ETV Bharat / bharat

జులై 1 నుంచి అమల్లోకి కొత్త క్రిమినల్​ చట్టాలు : కేంద్రం

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 24, 2024, 3:29 PM IST

Updated : Feb 24, 2024, 4:55 PM IST

New Criminal Laws Roll Out : గతేడాది పార్లమెంట్ ఆమోదం పొందిన మూడు కొత్త క్రిమినల్​ చట్టాలు ఈ ఏడాది జులై 1న అమలులోకి రానున్నట్లు కేద్రం ఓ ప్రకటనలో తెలిపింది. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన చట్టాలు భారతీయ న్యాయసంహిత (BNS), భారతీయ నాగరిక సురక్ష సంహిత (BNSS), భారతీయ సాక్ష్య అధినియం(BS)లోని ముఖ్యాంశాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

New Criminal Laws Roll Out
New Criminal Laws Roll Out

New Criminal Laws Roll Out : నూతన నేరచట్టాలు భారతీయ న్యాయసంహిత (BNS), భారతీయ నాగరిక సురక్ష సంహిత (BNSS), భారతీయ సాక్ష్య అధినియం(BS), ఈ ఏడాది జులై ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు కేంద్రం హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే బీఎన్​ఎస్​లోని 'హిట్​ అండ్ రన్'​ నేరానికి సంబంధించిన నిబంధనలను వెంటనే అమలు చేయడం లేదని హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా తెలిపారు. ఆల్​ ఇండియా మోటార్ ట్రాన్స్​పోర్ట్​ కాంగ్రెస్​తో సంప్రదింపులు జరిపిన తర్వాతే, బీఎన్​ఎస్​లోని సెక్షన్ 106(2) అమలుపై నిర్ణయం తీసుకుంటామని అజయ్ భల్లా వెల్లడించారు. గతంలో హిట్​ అండ్ రన్ నిబంధనలపై ట్రక్కు డ్రైవర్లు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చింది.

ప్రస్తుతం అమలవుతున్న భారతీయ శిక్షాస్మృతి(ఐపీసీ), నేర శిక్షాస్మృతి(సీఆర్‌పీసీ), సాక్ష్యాధారాల చట్టం(ఎవిడెన్స్‌ యాక్ట్‌) స్థానంలో తీసుకొచ్చిన మూడు నూతన నేర చట్టాలకు గతేడాది డిసెంబరు 21న పార్లమెంటు ఆమోదం తెలిపింది. డిసెంబరు 25న రాష్ట్రపతి ద్రౌపదీముర్ము వాటికి ఆమోదముద్ర వేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న బ్రిటీష్‌ కాలం నాటి భారతీయ శిక్షాస్మృతి, నేర శిక్షాస్మృతి, సాక్ష్యాధారాల చట్టాలు ఇక కనుమరుగు కానున్నాయి.

దేశంలోని న్యాయ వ్యవస్థను ఈ మూడు చట్టాలు పూర్తిగా మార్చేయనున్నాయి. ప్రతి నేరానికి సంబంధించిన నిర్వచనం, వాటికి విధించే శిక్షల గురించి వివరంగా ఇందులో ప్రస్తావించారు. తొలిసారి ఉగ్రవాదానికి స్పష్టమైన నిర్వచనం ఇచ్చారు. రాజద్రోహం నేరాన్ని 'దేశద్రోహం'గా మార్చారు. దోషులకు శిక్షలు విధించే విషయంలో మేజిస్ట్రేట్​లకు ఉన్న అధికారాలను కొత్త చట్టాల్లో పెంచారు. నేరస్థుడిగా ప్రకటించే విషయంలో వారికి ఉన్న పరిధిని విస్తృతం చేశారు. పాత చట్టంలో అత్యాచారానికి 375, 376 సెక్షన్లు ఉండేవి. కొత్త బిల్లులో దానిని సెక్షన్‌ 63గా పేర్కొన్నారు. పాత చట్టంలో హత్యకు 302 సెక్షన్‌ ఉండగా, కొత్త బిల్లులో దానిని 101 సెక్షన్‌గా పెట్టారు. కిడ్నాప్‌నకు పాత చట్టంలో 359వ సెక్షన్‌ ఉండేది. కొత్త బిల్లులో దానిని సెక్షన్‌ 136 కింద చేర్చారు.

