ETV Bharat / bharat

బిజినెస్​ వెబ్​సైట్​తో రూ.60 కోట్ల టర్నోవర్​- ఎందరికో ఆదర్శంగా యువ వ్యాపారవేత్త- ఎవరీ నీలేశ్​ సాబే? - Nilesh Sabe Success Story - NILESH SABE SUCCESS STORY

Nilesh Sabe Successful Business Story : ఇంజినీరింగ్​ చదివేందుకు రెండెకరాల పొలం తాకట్టు పెట్టారు ఆయన తల్లిదండ్రులు. ఆ పొలం విడిపించేందుకు రూ.12 వేలకు ఉద్యోగంలో చేరిన ఓ యువ ఇంజినీర్​, మూడు నెలలకే మానేసి బిజినెస్​ వెబ్​సైట్​ స్థాపించి రూ.60 కోట్ల వార్షిక టర్నోవర్​ సాధించే స్థాయికి ఎదిగారు. అంతేకాకుండా స్థానిక యువకులకు ఉపాధి కల్పిస్తున్నారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ఆ యువ వ్యాపారవేత్త సక్సెస్​ స్టోరీ మీకోసం.

Nilesh Sabe Successful Business Story
Nilesh Sabe Successful Business Story (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 24, 2024, 2:31 PM IST

Nilesh Sabe Successful Business Story : అనుకున్నది సాధించాలంటే పట్టుదలతో పాటు ధైర్యం కూడా ఉండాలని నిరూపించాడు మహారాష్ట్రకు చెందిన ఓ యువకుడు. రెండు ఎకరాల భూమిని తాకట్టు పెట్టి మరీ చదువు సాగించిన ఆ యువకుడు, రూ.12వేల శాలరీకే ఓ ఉద్యోగంలో చేరారు. అయితే వచ్చే జీతంతో తాకట్టులో ఉన్న తన పొలాన్ని విడిపించుకోలేనని మూడు నెలలకే ఆ ఉద్యోగం మానేశారు. ఆ తర్వాత ఓ బిజినెస్ మ్యాగజైన్​ ప్రారంభించారు. అలా ప్రస్తుతం సంవత్సరానికి రూ.60 కోట్ల వరకు సంపాదిస్తున్నారు. అంతే కాకుండా స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తున్నారు. ఈ యువ వ్యాపారవేత్తే మహారాష్ట్రలోని అకోలా జిల్లాకు చెందిన నీలేశ్ సాబే.

కొలాసా గ్రామానికి చెందిన నీలేశ్​ను తన తల్లిందడ్రులు రెండెకరాల భూమిని తాకట్టు పెట్టి ఇంజినీరింగ్ చదివించారు. ఐటీ విభాగంలో గ్రాడ్యుయేషన్​ పూర్తి చేసుకున్న నీలేశ్ రూ.12 వేల శాలరీకి పుణెలోని ఓ కంపెనీలో ఉద్యోగానికి చేరారు. అయితే తమ కుమారుడు తాకట్టులో ఉన్న పొలాన్ని విడిపిస్తారని ఆశించారు నీలేశ్ తల్లిదండ్రులు. కానీ మూడు నెలల్లోనే ఉద్యోగం మానేసి ఇంటికి వచ్చారు నీలేశ్. ఉద్యోగం చేయాలని లేదని, వ్యాపారం చేయాలనుకుంటున్నానని తల్లిదండ్రలకు చెప్పారు. మొదట్లో వాళ్లు అంగీకరించలేదు. ఆ తర్వాత కొన్నాళ్లుకు ఒప్పుకున్నారు. నీలేశ్​ ఆశయానికి అండగా నిలిచారు.

కొవిడ్​లోనూ !
ఉద్యోగం మానేశాక 'స్విఫ్ట్ ఎన్ లిఫ్ట్' అనే బిజినెస్​ మ్యాగజైన్​ను ప్రారంభించాడు నీలేశ్ సాబే. ఇందులో దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తల విజయగాథలను ప్రచురించారు. అలాగే వ్యాపారవేత్తలు చెప్పే వ్యాపార లాభాలు, చిట్కాలను అందులో పొందుపరిచేవారు. దీంతో ఈ మ్యాగజైన్ సక్సెస్ అయ్యింది. 2020లో ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ మహమ్మారి కారణంగా నీలేశ్ సాబే మ్యాగజైన్​కు ఆదరణ తగ్గింది. ఈ క్రమంలో అమెరికాలో కొన్ని పరిశ్రమలు లాభలతో నడిచాయని విషయాన్ని తెలుసుకున్నారు నీలేశ్​. అనంతరం ఆ పారిశ్రామికవేత్తలను సంప్రదించి, వారి స్టోరీలను ప్రచురించారు. దీంతో నీలేశ్ కొవిడ్ కష్టకాలంలో ఉన్న ఆయన మ్యాగజైన్​ సక్సెస్​ సాధించింది. అలాగే మ్యాగజైన్​లో వ్యవస్థాపకుల వస్తువుల గురించి రాసేవారు. దీంతో మ్యాగజైన్​ ఆర్థికంగా కూడా విజయం సాధించింది.

వార్షిక టర్నోవర్ రూ.60 కోట్లు
ప్రస్తుతం 'స్విఫ్ట్ ఎన్ లిఫ్ట్' మ్యాగజైన్ వార్షిక టర్నోవర్ రూ.60 కోట్లు. ఇందులో 70మంది ఐటీ ఉద్యోగులు, 350 మందికి పైగా ఎంబీఏ పూర్తి చేసిన వారు, మాస్ కమ్యూనికేషన్ విభాగంలో 12మంది, గ్రాఫిక్స్, వీడియో ఎడిటింగ్ విభాగంలో 11మంది ఉద్యోగం చేస్తున్నారు. 'స్విఫ్ట్ ఎన్ లిఫ్ట్' కంపెనీకి మరో 100- 150 మంది ఉద్యోగుల అవసరం ఉందని తెలిపారు వ్యవస్థాపకులు నీలేశ్ సాబే. తాను ఇంజినీరింగ్ పూర్తి చేసిన కాలేజీ విద్యార్థులకు ఆ ఉద్యోగాలు ఇస్తానని అన్నారు. అందుకోసం విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు తెలిపారు.

Nilesh Sabe Successful Business Story
కాలేజీ విద్యార్థులను ఇంటర్వ్యూ చేస్తున్న నీలేశ్ (ETV Bharat)

ట్యూషన్​ టీచర్​తో మైనర్ ప్రేమాయణం​- దూరం పెట్టిందని 'క్యాష్​ ఆన్​ డెలివరీ' ఆర్డర్లతో రివెంజ్​​! అసలేం జరిగిందంటే? - Cash On Delivery Torture

వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ - తొమ్మిది ప్రాధాన్యాలతో కేటాయింపులు - Union Budget 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.