One Rupee Coin In Money Gifting : పెళ్లిళ్లు, ఫంక్షన్ల సమయంలో కట్నాలు (డబ్బులు) చదివించడం అందరికీ తెలిసిందే. ఇలా డబ్బులను బహుమతిగా ఇచ్చేటప్పుడు రూ.100, రూ.500, రూ.1,000 కాకుండా.. రూ.101 రూ.501, రూ.1,001 అంటూ ఒక రూపాయి అదనంగా చేర్చి గిఫ్ట్ ఇస్తుంటారు. మరి.. ఎంత డబ్బును కట్నంగా అందించినా కూడా చివర రూపాయిని ఎందుకు జోడించాలి? అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచిస్తే సమాధానం దొరికిందా? దొరకలేదంటే ఈ స్టోరీ చదవాల్సిందే. దీని వెనుక ఉన్న కారణాలను పండితులు వివరిస్తున్నారు. అవేంటో తెలుసుకోండి.
శుభం జరగాలని :
వాస్తు పండితుల అభిప్రాయం ప్రకారం.. సున్నాను అశుభంగా భావిస్తారు. కట్నంగా.. వంద, వెయ్యి, పది వేలు.. ఇలా ఎంత డబ్బు చదివించినా అందులో చివర సున్నా ఉంటుంది. కొత్తగా పెళ్లైన వారికి అశుభంగా భావించే సున్నాను చదివింపుగా ఇవ్వకూడదనే ఉద్దేశంతో చివర 1 రూపాయిని జోడిస్తారట. కొత్తగా సంసారం ఆరంభించేవారికి అంతా మంచే జరగాలని కోరుకుంటారు కాబట్టి.. ఇలా ఒక్క రూపాయిని అదనంగా ఇస్తారని పండితులు చెబుతున్నారు.
ఇంట్లో డైనింగ్ టేబుల్ సరైన దిశలో లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా ?? - Vastu Tips For home
అక్షయ పాత్రలాగా పని చేస్తుంది :
పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు ద్రౌపదికి అక్షయ పాత్రను అందించాడట. ఈ అక్షయ పాత్రలో నుంచి ఎంత మందికి అన్నం అందించినా కూడా.. ఇంకా మరొకరికి సరిపడా అన్నం ఉండేదట. ఇదే విధానాన్ని కట్నకానుకలు సమర్పించడంలోనూ అనుసరిస్తారట. చదివింపుల్లో సున్నా ఉంటే ముగింపు అర్థం వస్తుంది కాబట్టి.. అలా జరగకూడదని, వారి ఆర్థిక రాబడి ఆగకుండా కొనసాగాలనే ఉద్దేశంతో కూడా 1 రూపాయిని జోడిస్తారట.
గొడవలు రాకుండా :
ఒకటి అనేది ఒక బేసి సంఖ్య. దీనిని ఎప్పుడూ సరి సంఖ్య లాగా ఇద్దరికీ సమానంగా పంచలేరు. కొత్తగా పెళ్లైన దంపతులకు ఇలా 1 రూపాయి అదనంగా ఇచ్చి దాన్ని బేసి సంఖ్యగా మార్చడం ద్వారా.. వారి మధ్య పంపకాలకు చోటు ఉండదట. కాబట్టి.. ఇద్దరూ కలిసి ఒక్కటిగా ఖర్చు చేసుకోవాలనే అర్థంలో కూడా ఒక్క రూపాయిని అదనంగా ఇస్తారని పండితులు చెబుతున్నారు.
Note : పైన తెలిపిన వివరాలు కొందరు వాస్తు నిపుణులు, వాస్తు శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
వాస్తు - పూజ గదిలో ఈ వస్తువులు అస్సలు పెట్టకండి! - లేకపోతే కష్టాలు తప్పవు! - Vastu Tips For Home
ఇంట్లో నిమ్మ చెట్టు పెంచుకోవచ్చా? - వాస్తు ఏం చెబుతోందో తెలుసా? - VASTU TIPS FOR LEMON PLANT