భారతీయ న్యాయ సంహిత(BNS)లోని ముఖ్యాంశాలు :
Bharatiya Nyaya Sanhita : భారతీయ న్యాయ సంహితలో కొత్తగా 20 నేరాలను చేర్చారు. ఐపీసీలోని 19 నిబంధనల తొలగించారు. 33 నేరాల్లో జైలు శిక్ష, 83 నేరాల్లో జరిమానాను పెంచారు. వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాద చర్యలు, హిట్‌ అండ్‌ రన్‌, మూక దాడి, పిల్లలను నేరాలకు వినియోగించడం, మహిళలను వ్యభిచార వృత్తిలోకి దింపడం, గొలుసు దొంగతనం, విదేశాల్లో నేరాలను ప్రోత్సహించడం, భారత సార్వభౌమత్వాన్ని, సమగ్రతను, ఐక్యతను దెబ్బతీయడం, ఫేక్‌ వార్తలను ప్రచురించడం వంటి నేరాలకు స్పష్టమైన నిర్వచనం ఇచ్చారు.

  • 23 నేరాల్లో తప్పనిసరి కనీస శిక్ష విధింపు.
  • కొత్తగా 6 నేరాల్లో సమాజ సేవా శిక్ష.
  • పిల్లలకు నిర్వచనం.
  • జెండర్‌లో ట్రాన్స్‌జెండర్ల చేర్పు.
  • దస్త్రాలుగా ఎలక్ట్రానిక్‌, డిజిటల్‌ రికార్డుల పరిగణన.
  • చరాస్తికి విస్తృత నిర్వచనం.
  • మహిళలు, పిల్లలపై నేరాలకు కొత్త అధ్యాయం.
  • నేర ప్రయత్నం, ప్రేరణ, కుట్రకు ప్రత్యేక అధ్యాయం.
  • ఆత్మహత్యకు ప్రయత్నించడం నేర జాబితా నుంచి తొలగింపు.
  • భిక్షాటన మానవ అక్రమ రవాణా నేరంగా పరిగణన.
  • రూ.5వేల లోపు దొంగతనాలకు సమాజ సేవ శిక్ష విధింపు.
  • పిచ్చివాడు, అవివేకి, ఇడియట్‌ వంటి పురాతన పదాలు తొమ్మిది చోట్ల తొలగింపు.
  • బ్రిటీష్‌ క్యాలెండర్‌, క్వీన్‌, బ్రిటీష్‌ ఇండియా, శాంతి కోసం న్యాయం వంటి పదాల తొలగింపు.
  • 44 చోట్ల కోర్ట్‌ ఆఫ్‌ జస్టిస్‌ స్థానంలో కోర్టు అని వాడుక.
  • పిల్లలు అనే పదానికి బిల్లు మొత్తంలో ఏకీకృత నిర్వచనం.
  • 12 చోట్ల డీనోట్స్‌ స్థానంలో మీన్స్‌ వాడుక. దటీజ్‌ టూ సే స్థానంలో నేమ్‌లీ వాడుక.

భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత (BNSS)లోని ముఖ్యాంశాలు :
Bharatiya Nagarik Suraksha Sanhita : భారతీయ నాగరిక్‌ సురక్షా సంహితలో నేరాంగీకార పరిధిని విస్తరించారు. గతంలో 19 నేరాలుండగా ప్రస్తుతం 10ఏళ్లు అంతకంటే అధిక శిక్షల కేసులన్నింటికీ వర్తింపజేశారు. కొత్తగా అత్యాచారం కేసును చేర్చారు. మేజిస్ట్రేట్​ విధించే జరిమానా పరిమితిని కూడా పెంచారు. ఇక మూడేళ్ల లోపు శిక్షలు పడే కేసుల్లో అరెస్టుకు, సీనియర్‌ పోలీసు అధికారుల ముందస్తు అనుమతిని తప్పనిసరి చేశారు. కేసుల్లో పారదర్శకత, జవాబుదారీతనం, వేగంగా న్యాయం కోసం ఆడియో, వీడియో రికార్డులను పరిగణలోకి తీసుకుంటారు. సాక్షులు, నిందితుల వాంగ్మూలాల ఆడియో, వీడియో రికార్డులకు అవకాశం కల్పిస్తారు. ప్రజా ప్రతినిధులు, శాస్త్రీయ నిపుణులు, వైద్యాధికారి సాక్ష్యాలను రికార్డు చేయడానికి అవకాశం ఇస్తారు.

