Murg Malai Tikka Making Process: చికెన్ అంటే ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు చికెన్‌తో చేసిన అన్ని రకాల వంటలను ఇష్టపడతారు. అయితే చికెన్‌తో కేవలం కూర, ఫ్రై, పులుసు, పచ్చడి.. ఇలానే కాకుండా స్టార్టర్, లాలీపాప్, కబాబ్, టిక్కాలు కూడా చేసుకుంటారు. అయితే.. మర్గ్ మలై టిక్కాను మీరెప్పుడైనా టేస్ట్ చేశారా? బయట రెస్టారెంట్లలో కొన్న వాటికంటే కూడా టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. అంతేకాదు.. దీనిని తయారు చేయడం కూడా చాలా ఈజీ. మరి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలేంటి? తయారీ విధానం ఏంటి? అన్నది ఈ స్టోరీలో చూద్దాం..
మర్గ్ మలై టిక్కా కోసం కావాల్సిన పదార్థాలు:
- బోన్‌లెస్ చికెన్ - 200 గ్రాములు(క్యూబ్స్‌గా కట్‌చేసుకోవాలి)
- ఉల్లిపాయ - 1(రౌండ్‌గా కట్ చేసుకోవాలి)
- క్రీమ్ చీజ్ - 3 టేబుల్ స్పూన్లు
- అల్లం పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
- గ్రీన్ చట్నీ - 3 టేబుల్ స్పూన్లు
- కార్న్ ఫ్లోర్ -1 టీస్పూన్
- కారం - 1 టీస్పూన్
- ఎండిన మెంతి ఆకులు - 1 టేబుల్ స్పూన్
- గ్రీక్ యోగర్ట్ - 1 కప్పు
- సోర్ క్రీమ్ - 1 టేబుల్ స్పూన్
- వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
- నిమ్మరసం - 1 టేబుల్‌స్పూన్
- జీలకర్ర పొడి - 1 టీ స్పూన్
- ఆవ నూనె -2 టేబుల్ స్పూన్లు
- తరిగిన కొత్తిమీర - గుప్పెడు
- ఉప్పు - రుచికి సరిపడా
తయారీ విధానం:
- ముందుగా ఓ బౌల్ తీసుకుని ఉల్లిపాయ, చికెన్, నూనె మినహా మిగిలిన పదార్థాలు అన్ని వేసుకుని మెత్తని పేస్ట్ అయ్యేవరకు కలపాలి.
- తర్వాత అందులోకి చికెన్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేయాలి. మిశ్రమం మొత్తం ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి.
- ఆ తర్వాత బౌల్‌పై మూత పెట్టి ఫ్రిజ్‌లో పెట్టి.. సుమారు 45 నిమిషాల నుంచి గంట పాటు ఉంచాలి.
- తర్వాత స్టవ్ లేదా కట్టెల పొయ్యి మీద(కట్టెల పొయ్యి మీద చేస్తే బొగ్గులతో మంట చేసుకోవాలి) గ్రిల్ పెట్టి వేడి చేయాలి.
- ఇప్పుడు ఫ్రిజ్‌లో నుంచి తీసిన చికెన్ ముక్కలను ఓ పుల్లకు గుచ్చి గ్రిల్ మీద 3 నుంచి 4 నిమిషాలు ఉంచాలి.
- ఆ తర్వాత దానిని మరో వైపుకు తిప్పుకుని కాల్చుకోవాలి.
- అలా గోల్డెన్ కలర్ వచ్చేవరకు రెండువైపులా కాల్చుకోవాలి. అలా కాల్చుకునేటప్పుడు నూనె అప్లై చేయాలి.
- చికెన్ ముక్కలు మంచిగా కాలిన తర్వాత ఓ ప్లేట్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి.
- అంతే ఎంతో టేస్టీగా ఉండే ముర్గ్ మలై టిక్కా రెడీ. మరి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి.
చికెన్ మహారాజ రెసిపీ - ఒక్కసారి తిన్నారంటే
తందూరి చికెన్ రోల్స్ ట్రై చేస్తారా? - ఇంట్లోనే యమ్మీ యమ్మీగా లాంగిచేస్తారు!
నోరూరించే పులావ్- ఇలా చేశారంటే వహ్వా అంటూ ప్లేట్లు నాకాల్సిందే!