ETV Bharat / bharat

ఛాయ్​ చేసినంత సులువుగా అద్దిరిపోయే "పనీర్ ఖీర్" - ఇలా ప్రిపేర్ చేసుకోండి - Paneer Kheer Recipe - PANEER KHEER RECIPE

How To Make Paneer Kheer : తీపి వంటకాలు అంటే.. కొందరికి చాలా ఇష్టం. అలాంటి వారికోసం అద్భుతమైన స్వీట్ రెసిపీ తీసుకొచ్చాం. అదే.. పనీర్ ఖీర్. దీన్ని ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. పైగా ఈ రెసిపీని చాలా ఈజీగా ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

Paneer Kheer Recipe
How To Make Paneer Kheer (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 3, 2024, 10:05 AM IST

Paneer Kheer Recipe in Telugu : చాలా మంది తీపి వంటకాలు అంటే ఎంతో ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా పండగల టైమ్​లో ఇంట్లో బియ్యం పాయసం, సేమియా పాయసం వంటివి ఏదైనా స్వీట్ రెసిపీలు చేసినప్పుడు అందులో కాస్త నెయ్యి వేసుకుని చాలా ఇష్టంగా తినేస్తుంటారు. కొందరు పండగలు, ఫంక్షన్స్ టైమ్​లోనే కాదు మిగతా సమయాల్లోనూ తీపి వంటకాలు తయారు చేసుకుని ఆరగిస్తుంటారు.

అయితే ప్రతిసారీ.. రైస్, సేమియాతోనే కాకుండా ఈసారి వెరైటీగా పనీర్​(Paneer) పాయసం ప్రిపేర్ చేసుకోండి. ఇందుకోసం ఎక్కువ శ్రమించాల్సిన పనిలేదు. టీ పెట్టినంత సులువుగా పనీర్ ఖీర్ తయారు చేసుకోవచ్చు. రుచి కూడా చాలా బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ చాలా ఇష్టంగా తింటారంటున్నారు పాకశాస్త్ర నిపుణులు. ఇంతకీ, పనీర్ ఖీర్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

పనీర్ ఖీర్​కి కావాల్సినవి :

  • పనీర్ - 200 గ్రాములు
  • పాలు - ముప్పావు లీటర్(750ఎంఎల్)
  • యాలకుల పొడి - అర టీస్పూన్
  • చక్కెర - పావు కప్పు
  • డ్రై ఫ్రూట్స్​(కాజు, బాదం, కిస్మిస్) - 3 టేబుల్ స్పూన్లు

ఇంట్లోనే ఈజీగా "మీఠా సమోసా" - టేస్ట్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

పనీర్ ఖీర్ తయారీ విధానం :

  • పనీర్ పాయసం ప్రిపేర్ చేసుకునే ముందు రెసిపీలోకి మంచి క్వాలిటీ గల పనీర్​ని ఎంపిక చేసుకోండి. ఆపై దాన్ని వేడి వాటర్​లో పావుగంట సేపు నానబెట్టుకోవాలి. తర్వాత పనీర్​ని సన్నగా తురిమి పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై బౌల్ పెట్టుకొని పాలు పోసుకోవాలి. ఆపై వాటిని రెండు పొంగులు వచ్చే వరకు హై ఫ్లేమ్ మంట మీద 10 నిమిషాల పాటు మరిగించుకోవాలి.
  • అలా మరిగించుకున్నాక అందులో పంచదార యాడ్ చేసుకొని మరో ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు పాలను వేడి చేసుకోవాలి.
  • ఆపై ఆ మిశ్రమం కాస్త చిక్కబడిందని అనిపించాక దానిలో ముందుగా తురిమి పెట్టుకున్న పనీర్ యాడ్ చేసుకోవాలి. అలాగే యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
  • తర్వాత ఆ మిశ్రమాన్ని మీడియం ఫ్లేమ్ మంట మీద 10 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఒకవేళ ఇంట్లో అందుబాటులో ఉంటే.. చివరలో కాస్త రోజ్ వాటర్ యాడ్ చేసుకొని స్టౌ ఆఫ్ చేసుకొని దింపేసుకోవాలి. అంతే.. సూపర్ టేస్టీగా ఉండే పనీర్ ఖీర్ రెడీ!
  • ఈ నోరూరించే స్వీట్ రెసిపీని వేడివేడిగా తినొచ్చు. లేదంటే చల్లగా తిన్నా టేస్ట్ అద్దిరిపోతుంది!
  • వీలైతే పనీర్ ఖీర్​ని ఫ్రిజ్​లో ఉంచుకొని రెండు, మూడు రోజులు తినొచ్చంటున్నారు నిపుణులు.
  • మరి, ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓసారి కమ్మని పసందైన పనీర్ ఖీర్​ ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేయండి.

స్వీట్ షాపు స్టైల్​ కరకరలాడే చెగోడీలు - ఇలా చేస్తే రెండు తినే దగ్గర నాలుగు లాగించడం పక్కా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.