Naxalite Killed In Encounter Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఘటన మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో బీజాపుర్ జిల్లా గంగలూర్ పోలీస్టేషన్ పరిధిలో లేంద్ర గ్రామ అటవీ ప్రాంతంలో జరిగింది. ఘటనా స్థలం నుంచి నక్సలైట్ల మృతదేహాలు, కొన్ని ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
'డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్(DRG), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF) కోబ్రా దళానికి చెందిన సిబ్బంది కలిసి యాంటీ నక్సల్ ఆపరేషన్‌ను చేపట్టాయి. ఈ క్రమంలోనే భద్రతా సిబ్బందిపై నక్సల్స్ కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టులు మరణించారు.' అని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ తెలిపారు.
ఇటీవల బీజాపుర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మహిళతో సహా ఆరుగురు నక్సల్స్ మరణించారు. చికుర్‌బత్తి - పుస్బాక సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
మరోవైపు, బీజాపుర్తో సహా ఏడు జిల్లాలతో కూడిన బస్తర్ ప్రాంతంలో ఈ ఏడాది భద్రతా దళాలు జరిపిన ఎన్కౌంటర్లలో మృతిచెందిన నక్సలైట్ల సంఖ్య 37కు చేరింది. బీజాపుర్ జిల్లా, బస్తర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఇక్కడ ఏప్రిల్ 19న మొదటి దశలో పోలింగ్ జరగనుంది.
మధ్యప్రదేశ్‌లో ఇద్దరు నక్సలైట్లు మృతి
మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో సోమవారం పోలీసులు జరిపిన ఎన్కౌంటర్లో నగదు రివార్డులున్న ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. కేరజారి అటవీ ప్రాంతంలో సోమవారం రాత్రి 9-10 గంటల సమయంలో పోలీసులు నక్సలైట్ల మధ్య కాల్పులు ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. మృతులను సజంతి అలియాస్ క్రాంతి, రఘు అలియాస్ షేర్ సింగ్‌గా అధికారులు గుర్తించారు. ఘటనా స్థలం నుంచి నక్సలైట్ల మృతదేహాలతో పాటు ఏకే-47 రైఫిల్, 12 బోర్ రైఫిల్స్, నిత్యావసర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
ఇటీవలే మహారాష్ట్రలో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు నక్సలైట్లు మరణించారు. మరణించిన నలుగురూ తెలంగాణ రాష్ట్ర కమిటీ మావోయిస్టులుగా అధికారులు గుర్తించారు. గడ్చిరోలి జిల్లాలో 60 కమాండర్లతో ఆపరేషన్ జరిగిందని తెలిపారు.
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్- ముగ్గురు భద్రతా సిబ్బంది వీరమరణం