కన్న తల్లి సహా కుటుంబ సభ్యులను హతమార్చేందుకు చికెన్ రైస్​లో విషం కలిపింది ఓ యువతి. దీంతో చికెన్ రైస్ తిన్న యువతి తల్లి, తాత మరణించారు. ఈ ఘటన తమిళనాడులోని నమక్కల్ లో జరిగింది.

అసలేం జరిగిందంటే?
నమక్కల్ బస్టాండ్ ఎదురుగా ఉన్న జీవానందం (32) అనే యువకుడు రెస్టారెంట్ నడుపుతున్నాడు. ఆ రెస్టారెంట్ లో భగవతి(20) అనే ఇంజినీరింగ్ విద్యార్థిని ఏప్రిల్ 30న ఏడు ప్యాకెట్ల చికెన్ రైస్​ను ఆర్డర్ చేసింది. ఇంట్లో ఉన్న తల్లి నదియా (40), తాత షణ్ముకనాథన్ (67) ఈ రైస్​ను తిన్నారు. మిగతా కుటుంబ సభ్యులు ఈ చికెన్ రైస్​ను తినకముందే నదియా, షణ్ముకనాథన్ అస్వస్థతతకు గురయ్యారు. వెంటనే వారిని నమక్కల్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతూ మే 2న షణ్ముకనాథన్, మే 3న నదియా మృతి చెందారు.

సమాచారం అందుకున్న పోలీసులు చికెన్ రైస్ శాంపిల్స్​ను సేలం ఫుడ్ అనాలిసిస్ లేబొరేటరీకి పంపించారు. చికెన్ రైస్​లో విషం ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. దీంతో పోలీసులు భగవతి, హోటల్ యజమాని జీవానందంను వేర్వేరుగా విచారించారు. తన ప్రేమకు తల్లి, కుటుంబ సభ్యులు అడ్డుచెప్పడం వల్లే ఆహారంలో విషం కలిపినట్లు భగవతి పోలీసులు ఎదుట ఒప్పుకుంది. ఈ క్రమంలో భగవతిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ప్రియురాలికి పార్సిల్​ బాంబు- ఇద్దరు మృతి
గుజరాత్‌లోని వడాలిలో ఓ వివాహిత ఇంటికి ఆమె ప్రియుడు పార్సిల్‌ బాంబు పంపాడు. అది బాంబు పేలి ఆమె భర్త, కుమార్తె దుర్మరణం పాలయ్యారు. జీతూభాయ్‌ అనే వ్యక్తి ఇంటికి టేప్‌రికార్డర్‌ వంటి పరికరం పార్సిల్‌లో వచ్చింది. దాన్ని జీతూభాయ్‌, అతని 12 ఏళ్ల కుమార్తె కలిసి ఆన్‌ చేయడానికి ప్రయత్నించగా అది పేలింది. ఈ ఘటనలో జీతూభాయ్‌ అక్కడే మృతి చెందగా కుమార్తె ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించింది. మరో ఇద్దరు కుమార్తెలకు గాయాలయ్యాయి. ఘటన జరిగినపుడు జీతూభాయ్‌ భార్య ఇంట్లో లేకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడు జయంతిభాయ్‌ బాలుసింగ్‌ వంజారాను పోలీసులు అరెస్టు చేసి విచారించారు. తన ప్రియురాలిని వివాహం చేసుకున్నాడనే కారణంతోనే జీతూభాయ్‌ను హత్య చేయాలనుకున్నట్లు నిందితుడు అంగీకరించాడు. కుట్రలో జీతూభాయ్‌ భార్య హస్తం ఉందా లేదా అన్నది ఇంకా తెలియరాలేదు.

వివాహ బంధానికి సహనమే పునాది- చిన్న చిన్న గొడవలకు విడాకులు వద్దు!: సుప్రీంకోర్టు - SC Judgement On Marriage

లైంగిక ఆరోపణలపై బంగాల్​ గవర్నర్​ ఆడియో రిలీజ్​- కేరళకు ఆనంద్​ బోస్​ పయనం - Bengal Governor Molestation Issue

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.