ETV Bharat / bharat

సెక్రటేరియట్ పైనుంచి దూకిన డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యేలు - NCP Leader Jumped Mantralaya - NCP LEADER JUMPED MANTRALAYA

NCP Leader Jumped Mantralaya : మహారాష్ట్ర సచివాలయ మూడో అంతస్తు నుంచి డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ సహా పలువురు ఎమ్మెల్యేలు కిందకు దూకారు. అసలేం జరిగిందంటే?

NCP Leader Jumped Mantralaya
NCP Leader Jumped Mantralaya (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 4, 2024, 1:19 PM IST

Updated : Oct 4, 2024, 4:16 PM IST

NCP Leader Jumped Mantralaya : మహారాష్ట్ర సచివాలయం పైనుంచి అధికార కూటమి శాసనసభ్యులు కిందకు దూకడం కలకలం రేపింది. గిరిజన తెగకు సంబంధించి రిజర్వేషన్‌ విషయంలో నిరసన తెలుపుతూ అజిత్‌ పవార్‌ వర్గానికి చెందిన డిప్యూటీ స్పీకర్‌ నరహరి ఝిర్వాల్‌ సహా పలువురు ఎమ్మెల్యేలు భవనంపై నుంచి శుక్రవారం ఉదయం కిందకు దూకారు. అయితే ఇలాంటి ఘటనలను అడ్డుకునేందుకు ఇప్పటికే అధికారులు ఏర్పాటు చేసిన సేఫ్టీ నెట్​లో పడి వారు చిక్కుకుపోయారు. వారందరినీ పోలీసులు సురక్షితంగా కిందకు తీసుకొచ్చారు. ఈ పరిణామాలతో సచివాలయ ప్రాంగణంలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

అసలేం జరిగిందంటే?
ధన్‌గఢ్‌ కమ్యూనిటీని ఎస్టీ కేటగిరీలో చేర్చాలన్న డిమాండ్‌ను మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పరిగణనలోకి తీసుకుంది. దీన్ని వ్యతిరేకిస్తూ ఆదివాసీ వర్గానికి చెందిన ఎన్సీపీ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్‌ నరహరి ఝిర్వాల్‌తో పాటు బీజేపీ ఎంపీ హేమంత్ సావ్రా, ఎమ్మెల్యేలు కిరణ్ లహమాటే, హిరామన్ ఖోస్కర్, రాజేష్ పాటిల్ నిరసన చేపట్టారు. సచివాలయంలోని మూడో అంతస్తు నుంచి ఒక్కసారిగా కిందకు దూకారు. మొదటి అంతస్తు వద్ద ఏర్పాటు చేసిన సేఫ్టీ నెట్‌లో అంతా పడ్డారు. గమనించిన పోలీసులు వెంటనే వారిని రక్షించారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేలు అంతా సచివాలయం ముందు బైఠాయించి ఆందోళన కొనసాగించారు.

    \

'నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు ధర్నా'
ధన్‌గఢ్‌ కమ్యూనిటీ సభ్యుల అభివృద్ధికి ప్రభుత్వం వివిధ పథకాలను ప్రకటించడంలో తమకు ఎలాంటి సమస్యలు లేవని, అయితే వారిని ఎస్టీ జాబితాలో చేర్చడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని ఝిర్వాల్‌ తెలిపారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు మంత్రాలయం (సచివాలయం) వద్దే ధర్నా కొనసాగిస్తామని చెప్పారు. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే వారితో సమావేశమై ఎమ్మెల్యేల సమస్యలు పరిష్కరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
సచివాలయం పైనుంచి కొందరు దూకేందుకు ప్రయత్నించిన ఘటనలు పలుమార్లు జరిగాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా 2018 ఫిబ్రవరిలో సచివాలయం మొదటి అంతస్తు వద్ద భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు.

Last Updated : Oct 4, 2024, 4:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.