  • మొదటి 40 నుంచి 60 రోజుల రిమాండులో 15 రోజుల పోలీసు కస్టడీకి అనుమతి. అయితే బెయిలు ఇవ్వడానికి ఇది అడ్డంకి కాదు.
  • జప్తు, స్వాధీనం వంటి చర్యలకు విధివిధానాలు.
  • తీర్పు వచ్చేవరకు స్వయంగా హాజరుకాకపోయినా విచారణకు అవకాశం.
  • దేశమంతా జీరో ఎఫ్‌ఐఆర్‌.
  • ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు.
  • మూడు నుంచి ఏడేళ్లలోపు శిక్షలు పడే కేసుల్లో ప్రాథమిక విచారణకు అనుమతి.
  • దర్యాప్తులో ఫోరెన్సిక్‌ సాయానికి అనుమతి.
  • తీవ్రమైన నేరాల్లో డీఎస్పీ స్థాయి అధికారి దర్యాప్తు.
  • బెయిలుకు అర్థం సరళీకరణ.
  • మొదటి కేసు నిందితుల సత్వర బెయిలుకు అవకాశం.
  • నిర్దోషిగా విడుదల చేయాలని కోరుతూ వేసే కేసుల్లో బెయిలు సరళీకరణ.
  • తొలిసారి నేరం చేసిన వారికి విధించే శిక్షల్లో మినహాయింపు. నాలుగో వంతుగానీ, ఆరోవంతుగానీ విధింపు.
  • శోధన, సీజ్‌ చేయడాన్ని వీడియో తీసే అవకాశం.
  • క్షమా భిక్ష పిటిషన్‌ను విధివిధానాలు.
  • సాక్షుల రక్షణకు ప్రత్యేక పథకం.
  • బాధితుల రక్షణ సంబంధిత నిబంధనల చేర్పు. బాధితులకు విస్తృత నిర్వచనం. దర్యాప్తు వివరాలను బాధితులకు ఎప్పటికప్పుడు అందించడం.
  • రెండు కంటే ఎక్కువ వాయిదాలు అడగకుండా నిబంధనల రూపకల్పన.
  • తప్పుడు కేసుల నుంచి ప్రభుత్వాధికారులకు, ప్రజాప్రతినిధులకు రక్షణ.
  • ప్రాసిక్యూషన్‌ డైరెక్టరేట్‌ మరింత సమర్థంగా పనిచేసేలా చర్యలు.
  • ఘోరమైన నేరాల్లో చేతులకు బేడీలు వేసే నిబంధన చేర్పు.
  • కోర్టులో హాజరుకావడానికి ఇచ్చే నోటీసు ప్రొఫార్మా తయారీ. ప్రభుత్వాధికారుల సాక్ష్యాలు ఆడియో, వీడియో రూపంలో సేకరణ.
  • 35 నేరాల్లో ఆడియో, వీడియో రికార్డింగ్‌ చేర్పు.
  • 35 నేరాల్లో సత్వర న్యాయానికి సమయ నిర్దేశం.

భారతీయ సాక్ష్య (BS) చట్టంలోని ముఖ్యాంశాలు :
Bharatiya Sakshya : భారతీయ సాక్ష్య చట్టంలో సాక్ష్యానికి నిర్వచనం ఇచ్చారు. రెండు కొత్త సెక్షన్లు, 6 సబ్‌ సెక్షన్ల జోడించారు. 5 వివరణల జోడించారు. 4 వివరణల తొలగించారు. ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో సాక్ష్యం సేకరణకు అనుమతించారు.

  • 2 నిబంధనల జోడింపు. 24 నిబంధనల తొలగింపు.
  • మొత్తంగా 6 సెక్షన్ల తొలగింపు.
  • దస్త్రాల్లో ఎలక్ట్రానిక్‌ రికార్డుల జోడింపు
  • ఎలక్ట్రానిక్‌ సాక్ష్యాల స్టోరేజీ, కస్టడీ, ప్రసారం వంటి అంశాల సమర్థ నిర్వహణ.
  • సెకండరీ సాక్ష్యం నోటిమాటగా, లిఖితపూర్వకంగా సేకరణ.
  • న్యాయపరంగా ఆమోదించేలా, విలువ ఉండేలా, ఎన్‌ఫోర్స్‌ చేసేలా ఎలక్ట్రానిక్‌, డిజిటల్‌ రికార్డుల నిర్వహణ.
  • భార్యాభర్తల కేసుల్లో కాంపిటెంట్‌ సాక్ష్యం సేకరణ.
  • వలసపాలక పదబంధాల తొలగింపు.
  • భాష ఆధునికీకరణ. లింగ సున్నితత్వానికి గౌరవం.

పరివార్‌వాదం, అవినీతి, బుజ్జగింపులకు మించి కాంగ్రెస్ ఆలోచించదు: మోదీ

కాంగ్రెస్, ఆప్​ మధ్య కుదిరిన పొత్తు- పంజాబ్​లో మాత్రం విడివిడిగా పోటీ

Last Updated : Feb 24, 2024, 4:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.