ETV Bharat / bharat

రష్యాకు అజిత్‌ డోభాల్‌!- యుద్ధం ఆపేందుకు తొలి అడుగు!! - India On Russia Ukraine Conflict - INDIA ON RUSSIA UKRAINE CONFLICT

India On Russia Ukraine Conflict : రష్యా-ఉక్రెయిన్‌ మధ్య రెండేళ్లకుపైగా సాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే ప్రయత్నాలను భారత్‌ ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా వచ్చేవారం జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్ రష్యా పర్యటనకు వెళ్లనున్నారు. వివాద పరిష్కారంపై మాస్కోతో ఆయన చర్చలు జరపనున్నారు.

India On Russia Ukraine Conflict
India On Russia Ukraine Conflict (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 8, 2024, 12:26 PM IST

India On Russia Ukraine Conflict : ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పే ప్రయత్నాల్లో భారత్‌ ఓ అడుగు ముందుకువేయనుంది. దీనిలో భాగంగా మన దేశ జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ ఈ వారం రష్యాకు వెళ్లనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించినట్లు ఓ ఆంగ్ల మీడియా పేర్కొంది. ఈ పర్యటనలో భాగంగా ఆయన బ్రిక్స్‌ జాతీయ భద్రతాదారుల సదస్సులో పాల్గొననున్నారు.

రష్యా, చైనా కీలక అధికారులతో భేటీ!
అదే సమయంలో రష్యా, చైనా కీలక అధికారులతో ఆయన భేటీ కానున్నారు. గత నెలలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని మోదీ ఫోన్ మాట్లాడిన సమయంలో డోభాల్‌ పర్యటన అంశం ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. బ్రిక్స్‌ ఎన్‌ఎస్‌ఏల సదస్సు సమయంలో ఉక్రెయిన్‌ శాంతి కోసం ఆలోచనలను ఆయన పంచుకుంటారని వెల్లడించినట్లు సమాచారం.

అయితే ఈ ఏడాది ఆగస్టులో ప్రధాని మోదీ ఉక్రెయిన్‌ను సందర్శించారు. ఆ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీతో చర్చలు జరిపారు. అ సమయంలో చర్చలు, దౌత్యమే యుద్ధానికి పరిష్కార మార్గాలని సూచించారు. తన వ్యక్తిగత హోదాలో ఓ మిత్రుడిలా ఉక్రెయిన్‌ శాంతి కోసం రష్యాతో మధ్యవర్తిత్వం చేస్తానని ఆఫర్‌ చేశారు. "యుద్ధంలో భారత్‌ ఏమాత్రం తటస్తంగా లేదు. కేవలం శాంతి పక్షమే వహిస్తోంది" అని మోదీ పేర్కొన్నారు.

శాంతిలో చైనా, భారత్‌ కీలక పాత్ర!
మరోవైపు ఈ యుద్ధంలో చైనా, భారత్‌, బ్రెజిల్‌ మాత్రమే శాంతి చర్చలకు సాయం చేయగలవని ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్‌ పేర్కొన్నారు. తాజాగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ కూడా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో చర్చలు జరిపారు. అనంతరం మాట్లాడుతూ శాంతి స్థాపనకు చైనా, భారత్‌ కీలక పాత్ర పోషించగలవని పేర్కొన్నారు.

క్రెయిన్‌ వివాద పరిష్కారానికి ఇటలీ మద్దతు ఉంటుందని మెలోని ప్రకటించారు. దేశ జాతీయ సమగ్రతను కాపాడేందుకు రూపొందిచిన నియమాలను పరిరక్షించే లక్ష్యంతో పాటు జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వివాద పరిష్కారంలో భారత్‌, చైనాలు కీలక పాత్ర పోషిస్తాయని తాను నమ్ముతున్నట్లు పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.